Tuesday, August 4, 2009

అద్వైత వేదాంతం (ఆంగ్లం : Advaita Vedanta); సంస్కృతం अद्वैत वेदान्त ); వేదాంతానికి చెందిన ఒక ఉపశాఖ లేదా తాత్విక వాదం. హిందూ తత్వశాస్త్రాల ప్రకారం దీని అర్థం "వేదముల లక్ష్యము".
వేదాంతాల ఇతర ఉపశాఖలు ద్వైతం మరియు విశిష్టాద్వైతం.
అద్వైతం అనగా భాషాపరంగా అర్థం "ద్విత్వం"కానిది, జీవాత్మ ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక.ఆది శంకరాచార్యులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

చారిత్రకంగా దీని ప్రతిపాదకుడు గౌడపాదాచార్యుడు. ఇతడు శంకరుని గురువైన గోవింద భగవత్పాదునకు గురువు. అయితే మనకు లభించిన సాహిత్యం ప్రకారం ఈ తత్వానికి మూలగ్రంధాలు ప్రస్థానాత్రయం అనగా ఉపనిషత్తులు, భగవద్గీత మరియు బ్రహ్మసూత్రాలకు శంకరుడు రచించిన భాష్యాలు.

అద్వైతాన్ని క్లుప్తంగా చెప్పే శంకరుని వచనాలు -

బ్రహ్మ సత్యం జగన్మిధ్య
జీవీ బ్రహ్మైన నా పరః

బ్రహ్మమొక్కటే సత్యం. జగత్తు మిధ్య. ఈ జీవుడే బ్రహ్మం. జీవుడు, బ్రహ్మము వేరు కాదు. - ఇదే శంకరుని మాయావాదంగా ప్రసిద్ధమైనది. అయితే కంటికి కనిపిస్తున్న జగత్తు మిధ్య కావడమేమిటి? ఏనుగు తరుముకొస్తుంటే పారిపోవక తప్పదు కదా? - ఇందుకు మాయావాదం వివరణ : జగత్తులో జీవిస్తున్నంతకాలం దాని ఉనికి అనే భావనకు తగినట్లుగానే (అనగా అది యదార్ధమన్నట్లుగానే) ప్రవర్తించాలి. ఎప్పుడైతే ఇదంతా మిధ్య అన్న జ్ఞానం గోచరమౌతుందో అపుడు అందుకు అనుగుణమైన ప్రవర్తన దానంతట అదే వస్తుంది.

భారతీయ తత్వవేత్తలందరిలాగానే శంకరుడు కూడా జగత్తును దుఃఖమయమైన సంసార బంధనంగా దర్శించాడు. ఈ జీవితంలో సుఖం అనిపించేది ఒక భ్రమగా భావించాడు. మరి ఈ ఎడతెరిపి లేని దుఃఖానికి కారణం ఏమిటి? "ఆత్మానాత్మ వివేకం" అనే ప్రకరణ గ్రంధంలో శంకరుడు ఇలా వివరించాడు -

ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?

పూర్వ జన్మ లలోని కర్మ వలన.

కర్మ ఎందుకు జరుగుతుంది?

రాగం (కోరిక) వలన.

రాగాదులు ఎందుకు కలుగుతాయి?

అభిమానం (నాది, కానాలి అనే భావం) వలన.

అభిమానం ఎందుకు కలుగుతుంది?

అవివేకం వలన

అవివేకం ఎందుకు కలుగుతుంది?

అజ్ఞానం వలన

అజ్ఞానం ఎందుకు కలుగుతుంది?

అజ్ఞానానికి కారణం లేదు. అది అనాదిగా ఉన్నది. (వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. అందుకు కారణం ఉండదు.) దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానం.

అనగా అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానం వలన రాగాదులు, రాగాదుల వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ), అందువలన దుఃఖం కలుగుతున్నాయి.

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070