మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న, చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులో పోడుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
Thursday, September 10, 2009
ఆచార్యదేవోభవ!
- కర్లపాలెం హనుమంతరావు
'గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా. యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు.
రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది. అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు. అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చి ఇచ్చే శ్రమ తీసుకున్నాడు.
గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల తార్కాణం.చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు. క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు. కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా.
మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు. పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది!
నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.
మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్ ఆఫ్ వేల్స్' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!
దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు. బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.
గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది. 'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.
గురువులు అష్టవిధాలు.
అక్షరాభ్యాసం చేయించినవాడు, గాయత్రి ఉపదేశించినవాడు, వేదాధ్యయనం చేయించినవాడు, శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు, పురోగతి కోరేవాడు, మతాది సంప్రదాయాన్ని నేర్పేవాడు, మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు, మోక్షమార్గాన్ని చూపించేవాడు
అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు. దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.
(ఈనాడు, ౦౫:౦౯:౨౦౦౯)
____________________________

Monday, August 3, 2009
టాపర్లు చదివే పద్ధతి ఇదే!
సత్య
చదవడం అంటే కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదు.
చదివినదాన్ని అర్థం చేసుకోవడం,
గుర్తుపెట్టుకోవడం,
వ్యక్తీకరించడం,
పునర్నిర్మించటం కూడా.
ప్రపంచ వ్యాప్తంగా టాపర్లు అనుసరిస్తున్న శాస్త్రీయమైన పఠన పద్ధతిని తెలుసుకుందాం!
పాఠ్యపుస్తకాలూ, వ్యాసాలూ, నివేదికలూ లాంటి ఎలాంటివాటినైనా క్రమపద్ధతిలో చదివి గుర్తుపెట్టుకోవడానికి విద్యావేత్తలు ఓ శాస్త్రీయ విధానం రూపొందించారు. అదే SQ3R.దేశవిదేశాల్లో విశేష ప్రాచుర్యం పొందిన ఈ పఠన పద్ధతికి రూపకల్పన చేసిన విద్యావేత్త ఫ్రాన్సిస్ రాబిన్సన్. 1941లో రూపొందిన ఈ పఠన పద్ధతి కాలానుగుణంగా అనేక రూపాంతరాలు పొంది, SQ4R,SQ7R విస్తృతితోపాటు SQRW సంక్షిప్త రూపం కూడా సంతరించుకుంది.
ఎన్ని రూపాంతరాలు వచ్చినా ఓ మంచి పఠన పద్ధతిగా కోట్లమంది సూపర్ విద్యార్థులు అనుసరిస్తున్న చదువు ఫార్ములా SQ3R.
ఆ ఫార్ములా మూల స్వభావాన్ని మార్చకుండా కొద్దిపాటి చేర్పులతో గరిష్ఠ లబ్ధి ఎలా పొందొచ్చో తెలుసుకుందాం.
విహంగ వీక్షణం (Survey)
SQ3R మొదటిది S- సర్వే. అంటే విహంగ వీక్షణం. వివరాల్లోకి పోకుండా విషయాన్ని తెలుసుకోవడం. దీనికి మరోపేరు క్విక్ రీడ్/ప్రీ రీడ్. ప్రముఖ విద్యావేత్త వై.సి. హాలన్ ఇది ఏడు దశల్లో ఉండొచ్చని సూచించాడు.
* వ్యాస సారాంశం ప్రతిఫలించేలా శీర్షిక ఉంటుంది. శీర్షికను చూడగానే దానికి సంబంధించి అదివరకే తెలిసిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవాలి.
* మొదటి పేరాగ్రాఫ్‌ను చదవాలి. రచయిత తాను విశదం చేయబోయే విషయాన్ని ఇందులో ఆవిష్కరిస్తాడు.
* ఉప శీర్షికలను (Side headings) చూడాలి. ప్రధాన భావాలకు ఇవి టార్చిలైట్లుగా పనికొస్తాయి.
* పేరాల్లోని కీలక పదాలను (Key words)పట్టుకోవాలి. ఇవి ఇటాలిక్స్‌లో కానీ, ప్రత్యేక ఆకృతిలో కానీ ఉండవచ్చు.
* బొమ్మలు, రేఖాచిత్రాలు, టేబుల్స్ వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. అసలు విషయం అర్థం కావడానికి ఇవి తోడ్పడతాయి.
* చివరి పేరాగ్రాఫ్‌ను జాగ్రత్తగా చదవాలి. విషయ సారాంశం ఇందులో ఉంటుంది.
* ఇవన్నీ పూర్తయ్యాక, కళ్ళు మూసుకుని మనం తెలుసుకున్న విషయాలను మననం చేసుకోవాలి. దీనివల్ల విషయంలోని ప్రధాన భావాలు స్పష్టమవుతాయి.
ఈ 'సర్వే' 4- 5 నిమిషాలు మించకూడదు.
ప్రశ్నించడం (Question)
చదివినదాని నుంచి ఫలితం సాధించాలంటే... ఆ చదివే విధానం క్రియాశీలం (active) గా ఉండాలి. అసలు ఎందుకు చదవాలి, ఏం తెలుసుకోవాలనేది స్పష్టం కావాలి. అందుకు ఉపకరించేది ప్రశ్న. 'ప్రశ్నలకు సమాధానం రాబట్టే విధానం'తో చదవడం వల్ల విషయం బాగా ఒంటబడుతుంది. అందుకు మనం తయారుచేసుకునే ప్రశ్నలనిధి (క్వశ్చన్ బ్యాంక్) దోహదం చేస్తుంది. పాఠం చివర ఇచ్చే ప్రశ్నలూ, అధ్యాపకుడు అడిగే ప్రశ్నలూ, పాత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలూ ఈ 'నిధి'లో ఉండేట్టు చూసుకోవాలి. ఇంకా...
* ఉపశీర్షికలకు ప్రశ్నల రూపం: వ్యాసంలోని ఉపశీర్షికలను ప్రశ్నలుగా మార్చివేసి వాటిని నోట్సులో రాసుకోవాలి. ప్రశ్నకూ, ప్రశ్నకూ మధ్యలో జవాబులు రాసుకోవడానికి వీలుగా నాలుగైదు వాక్యాలు రాసుకునే జాగా వదిలివేయాలి.
* భావ స్పష్టత: ప్రతి రచయితా తన భావ ప్రకటన కోసం కొన్ని నిర్దిష్ట పదాలను వాడతాడు. ఆ పదాలకుండే అర్థాన్ని తెలుసుకుంటే తప్ప అతని భావం స్పష్టం కాదు. ఉదాహరణకు... లౌకికవాదం (సెక్యులరిజం) అనే పదం మన రాజ్యాంగంలో ఉంది. దానికి వివరణ లేకపోవటం వల్ల లౌకికవాదానికి ఎవరికి తోచిన అర్థం వారు తీసుకోవడంతో గందరగోళం నెలకొంది. అలాంటి పదమే సామాజిక న్యాయం. అందువల్ల నిర్దిష్ట పదాలను ప్రశ్నించుకోవాలి.
* విషయ యదార్థత: రచయిత చెప్పే విషయాలు యథార్థమైనవేనా అని ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించడం వల్ల భావ స్పష్టత, విషయ యదార్థత అవగతమవుతాయి.
3 R:- READ, RECITE and REVIEW
చదవడం (READ)
3 R మొదటి R-READ - చదవడం.
* సమాచారంలో అప్రధాన భావాలనుంచి ప్రధాన భావాలను వేరు చేయాలి. ముఖ్యమైన భావాలను, కీలక పదాలను పట్టుకొని వాటి అర్థాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి.
* రచనలో ఓ నిర్మాణం (Structure) ఉంటుంది. అందులో ఉపోద్ఘాతం, అసలు విషయం, ముగింపు ఉంటాయి. విషయంలో కొన్ని ముఖ్య భావాలు పరిణామ క్రమంలో ఉంటాయి. ఈ నిర్మాణాన్ని అర్థం చేసుకోగలిగితే రచయిత ఆంతర్యం అవగతమై, విషయం అర్థమవుతుంది; స్పష్టంగా గుర్తుంటుంది.
* వ్యాసంలో కొంత భాగాన్ని చదివాక, ఎంతవరకు మనం అర్థం చేసుకున్నామో సింహావలోకనం చేసుకోవాలి. దాన్ని మన సొంత మాటల్లో సమీక్షించుకోవాలి. జ్ఞాపకానికి రానివాటిని తిరిగి చూడాలి. ముఖ్యమైన భాగాలను అండర్‌లైన్ చేసుకోవాలి. మనకు స్ఫురించిన భావాలు మార్జిన్లో రాసుకోవాలి. ఇది విషయ అవగాహనకు ఎంతగానో దోహదపడుతుంది.
ఇప్పుడు మరో ప్రధానమైన పనిచేయాలి. ప్రశ్నలుగా మార్చుకున్న ఉపశీర్షికలకు తగిన జవాబులు ఈ చాప్టరులో ఉన్నాయో లేదో చూసుకోవాలి. నోట్సు పుస్తకంలో రాసుకున్న ప్రశ్నల కింద వదిలిన స్థలాల్లో ఇప్పుడు జవాబులు రాసుకోవాలి. జవాబులు లేనిపక్షంలో ఆ ప్రశ్నలను తీసివేయాలి. లేదా ఆ ప్రశ్నలకు జవాబులు మరో పుస్తకంలో దొరికితే వాటిని ఇక్కడ లిఖించుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల రచయిత ఏం చెప్పాడో, ఎంత చెప్పాడో తెలుస్తుంది. ఎక్కడెక్కడ జవాబులు పేలవంగా ఉన్నాయో, వాటి నాణ్యత పెంచడానికి ఏమేం పాయింట్లు చేర్చాలో విశదమవుతుంది.
వల్లెవేయడం (RECITE)
3 R లో రెండో R 'RECITE'. అంటే తిరిగి చెప్పటం/ వల్లె వేయటం. ప్రశ్నలకు రాసుకున్న సమాధానాలను చూడకుండా వల్లించగలగాలి. ఎవరైనా మిత్రుడికి చెప్పాలి లేదా తానే వల్లించుకోవాలి. ఇలా ఏది చేసినా అది రచయిత మాటల్లో కాకుండా సొంత మాటల్లో చెప్పాలి.
ఒకసారి చదివిన విషయాన్ని తిరిగి చదవకపోతే రెండు వారాల్లోపల దాదాపు 80 శాతం సమాచారాన్ని మర్చిపోతామనీ, అలాకాక చదివిన విషయాన్ని వెంటనే వల్లెవేయడం వల్ల 80 శాతం విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చనీ పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
వల్లెవేయడం మౌఖికంగానే ఉండనక్కర్లేదు. చదివినదాన్ని రాయడం కూడా వల్లెవేయడమే. వీటితోపాటు- చదివినదాన్ని ఇతరులకు బోధించడం ద్వారా ఎక్కవ నేర్చుకోవచ్చని విద్యావేత్తలు వివరిస్తున్నారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు స్టీవెన్ ఆర్ కవీ తన సెమినార్ ప్రారంభంలో ఈ పద్ధతి గురించి వివరించి దాన్ని అభ్యాసం చేయిస్తాడు. బోధించడం ద్వారా నేర్చుకోవడం (Learning through teaching)) అనేది శక్తిమంతమైన ప్రక్రియ అంటారాయన.
సమీక్షించుకోవడం (REVIEW)
3 R మూడోది 'రివ్యూ'. అంటే సమీక్షించుకోవడం. మనం తయారుచేసుకున్న ప్రశ్న జవాబుల్లో ఉండే స్టడీ గైడ్‌ను తరచూ చూసుకుంటూ అందులోని అంశాలను సమీక్షించుకుంటూ ఉండాలి. కొద్దిపాటి సమయం దొరికిన ప్రతిసారీ వాటిని చూస్తూఉండాలి. చూడడం అంటే పైపై చూడటం కాదు.
* విషయానికి లోతు (Depth)ఉంటుంది. ఒకే విషయానికి సంబంధించిన వేర్వేరు అంశాలను నిశితంగా తెలుసుకోవాలి. ఉదాహరణకు... చంద్రయాన్- ఈ గురించి మాట్లాడేటప్పుడు మన రాకెట్ల పరిజ్ఞానం గురించీ, ఇంతవరకు భారత్‌లో, ఇతరదేశాల్లో జరిగిన పరిశోధనల గురించీ, చంద్రమండలంపై జరగబోయే పరిశోధనల గురించీ, వాటివల్ల భారత్‌కూ, ప్రపంచానికీ లాభాల గురించీ, భవిష్యత్తులో జరగబోయే పరిశోధనలకు ఇది ఎంతవరకూ సహకరించగలతో ఆ వైనం గురించీ... ఇలా లోతుగా తెలుసుకోవాలి.
*విషయానికి విపులత (Width))ఉంటుంది. అనేక అంశాలకు చెందినవాటి గురించి తెలుసుకోవడమన్నమాట. ఉదాహరణకు... శాస్త్ర సంబంధమైన అంశాలనే కాకుండా చరిత్ర, సంగీతం, సాహిత్యం, మనో విజ్ఞానం, యాజమాన్య విద్య లాంటి అంశాల గురించి తెలుసుకోవడం, వాటి దృష్ట్యా విషయాన్ని విశ్లేషించడం.
ఈ విధంగా విషయం లోతునూ, దాన్ని విపులతనూ సమీక్షించగలిగితే దాన్ని అర్థం చేసుకోవడం తేలిక. అంతే కాదు, దానివల్ల విషయ వ్యక్తీకరణలో నిండుదనం వస్తుంది.
పఠనంలో ఈ ఐదు అంశాలనూ విహంగవీక్షణం, ప్రశ్నించడం, చదవడం, వల్లెవేయడం, సమీక్షించుకోవడం చేయగలిగితే ప్రతి విద్యార్థీ ఓ సూపర్ విద్యార్థి కాగలుగుతాడు.
ఈ SQ3Rపాటు ఇటీవల ఎంతో ప్రాచుర్యం పొందుతున్న మరొక విధానం- 'పవర్ రీడింగ్'. దీని పవర్ ఏమిటో చూద్దాం!
whysatyanarayana@yahoo.co.in
(ఈనాడు, చదువు , ౨౩:౦౨:౨౦౦౯)
_____________________________
'పవర్ రీడింగ్'
మెల్లగా చదివితే మేలా?
సత్య
కొందరిది మెల్లగా చదివే అలవాటు. మరికొందరు వేగంగా చదివేస్తుంటారు. వీటిలో ఏ పద్ధతి సరైనది? చక్రానికి వేగం పెరిగేకొద్దీ దాని శక్తి పెరుగుతుంది కదా? చదువు కూడా అంతే! వేగం పెరిగేకొద్దీ, దాని పవర్ పెరుగుతుంది. పుస్తకాల్లోని విషయాన్ని వేగంగా గ్రహించడానికి విద్యావేత్తలు పరిశోధించి కనిపెట్టిన కొన్ని కిటుకులున్నాయి. వాటిని తెలుసుకుందామా?
సగటు విద్యార్థుల దృష్టిలో చదవటం అంటే ఓ సబ్జెక్టు గురించి తెలుసుకోవడం/దాన్ని అర్థం చేసుకోవడం. ఉత్తమ విద్యార్థుల దృష్టిలో- వీటితోపాటు పుస్తకంలోని కీలక సమాచారాన్ని వేగంగా రాబట్టి ఒంటపట్టించుకోవడం కూడా. దీనికి వారు ఉపయోగించే పద్ధతే 'పవర్ రీడింగ్'. ఏం చదవాలో, ఎలా చదవాలో, ఎంత వేగంతో చదవాలో వివరించే ప్రక్రియ ఇది.
పవర్‌రీడింగ్ ప్రక్రియనూ, పదబంధాన్నీ ప్రాచుర్యంలోకి తెచ్చిన విద్యావేత్త రిక్ ఆస్ట్రోవ్. పఠనంపై జీవితకాలం పరిశోధించిన ఆస్ట్రోవ్ 1978లోనే పవర్ రీడింగ్ కోసం ఓ కోర్సును ప్రారంభించాడు. ఈయనతోపాటు 'ఏడమ్ కూ' అనే యువ విద్యావేత్త కూడా దీనిపై కొత్తకోణాలు ఆవిష్కరించాడు.
పవర్ రీడింగ్‌లో ఉన్న నాలుగు ప్రధాన అంశాలు పరిశీలిద్దాం.
1. కీలక సమాచారం సేకరించడం
ఓ పుస్తకంలో ఎన్ని పేజీలు చదివామనేది కాదు; దాన్నుంచి ఎంత విలువైన సమాచారాన్ని సేకరించామనేది ముఖ్యం. ఏ పుస్తకంలో అయినా కేవలం 20 శాతం మాటలే మొత్తం సమాచారాన్ని అందిస్తాయి. ఇవే కీలక పదాలు (కీ వర్డ్స్). వీటిలోనే విషయం- అసలైన పవర్ ఉంటుంది. మిగతా 80 శాతం అప్రధానమైన, శక్తిహీనమైన వ్యర్థపదాలే. కీలక పదాలనూ, కీలక భావాలనూ మిగతా అప్రధాన పదాల నుంచి వేరు చేసి ఒంట పట్టించుకోవడమే పవర్ రీడింగ్.
రాతలోని 20 శాతం పదాల్లోనే సారమంతా ఉంటే మిగతా 80 శాతం పదాలను రచయితలు ఎందుకు ఉపయోగిస్తారనే సందేహం వస్తుంది.
* మొట్టమొదటిసారి ఓ పుస్తకాన్ని చదివేటప్పుడు విషయం స్పష్టంగా అర్థం కావడానికీ, భావాల మధ్య సంబంధాన్ని తెలియజేయడానికీ ఈ అప్రధాన పదాలు అవసరమవుతాయి.
* కానీ రెండోసారీ, మూడోసారీ చదివేటప్పుడు ఈ వ్యర్థపదాలే 80 శాతం కాలాన్ని హరించివేస్తూ ఉంటాయి.
రైతు వరి చేను నుంచి ధానాన్ని వేరుచేసి, మిగతా గడ్డీగాదరను వదిలేసినట్టుగా పుస్తకంలోని కీలక పదాలను సేకరించి, మూలసారాన్ని గ్రహించి, పిప్పిని వదిలెయ్యాలి. ఇది పవర్ రీడింగ్‌కు ప్రాణం.
2. అర్థం చేసుకుంటూ చదవటం (comprehension)
పుస్తకంలోని ఒక్కో పదం ఒక్కో ఇటుక లాంటిది. వాటిని ఓ క్రమపద్ధతిలో పేర్చి తన భావాలకు వాహికగా తయారుచేస్తాడు రచయిత. పాఠకుడు వాటిని గ్రహించి, రచయిత భావాన్ని ఇటుక ఇటుకగా తన మనసులో పునర్నిర్మించుకోవాలి. దాన్ని సక్రమంగా నిర్మించుకుంటేనే రచయిత భావం పాఠకునిలో ఆవిష్కారమవుతుంది.
రచయిత ఒక్కోసారి కొత్త పదాలనూ, పదబంధాలనూ సృష్టిస్తుంటాడు. అదివరకే ఉన్న పదాలను కొత్త అర్థాల్లో వాడుతూ ఉంటాడు. అలాంటివాటిని స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
చదవడం అడవిలో ప్రయాణం లాంటిది. పాఠకుడు సాఫీగా ప్రయాణించడానికి అడవిలో ఓ దారి ఏర్పాటు చేస్తాడు రచయిత. అయితే ఆ ప్రయాణంలో తారసిల్లే అనేక చెట్లలాంటి భావాల మధ్య దృష్టి చెదరి పాఠకుడు దారితప్పిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో దారి తప్పిన ప్రయాణికుడు తెలిసిన దారి దగ్గరకు తిరిగి వచ్చి ప్రయాణం సాగించి, గమ్యం చేరతాడు. అలాగే పాఠకుడు కూడా తాను మరోమార్గంలో వెళ్తున్నట్టు గ్రహించగానే తెలిసిన విషయం దగ్గరకు చేరుకుని తిరిగి చదవడం ప్రారంభించాలి.
3. ఏకాగ్రత పాటించడం (concentration)
ఓ పని చేస్తున్నపుడు మూడు ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి.
ఒకటి: చేస్తున్న పని.రెండు: దానికి సంబంధించిన ఆలోచనలు.
మూడు: దానికి సంబంధం లేని ఆలోచనలు.
చేస్తున్న పనిలో పూర్తిగా నిమగ్నమైతే ఏ ఆలోచనలూ రావు. వచ్చినా పనికి సంబంధించిన ఆలోచనలై ఉంటాయి. అప్పుడే పూర్తి ఏకాగ్రత కుదురుతుంది. అయితే అది అందరికీ సాధ్యం కాదు.
కొన్ని వాక్యాలు/పేరాగ్రాఫులు చదివాక అకస్మాత్తుగా మనసు చదువుతున్న విషయాన్ని విస్మరించి మరేవో విషయాలను తరుముకుంటూ పోతుంది. అలాంటప్పుడు ఏకాగ్రత భగ్నమై చదివే విషయం అర్థం కాకుండా పోతుంది. అందువల్ల చదివేటప్పుడు ధ్యాసంతా చదివే విషయంపైనే కేంద్రీకరించాలి.
పనిలో నిమగ్నం కావడం, పనికి సంబంధించిన ఆలోచనలు చేయడం, పనికి ఆటంకం కలిగించే ఆలోచనలను విస్మరించడం కేవలం ఏకాగ్రతతోనే సాధ్యం.
4. పఠనంలో వేగం (speed reading)
చక్రానికి వేగం పెరిగేకొద్దీ దాని శక్తి పెరుగుతుంది. అలాగే చదువు వేగం పెరిగేకొద్దీ, చదువు పవర్ పెరుగుతుంది. ఈ పోటీ ప్రపంచంలో నిలవాలంటే విషయాన్ని వేగంగా అందిపుచ్చుకోవడం తప్పనిసరి. అందుకు కొన్ని కొత్త అలవాట్లు నేర్చుకోవాలి. కొన్ని పాత అలవాట్లు మార్చుకోవాలి.
సగటు విద్యార్థి కన్ను ప్రతి పదాన్నీ పలకరిస్తుంది. పదం నుంచి అది మరో పదానికి వెళ్ళడానికి కనీసం అరసెకను కాలాన్ని కేటాయిస్తే నిమిషంలో 120 మాటలు మించి చదవడానికి వీలు కాదు. దీనివల్ల చదువు సాగదు.
చదువులో వేగం పెరగాలంటే మన కన్ను చూడవలసింది ఒకసారి ఒక పదాన్ని కాదు; కనీసం రెండు మూడు పదాలను. అలా చేస్తే నిమిషంలో 240-360 పదాలను పూర్తిచేయవచ్చు. ఇది మధ్యస్థ విద్యార్థి చదివే వేగం.
అయితే ఉత్తమ విద్యార్థి నిమిషానికి 600-840 మాటలను అవలీలగా పూర్తిచేస్తాడు. అతని కన్ను 5 నుంచి 7 పదాలను క్లిక్‌మన్పిస్తుంది. అంటే సగటు విద్యార్థి కంటే ఉత్తమ విద్యార్థి మూడు రెట్లు వేగంగా చదువుతాడు.
వేగంగా చదవడానికి ఈ కొత్త అలవాటుతో పాటు అంతవరకూ ఉన్న కొన్ని పాత అలవాట్లను మార్చుకోవాలి. అవి...
*పెదాలతో చదవడం (lip reading):కొందరు పైకి బిగ్గరగా చదువుతారు. కొందరు పైకి చదవకపోయినా పెదాలతో చదువుతారు. పెదాల కదలిక వేగాన్ని నియంత్రించి వేస్తుంది.
*అంతర్వాణి (sub-vocalisation):కొందరి పెదాలు కదలవు. కానీ లోపల ఓ అంతర్వాణి వాళ్ళకు చదివి వినిపిస్తూ ఉంటుంది. ఇది వేగాన్ని మందగిస్తుంది.
*చదువులో వూగిసలాట (regression):చాలామంది చదువుతూ తిరిగి వెనక్కివచ్చి చదివిందే చదువుతూ ఉంటారు. ఓ అంచనా ప్రకారం ఒక పేజీ పూర్తయ్యేసరికి దాదాపు నలబైసార్లు ఈ ఊగిసలాట జరుగుతుంది. ఇది విలువైన కాలాన్ని హరించివేస్తుంది.
ఈ విధంగా కీలక సమాచారాన్ని సేకరించడం, చదివినదాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం, విషయంపై ధ్యాసపెట్టటం, వేగంగా చదవడం అనే అంశాలు కలిసిన పఠన విధానమే పవర్ రీడింగ్. అయితే ఈ అంశాలన్నీ వేటికవే కాకుండా పరస్పర ఆధారితంగా (synergistic approach) ఉన్నపుడే వీటినుంచి నిజమైన పవర్ ఉద్భవిస్తుంది.
చదువులో వేగం పెరగాలంటే మన కన్ను చూడవలసింది ఒకసారి ఒక పదాన్ని కాదు; కనీసం రెండు మూడు పదాలను. అలా చేస్తే నిమిషంలో 240-360 పదాలను పూర్తిచేయవచ్చు. ఉత్తమ విద్యార్థి నిమిషానికి 600-840 మాటలను అవలీలగా పూర్తిచేస్తాడు. అతని కన్ను 5 నుంచి 7 పదాలను క్లిక్‌మన్పిస్తుంది. అంటే సగటు విద్యార్థి కంటే ఉత్తమ విద్యార్థి మూడు రెట్లు వేగంగా చదువుతాడు.
చాలామంది చదువుతూ తిరిగి వెనక్కివచ్చి చదివిందే చదువుతూ ఉంటారు. ఒక పేజీ పూర్తయ్యేసరికి ఇలా దాదాపు నలబైసార్లు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ అలవాటు మన విలువైన కాలాన్ని హరించివేస్తుంది.
చూపు పుస్తకంపైన, చిత్తం...
ఒక విషయం అర్థం కావాలంటే దానిపై ధ్యాస పెట్టాలి. ధ్యాస నిలవాలంటే వేగం కావాలి. మెల్లగా చదివితే ధ్యాస నిలవదా అని సందేహం రావొచ్చు.
విద్యానిపుణుల పరిశోధనల ప్రకారం మెల్లగా చదివేవారి దృష్టి పక్కదారులు (divert)పడుతుంది. వేరే సంగతుల మీదికి షికార్లు పోతుంది. 'చూపు శివుడి మీద, చిత్తం చెప్పుల మీద' అన్నట్టు- చూపు పుస్తకంపైన, చిత్తం మాత్రం చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటుంది. మనసు నిలకడగా ఒకచోట ఉండాలంటే వేగంగా చదివే అలవాటు నేర్చుకోవాలి.
గంటకు 10 కి.మీ. వేగంతో కారు నడిపే వాడికీ, గంటకు వంద మైళ్ళ వేగంతో కారు నడిపే వాడికీ తేడా ఏమిటి? 10 కి.మీ. వేగం నిజానికి వేగమే కాదు. ఆ మాత్రం వేగానికి రోడ్డు మీద ధ్యాస నిలవదు. చూపు చుట్టుపక్కల పెత్తనానికి పోతుంది. అందే వంద కిలోమీటర్ల వేగంతో వెళితే దారిమీద తప్ప వేరే దానిమీద ధ్యాసకు అవకాశమే ఉండదు. కాబట్టి వేగంగా చదివితే గానీ ధ్యాస కుదరదు. పైగా మన కన్ను, మనసు కూడా నిమిషానికి 20,000 మాటలకు పైగా చదివి, అర్థాన్ని గ్రహించగలిగే శక్తిమంతమైన సాధనాలు. 'పాల్ స్కీల్' ఫొటో రీడింగ్ పద్ధతి ద్వారా నిమిషానికి 25,000 మాటలు అర్థం చేసుకోవచ్చని నిరూపిస్తున్నారు.
అయితే... సగటు విద్యార్థి నిమిషానికి 200 మాటలే చదువుతాడు. అంటే తన శక్తిలో ఒక శాతం మాత్రమే వినియోగించుకుంటూ మిగతా 99 శాతాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. దీన్ని మరోలా చెప్పాలంటే గంటకు 200 కి.మీ. వెళ్ళగల కారును గంటకు 2 కి.మీ. మందగమనానికే వినియోగించడం లాంటిది. దీనివల్ల ధ్యాస కుదరదు; ఆ చదివింది కూడా అర్థం కాదు.
వేగంగా చదవడం వల్ల విషయంపైనే దృష్టి కేంద్రీకృతమవుతుంది. దృష్టిని కేంద్రీకరించడం వల్ల విషయం లోతుగా అర్థమవుతుంది. అర్థమైన విషయమే ఎక్కువ కాలం గుర్తుంటుంది. కాబట్టి అర్థం చేసుకోవడం, ఏకాగ్రత, వేగంగా చదవడం పరస్పర ఆధారితాలు. ఇవి పవర్‌రీడింగ్‌కు ప్రాణాధారమైన అంశాలు.
(ఈనాడు, చదువు, ౦౨:౦౩:౨౦౦౯)
_______________________________
Labels: Self development, Self development/Telugu

మంచి నోట్సు... మార్కుల గని!
సత్య
స్వయంగా నోట్సు రాసుకునేవారు ఉత్తమ విద్యార్థుల కోవలోకి వస్తారు. అసలు నోట్సు జోలికే పోనివారు సగటు విద్యార్థులని ఇట్టే అంచనాకు వచ్చెయ్యవచ్చు. నోట్సు రాసుకునేవారిలో కూడా 95 శాతం విద్యార్థులు పాటించేది- సంప్రదాయ బద్ధమైన 'లీనియర్ నోట్సు'. దీని ప్రయోజనాలు పరిమితమే!
సివిల్స్, గ్రూప్స్ లాంటి ఉన్నతశ్రేణి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఇతరుల విజయ రహస్యాన్ని ఆరా తీస్తుంటారు. తాము ఎన్నిసార్లు రాసినా విజయం వరించదేమని పోటీపరీక్షలు రాసిన కొందరు సందేహం వెలిబుచ్చుతుంటారు. అలాంటివారిని 'మీ నోట్సు ఓసారి చూపించ'మని అడిగితే 'నేను నోట్సు రాసుకోను. పుస్తకాలు చదివి నేరుగా పరీక్షలు రాస్తాను' అంటారు.ఇలాంటివారికి తక్కువ మార్కులు రావడం వింతేమీ కాదు. వీరంతా సగటు విద్యార్థులు. నోట్సు ప్రయోజనం తెలుసుకోని సామాన్యులు. పోటీ పరీక్షల అభ్యర్థులెందరో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అసలు కీలకం ఎవరికి వారు నోట్సు తయారుచేసుకోవడమే.
ఎందుకు రాసుకోవాలి?
అనేక పాఠ్యాంశాల నుంచీ, ఇతర వనరుల నుంచీ సేకరించిన కీలక పదాలనూ, ముఖ్య భావాలనూ క్రోడీకరించి సంగ్రహంగా, సమగ్రంగా రాసుకునేదే నోట్సు. గుబురుగా పేరుకుపోయిన సమాచారానికి ఓ క్రమానుకృతిని కల్పించి చక్కగా అర్థమయ్యేలా చేస్తుందిది. విషయానికి మనదైన ప్రత్యేకశైలిలో వ్యాఖ్యానం చేస్తుంది నోట్సు. పునశ్చరణకు ఇదెంతో సౌలభ్యం.
* అనేక పుస్తకాలూ, వనరుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఒకచోట చేర్చటం వల్ల మూల గ్రంథాలను పదేపదే చూడాల్సిన బాధ తప్పి, సమయం ఆదా అవుతుంది.
* క్లిష్టమైన భావాలను సులభంగా, సంక్షిప్తీకరించడం వల్ల విషయం అర్థమవుతుంది.
* విశ్లేషణాత్మకంగా విషయాన్ని వివరించడం వల్ల తేలిగ్గా గుర్తుపెట్టుకోవడానికి సహకరిస్తుంది నోట్సు.
మన మనసులో ఎంతో విస్తృతమైన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. అది ఉద్దీపనం పొంది వెలికి రావడానికి ప్రేరణ కావాలి. దాన్ని కల్పించే ఉపకరణమే నోట్సు. ఎవరో రాసిన నోట్సుకు అలాంటి ప్రేరణ ఉండదు. స్వయంగా రాసుకున్న నోట్సుకే ఆ శక్తి ఉంటుంది. స్వయంగా రాసుకున్న నోట్సులో మన ముద్ర ఉంటుంది. 'ఒరిజినాలిటీ' ఉంటుంది. ఒరిజినాలిటీ ఉన్న జవాబులకే ఎక్కువ మార్కులు వస్తాయి. అంతే కాక, విషయం పట్ల అవగాహన పెరగాలన్నా, తేలిగ్గా విషయం గుర్తుపెట్టుకోవాలన్నా ఎవరి నోట్సు వారే తయారుచేసుకోవాలి. మనం తయారు చేసుకునే నోట్సు SMART గాఉండాలి.
నిర్దిష్టమైన (Specific) :
విషయం నిర్దిష్టంగా ఉండాలి. అంటే భావాల్లో స్పష్టత ఉండాలి. డొంక తిరుగుడు పనికి రాదు. వ్యర్థమైన విషయాలు లేకుండా విషయ వివరణలో సూటిదనం ఉండాలి.
లెక్కించడానికి (Measurable) వీలుగా :
విషయాన్ని ఎన్ని కోణాల నుంచి విశ్లేషిస్తున్నామో, ఎన్ని వర్గాలుగా విభజిస్తున్నామో అవగతం కావాలి.
లక్ష్యసాధన (Achievable) ముఖ్యం :
మార్కులు సాధించే లక్ష్యంతో నోట్సు ఉండాలి. ఉపయోగకరంగా ఉండే విషయాలనే రాసుకోవాలి. సందర్భశుద్ధి విషయానికి ప్రాణం కావాలి.
వాస్తవమైన (Realistic) అంశాలు :
అందంగా ఉన్నాయి కదా అని మనకు అర్థం కాని విషయాలు అందులో చేర్చకూడదు. వాస్తవమైన విషయాలనే రాసుకోవాలి. కవితాత్మకంగా ఉండే పరుల భాషలో కన్నా స్పష్టంగా, హుందాగా ఉండే సొంత భాషలో రాసుకుంటేనే నోట్సు ఉపయోగకరం.
కాలపరిమితిలో (Timeframe) ఒదగాలి:
నోట్సు చాట భారతంలా ఉండకూడదు. ఒడ్డు పొడవుతో పాటు నోట్సుకు కాల కోణం (Time Dimension) ఉండాలి. ఒక టైమ్ ఫ్రేమ్‌లో విషయం ఇమిడిపోవాలి. అంటే పది నిమిషాలకో, అర్థగంటకో సరిపడేలా విషయాన్ని తయారుచేసుకోవాలి.
లీనియర్ నోట్సు (Linear Notes)
నోట్సు వల్ల ఎన్ని ఉపయోగాలున్నా వాటి నుంచి ఎన్ని సత్ఫలితాలు వస్తున్నా చాలామంది విద్యార్థులు సొంతంగా నోట్సు రాసుకోరు. రాసుకున్నవారిలో కూడా 95 శాతం విద్యార్థులకు నోట్సు ఎలా తయారుచేసుకోవాలో తెలియదంటే అతిశయోక్తి కాదు. వారంతా సంప్రదాయ బద్ధమైన లీనియర్ నోట్సునే తయారుచేసుకుంటారు. ఎడమ నుంచి కుడికి వరుసలలో (lines) , వాక్యాల రూపంగా ఉంటుంది కాబట్టి దీనికి linear notes అని పేరు.
సమయం ఆదా అవుతుందా?: లీనియర్ నోట్సు వాక్యాల రూపంలో ఉండటం వల్ల కీలక పదాలతో పాటు వాక్యపూరణకు అవసరమయ్యే 80 శాతం వ్యర్థపదాలు ఇందులో చోటు చేసుకుంటాయి. అందువల్ల విలువైన సమయం వ్యర్థమైపోతుంది.
చూసినంతనే అర్థమవుతుందా?: లీనియర్ నోట్సు పేరాలు/పాయింట్ల రూపంలో ఉండటం వల్ల మొత్తం చదివితేనే కానీ అసలు విషయం అర్థం కాదు. చూసినంతనే విషయం స్ఫురించదు. తటిల్లతలా మనసులో తళుక్కుమనదు.
గుర్తుపెట్టుకోడానికి వీలవుతుందా?: విడివిడిగా ఉండే పదాలనూ, వాక్యాలనూ మెదడు గుర్తుపెట్టుకోదు. గుర్తుపెట్టుకోవాలంటే జ్ఞాపకశక్తికి అవసరమయ్యే సూత్రాలు నోట్సులో ఇమిడివుండాలి. లీనియర్ నోట్సులో ఈ జ్ఞాపకశక్తి సూత్రాలన్నీ ఇమిడివుండవు.
లీనియర్ నోట్సులో ఇలాంటి పరిమితులెన్నో ఉన్నాయి కాబట్టే దాన్ని అనుసరించేవారు తమకు మంచి జ్ఞాపకశక్తి లేదని వాపోతుంటారు. నిజానికి పరిమితి ఉండేది వారి జ్ఞాపకశక్తికి కాదు, వారు రాసుకునే నోట్సుకే!
లీనియర్ నోట్సుకుండే పరిమితులు అధిగమించి ఓ చక్కని నోట్సు విధానం ఉంది. 40 ఏళ్ళ క్రితమే 'వాల్టర్ పాక్' అనే విద్యావేత్త దీన్ని తయారుచేశాడు. విదేశాల్లో విశేష ఆదరణ పొందుతున్న ఆ నోట్సు విధానం ఏమిటో, దాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం!
ఇదీ... నోట్సు రాసే పద్ధతి!
విషయం తేలిగ్గా అర్థం కావాలి; సమయం ఆదా అవ్వాలి; చదివింది చక్కగా గుర్తుపెట్టుకోవాలి! ఈ 3 పనులనూ సాధ్యం చేసేదే కార్నల్ నోట్సు. నోట్సు ఎలా తయారుచేసుకోవాలో చెప్పడమే కాక, దాన్ని ఎలా వాడుకోవాలో కూడా తెలియజేస్తుందిది.
నలబై ఏళ్ళ క్రితం వాల్టర్ పాక్ (Walter Pauk) అనే విద్యావేత్త ఓ నోట్సు విధానాన్ని తయారుచేశాడు. దీనికి కార్నల్ నోట్సు విధానం/కార్నల్ పద్ధతి అని పేరు. అమెరికాలోని కార్నల్ విశ్వవిద్యాలయ విద్యార్థులు నోట్సు రాసుకునే విధానాన్ని మెరుగుపరచడం కోసం ఇది రూపొందింది. క్రమేపీ ఈ నోట్సు పద్ధతి అమెరికా అంతటా విస్తరించింది; ఎన్నో దేశాల్లో విశేష ప్రాచుర్యాన్ని పొందుతోంది.
ఈ పద్ధతిలో నోట్సు రాసుకునే ప్రతి కాగితాన్నీ ముందుగా మూడు భాగాలుగా విభజించాలి.
* పేపర్ కింద నుంచి రెండు అంగుళాల పైభాగంలో అడ్డంగా గీత గీయాలి.
* కాగితం ఎడమ భాగంలో రెండున్నర అంగుళాల స్థలాన్ని కేటాయించి, కింద గీసిన సమాంతర గీతకు ఆనుకునేలా నిలువుగా గీత గీయాలి.
* దీనివల్ల మొత్తం పేపర్లో మూడు విభాగాలు ఏర్పడతాయి. 2.5X9అంగుళాల స్థలం ఎడమభాగంలో, 6X9అంగుళాల స్థలం కుడిభాగంలో, 2 అంగుళాల స్థలం కింది భాగంలో వస్తుంది.
* ఈ మూడు భాగాలకూ కార్నల్ పద్ధతిలో ప్రత్యేక ప్రయోజనాలున్నాయి.
నోట్సు తయారీలో 6 'ఆర్స్'
కార్నల్ పద్ధతిలో రాసుకునే నోట్సులో ఆరు మెట్లు ఉంటాయి. ఇవన్నీ ఆంగ్లంలో Rఅక్షరంతో ఆరంభమయ్యే ఆరు పదాలకు చెందిన అంశాలు. అందుకే దీన్ని ఆరు Rsవిధానం అంటారు.
కాగితాన్ని మూడు భాగాలుగా విభజించాక 6X9అంగుళాల కుడిభాగంలో నోట్సు రాసుకోవాలి. ఈ 6 ఆర్స్ విధానం అక్కడినుంచే ప్రారంభం అవుతుంది.
1. రికార్డ్ (Record):ఉపన్యాసం ప్రారంభమైనప్పుడు లేదా ఓ పాఠ్యాంశాన్ని చదివేటప్పుడు కావలసిన విషయాన్ని కుడిభాగంలోని జాగాలో రాయడం (రికార్డు చేయడం) ప్రారంభించాలి. ముఖ్యమైన విషయాలనే రాసుకోవాలి. వ్యాకరణం, విరామ చిహ్నాలు వగైరాలు ముఖ్యం కాదు. విషయం అర్థమయ్యేలా ఉంటే చాలు. కాలం ఆదా చేయడానికి మీకు అర్థమయ్యే 'షార్ట్ హ్యాండ్' ఉపయోగించండి. ఏమైనా, ఓసారి రాత పూర్తయ్యాక చదివితే అర్థమయ్యేలా నోట్సు రాసుకోవాలి.
2. రెడ్యూస్ (Reduce):నోట్సు రాయడం పూర్తి అయ్యాక దానిలోని కీలక పదాలను (Key words) /కీలక భావాలను వేరు చేసి వాటిని రెండున్నర అంగుళాలు ఉండే ఎడమవైపు మార్జిన్లో రాసుకోవాలి. ప్రశ్న రూపంలో రాసుకుంటే మరీ మంచిది. మొత్తం సమాచారాన్ని క్షణంలో స్ఫురింపజేసే జ్ఞాపకచిహ్నాలుగా ఇవి పనిచేస్తాయి.
.
3. రీకేప్‌చ్యులేట్ (Recaptulate):ఇది 'సారాంశం' అనేదానికి పెద్దపేరు. పేజీలోని మొత్తం విషయ సారాంశాన్ని కాగితం దిగువభాగంలోని రెండు అంగుళాల స్థలంలో రాసుకోవాలి. ప్రతి పేజీలోనూ ఆ విషయానికి సంబంధించిన సారాంశాన్ని రాసుకోవాలి. ప్రతి పేజీలో రాసుకున్న కీలక అంశాల ఆధారంగా మొత్తం నోట్సు సారాంశాన్ని చివరిపేజీలో రాసుకోవాలి. దీనివల్ల ఒకే పేజీలో మొత్తం విషయాన్ని అవగతం చేసుకోవడానికి వీలవుతుంది.
4. రిసైట్ (Recite):విషయాన్ని గుర్తుపెట్టుకోవటానికి ఉపయోగపడే బలమైన ప్రక్రియ- వల్లెవేయడం. అంటే కేవలం తిరిగి చదవడం కాదు; విషయాన్ని మన సొంత మాటల్లో మనకు మనం వివరించుకోవడం. విషయాన్ని పైకి వల్లెవేయడం వల్ల నేర్చుకునే ప్రక్రియ వేగవంతమవుతుంది. సొంత మాటల్లో విషయాన్ని మననం చేయడం వల్ల దానిలోని లోతైన భావం అర్థమవుతుంది. కుడిభాగంలో ఉండే నోట్సునూ, ఎడమభాగంలోని కీలక పదాలనూ ఒకేసారి చూడడం వల్ల మెదడుకు జ్ఞాపకశక్తికవసరమయ్యే అభ్యాసం లభ్యమవుతుంది.
5. రిఫ్లెక్ట్ (Reflect):విషయాన్ని వల్లెవేయడమే కాక, దాన్ని లోతుగా అవలోకనం చేసుకోవాలి. నేర్చుకున్న సమాచారాన్ని ఎలా వినియోగించుకోవాలో, ఎలా అనువర్తింపజేసుకోవాలో, అదివరకే మనకు తెలిసిన విషయంతో దీన్నెలా అనుసంధానించుకోవాలో ఆలోచించాలి. కొత్తగా నేర్చుకున్న సమాచార ప్రాధాన్యాన్నీ, దాన్ని తెలుసుకోవడం వల్ల వచ్చే అదనపు లాభాన్నీ బేరీజు వేసుకోవాలి.
6. రివ్యూ (Review):రాసుకున్న విషయాన్ని తరచూ పునః సమీక్షించుకోవాలి. అంటే తిరిగి చదువుకోవడం కాదు; విషయాన్ని స్పష్టంగా మనవైన మాటల్లో వివరించుకోగలగడం. దానివల్ల విషయం మస్తిష్కంలో నిత్యనూతనంగా ఉంటుంది. అందువల్ల పరీక్షల ముందు బట్టీపట్టే బెడద తప్పిపోతుంది.
నోట్సు ఎలా తయారుచేసుకోవాలో చెప్పడమే కాక, దాన్ని ఎలా వాడుకోవాలో తెలియజేస్తుంది కాబట్టే కార్నల్ నోట్సు ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. విషయాన్ని తేలిగ్గా అర్థం చేసుకోడానికీ, కాలాన్ని ఆదా చేసుకోవడానికీ, చదివినదాన్ని చక్కగా గుర్తుపెట్టుకోవడానికీ కార్నల్ నోట్సు అద్భుతంగా పనిచేస్తుంది.
కార్నల్ నోట్సు విలువైన ఉపకరణం
కార్నల్ నోట్సుకు ఓ ఉదాహరణ చూద్దామా? ప్రసిద్ధ పరిశోధక సంస్థ 'గేలప్ ఆర్గనైజేషన్' విజయ రహస్యం అనేఅంశంపై ఓ సర్వే నిర్వహించింది. దాన్ని కార్నల్ నోట్సులో ఎలా రాసుకోవచ్చో పరిశీలిద్దాం.
మిగతా నాలుగు లక్షణాలకు కూడా ఇదే పద్ధతిలో నోట్సు రాసుకొని, చివరిపేజీలో మొత్తం విషయంపై సారాంశాన్ని (summary) తయారు చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న కార్నల్ నోట్సు 'లీనియర్ నోట్సు' పోలిస్తే వందరెట్లు మేలుతరంగా ఉంటుంది. విద్యార్థులకే కాదు; పెద్దలకు కూడా ఈ నోట్సు విధానం చక్కని ఉపకరణం. ఇలా కార్నల్ నోట్సుకు ఎన్నో ఉపయోగాలున్నా, దీనికి కూడా కొన్ని పరిమితులు లేకపోలేదు. కీలక పదాలతో పాటు వాక్యపూరణకు అవసరమైన వ్యర్థపదాలు ఇక్కడా చోటుచేసుకుంటాయి. ఇది చిత్రాల రూపంలో ఉండదు; రంగులతో విషయ వివరణ జరగదు. కాబట్టి జ్ఞాపకశక్తిని పూర్తిగా వినియోగించుకోవడానికి అవకాశం తక్కువే.
కార్నల్ నోట్సు 'లీనియర్ నోట్సు'తో పోలిస్తే వందరెట్లు మేలుతరంగా ఉంటుంది. విద్యార్థులకే కాదు; పెద్దలకు కూడా ఈ నోట్సు విధానం చక్కని ఉపకరణం
విషయాన్ని వల్లెవేయడమే కాక, దాన్ని లోతుగా అవలోకనం చేసుకోవాలి. నేర్చుకున్న సమాచారాన్ని ఎలా వినియోగించుకోవాలో, ఎలా అనువర్తింపజేసుకోవాలో, అదివరకే మనకు తెలిసిన విషయంతో దీన్నెలా అనుసంధానించుకోవాలో ఆలోచించాలి. కొత్తగా నేర్చుకున్న సమాచార ప్రాధాన్యాన్నీ, దాన్ని తెలుసుకోవడం వల్ల వచ్చే అదనపు లాభాన్నీ బేరీజు వేసుకోవాలి.
సొంత మాటల్లో విషయాన్ని మననం చేయడం వల్ల దానిలోని లోతైన భావం స్పష్టంగా అర్థమవుతుంది.
(ఈనాడు,౦౯ & ౧౬:౦౩:౨౦౦౯)

ఎంత చదివినా గుర్తుండదా?
మన పరీక్షలు చాలావరకూ జ్ఞాపకశక్తిని పరీక్షించేవే! అందుకే చదివిన విషయాలను గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం. 'ఎంత కష్టపడి చదివినా నాకసలు గుర్తుండదు' అంటూ బాధపడే విద్యార్థుల సంఖ్య తక్కువేమీ కాదు. కొన్ని శాస్త్రీయమైన సూత్రాలు సాధన చేస్తే ఏ విద్యార్థికైనా జ్ఞాపకశక్తి అద్భుతంగా మెరుగుపడుతుంది.
చదివిన విషయాలను తేలిగ్గా మర్చిపోవటం వల్ల ఈ పోటీ ప్రపంచంలో చాలా వెనకబడాల్సివస్తుంది. జ్ఞాపకశక్తి లోపానికి కింది మూడిటిలో ఏదో ఒకటి కారణం కావచ్చు.
* సమాచారాన్ని స్పష్టంగా మనసుపై ముద్రించకపోవటం
* మనసుపై ముద్రించిన సమాచారాన్ని జాగ్రత్తగా భద్రపరచకపోవడం
* ఆ భద్రపరిచిన సమాచారాన్ని సరిగ్గా వెలికితీయలేకపోవటం
సమాచారాన్ని మనసులో స్పష్టంగా ముద్రించడం (Registration ),జాగ్రత్తగా భద్రపరచడం (Retention), సరిగ్గా వెలికితీయడం (Retrieval) అనే మూడు దశలను సమర్థంగా అమలు చేయడమే జ్ఞాపకశక్తి. ఈ మూడు కార్యక్రమాలూ వేర్వేరుగా కాక సమన్వయపూర్వకంగా పనిచేసినపుడు (3Rformula)అద్భుత జ్ఞాపకశక్తి అలవడుతుంది.
దీని అమలుకు ముందు జ్ఞాపకశక్తికి సంబంధించిన కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకోవటం అవసరం.
ఒకే రకం మెదడు
జ్ఞాపకశక్తికి ఆధారం మన మెదడు. మేధావికైనా, సామాన్యుడికైనా ఉండే మెదడు 1450 గ్రాములే. బూడిద రంగులో ఉండే ఇది శరీర బరువులో 2 శాతమే ఉన్నా మనలోని 20 శాతం శక్తిని వినియోగించుకుంటుంది. మెదడును వినియోగించుకునే విధానం మీదే వ్యక్తి ప్రతిభ ఆధారపడివుంటుంది. కాబట్టి మందమతులుగా భావించుకునే విద్యార్థులు తమ జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎంతో అవకాశముంది.
మూడిటి సంయోగం
మనిషికి ఉండేది మూడు మెదళ్ళ సంయోగమని శాస్త్రీయంగా నిరూపించాడు పాల్ మెక్‌లియన్. వీటికి రెప్టీలియన్, లింబిక్, కార్టికల్ అని పేర్లు పెట్టాడు.
* రెప్టీలియన్ మెదడు ఒత్తిడి కలిగిస్తుంది. ఒత్తిడి ఎక్కువైతే జ్ఞాపకశక్తి సరిగా పనిచేయదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలంటే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
* లింబిక్ మెదడు భావోద్వేగాలకు పుట్టిల్లు. జ్ఞాపకశక్తి మీద భావోద్వేగాల ప్రభావం అధికం. సంతోషకరమైన విషయాలూ, విషాదకర సంఘటనలూ ఎక్కువకాలం గుర్తుండిపోవటానికి కారణమిదే. కాబట్టి దీర్ఘకాల స్మృతిలో సమాచారాన్ని దాచుకోవాలనుకునేవారు ఉద్వేగాలను సమర్థంగా వాడుకోవాలి.
* ఇక అతి ముఖ్యమైంది కార్టికల్ మెదడు. మన మెదడులో అరవైశాతమున్న ఈ మెదడుకు నాలుగు ప్రత్యేకతలున్నాయి. వాటినే స్టీవెన్ ఆర్. కవీ నాలుగు ప్రకృతి వరప్రసాదాలు (four endowmentsఅంటాడు. అవి స్వీయ అవగాహన శక్తి (Self Awareness),వూహాశక్తి (Imagination) , విచక్షణ శక్తి (Conscience), ఇచ్ఛాశక్తి (Independent Will).ఈ నాలుగూ జ్ఞాపకశక్తికి మూలస్తంభాలు. వీటిని తెలుసుకొని సద్వినియోగం చేసుకునే విద్యార్థులు అత్యుత్తమ స్థాయికి చేరతారు.
ఎక్కువ చదివితే పిచ్చెక్కదా?
చిన్నగా కనిపించే మన మెదడు కోట్లాది నాడీకణాలతో నిర్మితమైంది. ఒక వ్యక్తి మెదడులో లక్ష కోట్ల నాడీ కణాలు ఉంటాయని అంచనా. అంటే నాడీకణం ఎంత చిన్నగా ఉంటుందో ఊహించుకోండి. అంత సూక్ష్మ నాడీకణం సైతం ఎంతో శక్తిమంతమైందే. ఒక కంప్యూటర్‌కు ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి నాడీకణంలో ఉంటుంది. దీన్ని బట్టి మొత్తం మన మెదడు ఎంత శక్తిమంతమైందో, ఎంత అమూల్యమైందో అర్థమవుతుంది.
నాడీ కణాలు ఏవీ విడిగా ఉండవు. ఒకదానితో మరొకటి 20 వేల అనుసంధానాలు కలిగి ఉంటాయి. పెద్ద టెలిఫోన్ ఎక్స్చేంజిలో వైర్ల నెట్‌వర్క్ మాదిరిగా మెదడు పనిచేస్తుంది. అందుకే కోట్లాది సమాచార యూనిట్లను ఏకకాలంలో గ్రహించి, విశ్లేషించగలుగుతుంది.
చాలామందికి ఎక్కువ చదివితే పిచ్చెక్కుతుందనే అపోహ ఉంది. నిజానికి ఎంత ఎక్కువ సమాచారాన్ని మనం అందిస్తే అంత శక్తిమంతంగా మెదడు పనిచేస్తుంది. దానివల్ల కొత్త నాడీకణ మార్గాలు ఏర్పడతాయి. అవి జ్ఞాపకశక్తిని అధికం చేస్తాయి. కాబట్టి నాడీకణాల మాయాజాలాన్ని తెలుసుకుంటే జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు.
గుర్తుండిపోవాలంటే...
* మన మెదడు హార్డ్‌వేర్ అయితే దానికి ఉండే మైండ్‌పవర్ సాఫ్ట్‌వేర్. మాగ్నటిక్ పవర్ వల్లే మనం మాట్లాడేది రికార్డవుతుంది. అలాగే మనం చదివే సమాచారం మెదడులో ఉండటానికి మైండ్‌పవరే కారణం. కాబట్టి ఈ పవర్‌ను తెలుసుకుంటే జ్ఞాపకశక్తిని అభివృద్ధి చేసుకోవచ్చు.
* మైండ్‌నే మనసు అంటాం. ఇది చేతన (10 శాతం), అంతశ్చేతన (90 శాతం) అని రెండుగా ఉంటుందని మానసిక నిపుణులంటారు. పెన్‌ఫీల్డ్ అనే సైకాలజిస్ట్ పరిశోధన ప్రకారం పంచేంద్రియాల నుంచి సేకరించిన ఏ విషయాన్ని అయినా మనసు రికార్డు చేస్తుంది. దాన్ని మనం వాడకపోతే అంతశ్చేతనలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి జ్ఞాపకశక్తిని అభివృద్ధి పరచుకోవాలంటే అంతశ్చేతన మనసును ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి.
* మనసు నాలుగు స్థితుల్లో ఉంటుంది. ఒక్కో స్థితిలో ఒక్కో తరంగ విధానాన్ని కలిగివుంటుంది. జ్ఞాపకశక్తి పైన ఈ తరంగ విధానం ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఉత్తమమైన తరంగ స్థితి ఆల్ఫా (Alfa). తెల్లవారుజామున మనసు ఆహ్లాదంగా ఉండటానికీ, చదివింది తలకెక్కడానికీ కారణం ఈ ఆల్ఫా స్థితే. అందువల్ల ప్రశాంత వాతావరణంలో నిర్మల స్థితిలో మంచి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
శిక్షణతో సాధ్యమే
జ్ఞాపకశక్తి కొద్దిమంది అదృష్టవంతులకు మాత్రమే దక్కే వరం కాదు. అదొక నైపుణ్యం. సాధన చేస్తే ఎవరైనా దాన్ని అలవర్చుకోవచ్చు. ''మంచి జ్ఞాపకశక్తి, చెడ్డ జ్ఞాపకశక్తి అనేవి నిజానికి లేనేలేవు. ఉన్నదల్లా తర్ఫీదు పొందినదీ (Trained Memory), తర్ఫీదు పొందనిదీ (Untrained Memory) '' అంటాడు జ్ఞాపకశక్తి మీద విశేష పరిశోధన చేసిన హేరీ లొరేనీ.
''సగటు మనిషి తన మేధాశక్తిలో కేవలం పది శాతం వినియోగించుకుంటాడు. మిగతా 90 శాతం నిరుపయోగం కావడానికి జ్ఞాపకశక్తి సూత్రాలను ఉల్లంఘించడమే'' అంటాడు ప్రఖ్యాత సైకాలజిస్టు కార్ల్ సీషోర్. మాయలూ, మంత్రాల మీద కాకుండా ప్రకృతి సూత్రాలమీద ఆధారపడి పనిచేస్తుంది జ్ఞాపకశక్తి. Registration, Retention, Retrieval అనే మూడు దశలూ ప్రకృతి సూత్రాలమీదే ఆధారపడి పనిచేస్తాయి.
_____________________________________________
పడిన ముద్ర చెరిగిపోదు!
చాలామంది విద్యార్థులు ఏకబిగిన పుస్తకం చదవాలని ప్రయత్నిస్తుంటారు. అలా చేస్తే బాగా గుర్తుంటుందని భావిస్తుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. మధ్యమధ్యలో కొంత విరామం ఇచ్చి చదివితేనే విషయాలు బాగా గుర్తుంటాయి. శాస్త్రీయంగా నిరూపితమైన సత్యమిది! సమాచారాన్ని మనసులో స్పష్టంగా ముద్రించటం (రిజిస్ట్రేషన్ )జ్ఞాపకశక్తికి తొలి దశ. చదివిన విషయాన్ని ఎంత స్పష్టంగా నమోదు చేస్తే అంత విపులంగా గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి చాలా మార్గాలున్నాయి. ప్రధానమైనవాటిని పరిశీలిద్దాం.
ఏకాగ్రత
నాలుక మీద కదలాడుతోంది కానీ బయటకు రావటం లేదంటూ చాలామంది చికాకుపడుతుంటారు. ఈ పరిస్థితికి కారణం- విషయాన్ని ఏకాగ్రతతో నమోదు చేయకపోవటమే. ఇతర పనుల మీద మనసు మళ్ళకుండా... చేసే పని మీద శ్రద్ధ పెట్టడమే ఏకాగ్రత. ఇది కుదరాలంటే ఆకలి, అలసట, ఒత్తిడి వంటి పరిస్థితులుండకూదు. శబ్దాలు, కాలుష్యం, ఆకర్షణలకు దూరంగా ఉండాలి.
పరిశీలన
పొగమంచులో ఫోటో తీస్తే బొమ్మ సరిగా రాదు. సమాచారం స్పష్టంగా అర్థం కాకపోతే గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు. కాబట్టి సమాచారాన్ని వివిధ కోణాల నుంచి పరిశీలించి స్పష్టంగా అర్థం చేసుకుంటేనే మెదడు మీద ముద్రపడుతుంది.
జ్ఞానేంద్రియాల వినియోగం
కొందరు విద్యార్థులు కేవలం చదవడానికే ప్రాధాన్యం ఇస్తారు. కొందరు వినడానికీ, కొందరు చూడడానికీ, కొందరు చెప్పడానికీ, కొందరు చేయడానికీ ప్రాధాన్యమిస్తారు. దీనివల్ల సమాచారం పూర్తిగా నమోదు కాదు. చదవడం వల్ల 20శాతం, వినడం వల్ల 30 శాతం, చూడడం వల్ల 40 శాతం, దాన్ని తిరిగి చెప్పటం వల్ల 50 శాతం, చేయడం వల్ల 60 శాతం గుర్తుంటాయని పరిశోధకులు అంటారు. అలా కాక, చదవడం, వినడం, చూడడం, చెప్పడం, చేయడం అనేవాటికి సహకరించే పంచేంద్రియాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తే 90 శాతానికి మించి విషయం నమోదవుతుంది.
చిత్రాల కల్పన
చాలామంది పరాకు పడడానికి కారణం- వారు పదాలను గుర్తుపెట్టుకోవాలనుకోవడమే. మన మెదడు అక్షరాలను గుర్తుపెట్టుకోదు. చిత్రాలనే గుర్తుపెట్టుకుంటుంది. చిత్రాలలోనే ఆలోచిస్తుంది. ఈ చిత్రాలు బొమ్మల రూపంలో ఉండొచ్చు. ఆకృతులు (images)కావొచ్చు, గ్రాఫులు కావొచ్చు. రేఖాచిత్రాలూ, మైండ్ మ్యాపులైనా కావొచ్చు. అందువల్ల అక్షరబద్ధంగా ఉండే సమాచారాన్ని చిత్రబద్ధంగా చేయగలిగితే మెదడు స్పష్టంగా గుర్తుపెట్టుకుంటుంది. అక్షరాలను చిత్రాలుగా మలచుకుని ముద్రించడమే జ్ఞాపకశక్తి అసలు రహస్యం.
రంగుల లోకం
తెలుపు నలుపు చిత్రాలను మెదడు గుర్తుపెట్టుకోదు. రంగు రంగుల చిత్రాలనే అది గుర్తుపెట్టుకుంటుంది. కారణం కుడివలయంలోని మెదడు రంగులను ఇష్టపడుతుంది. కాబట్టి అక్షరబద్ధంగా ఉండే నోట్సును వర్ణచిత్రాల్లోకి మారిస్తే అచ్చు గుద్దినట్టు గుర్తుంటుంది.
లయాత్మకత
చిన్ననాటి చిట్టిపొట్టి పాటలూ, వేమన-సుమతీ శతక పద్యాలూ మనకు గుర్తుండిపోవటానికి కారణం వాటిల్లో ఉండే లయాత్మకతే. అందుకే వేదాలను శ్లోకబద్ధం చేశారు. కావ్యాలను పద్యమయం చేసి, యతిప్రాసలు ఏర్పరిచి లయను కూర్చారు. అందువల్ల గుర్తుంచుకోదగ్గ అంశాలూ, ఫార్ములాలను లయాత్మకంగా మార్చుకోవాలి.
భావోద్వేగాల బాసట
అక్షరాలను చిత్రాలుగా మార్చటం, చిత్రాలను రంగులతో అలంకరించడం, లయాత్మకత జోడించటమే కాకుండా భావోద్వేగాలతో రంగరించాలి. ప్రేమ, భయం, హాస్యం, కోపం, శాంతం వంటి భావోద్వేగాలతో అల్లుకున్న చిత్రాలు బలంగా గుర్తుంటాయి.
వూహా ప్రాగల్భ్యం
విజ్ఞానం కంటే ఊహాశక్తి గొప్పదంటాడు ఐన్‌స్టెయిన్. మనం నమోదు చేయదల్చిన విషయానికి ఊహాశక్తిని జోడించాలి. మన అనుభవాల్లో రంగరింపజేసుకోవాలి. ఓ గులాబిపువ్వును ఊహించుకోవటమే కాకుండా దానికి రంగు, రుచి, వాసన కల్పించుకోవాలి. అప్పుడే అది శాశ్వతంగా ముద్రితమవుతుంది.
అనూహ్యత
అసాధారణ విషయాలే అబ్బురపరుస్తాయి. వాటినే మెదడు గుర్తుపెట్టుకుంటుంది. అందువల్ల సాధారణ విషయాలను అనూహ్యంగా మార్చాలి. హాస్యాన్ని జోడించినా, హాస్యాస్పదంగా మార్చేసినా, వింతలూ విడ్డూరాలు జత చేసినా, విపరీతమైన పరిమాణంలో ఊహించుకున్నా అవి మన జ్ఞప్తిలో శాశ్వతంగా ఉంటాయి.
సంపూర్ణత్వం
విడిగా ఉండే సమాచారం కన్నా సంపూర్ణత్వంలో ఉండే సమాచారాన్నే మెదడు గుర్తుపెట్టుకుంటుంది. శరీరంలో వివిధ అవయవాలకు ప్రత్యేక స్థానం ఉన్నట్టుగానే విషయంలోని ప్రతి అంశానికీ ఓ ప్రత్యేకస్థలం, స్థానం ఉంటుంది. అందువల్ల మనం మెదడులో ముద్రించే సమాచారం విషయం మొత్తంలో ఏ భాగానికి చెందిందో, అందులో దాని ప్రాధాన్యం ఏమిటో తెలుసుకుంటే గుర్తుంచుకోవటం సులువు.
కథా రూపం
పిల్లలకూ, పెద్దలకూ కూడా కథలంటే చాలా ఆసక్తి. మనం నేర్చుకోబోయే ఏ విషయాన్నయినా- అది సాంకేతిక సమాచారమే అయినా ఓ కథలా అల్లుకుని మనసులో ముద్రించుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. కొత్త పదాలు నేర్చుకోవాలనుకునేవారు ఆ పదాలతో ఓ చక్కని కథ అల్లుకుంటే గుర్తుపెట్టుకోవడం తేలిక అంటాడు- ఆంగ్లభాషను ఆసక్తికరంగా మలచిన హేరీ షెప్టర్. కథలో ఉత్సుకత ఉంటుంది. ఉత్సుకత జ్ఞాపకశక్తికి పెట్టుబడి లాంటిది.
ప్రాథమ్య సూత్రం
మనం చదివినదాంట్లో తుదీ మొదలు భాగాలే గుర్తుంటాయి. మధ్యలోది మరుగునపడిపోతుంది. దీన్నే ప్రాథమ్య సూత్రం అంటారు. ఏకధాటిగా రెండు గంటలు చదివినపుడు ఓ మొదలు, ఓ తుది మాత్రమే వస్తాయి. అందువల్ల చదివినదానిలో అతి తక్కువ మాత్రమే మనసులో నమోదు అవుతుంది.
చదివే రెండు గంటల కాలంలో నాలుగు వ్యవధానాలు ఇస్తూ చదివితే దానిలో 4 మొదలు, 4 తుది ఘటనలు ఏర్పడతాయి. అందువల్ల చదివినదానిలో ఎక్కువ నమోదు కావడానికీ, గుర్తుండటానికీ వీలవుతుంది.
తాజాదన సూత్రం
ఎప్పుడో చదివి వదిలేవాటికన్నా ఇటీవల చదివినవాటినే మెదడు గుర్తుపెట్టుకుంటుంది. 1993లో, 2008లో ముంబాయిలో ఉగ్రవాద దాడులు జరిగాయి. 93లో వేలమంది చనిపోయారు. నగరమంతా అల్లర్లు చెలరేగాయి. 2008లో పరిమిత ప్రాంతంలోనే అల్లర్లు జరిగాయి. మృతుల సంఖ్యా తక్కువే. అయినా 93 ఘటన కన్నా 08 నాటి సంఘటనే బలీయంగా గుర్తుండటానికి కారణం తాజాదన సూత్రమే. విద్యార్థులు కూడా పరీక్షరోజు ఉదయాన్నే ముఖ్యమైన అంశాల సారాంశాన్ని ఓసారి చూసుకుంటే బాగా గుర్తుపెట్టుకొని రాయవచ్చు.
సబ్లిమినల్ ప్రక్రియ
పైన చూసిన అంశాలన్నీ ప్రయత్నపూర్వకంగా మన మనసు మీద సమాచారాన్ని ఎలా ముద్రించుకోవాలో తెలియజేస్తున్నాయి. అయితే స్వప్రయత్నం లేకుండా కూడా జ్ఞాపకశక్తిలోకి సమాచారాన్ని పంపవచ్చు. అదే సబ్లిమినల్ ప్రక్రియ. ప్రకటన సంస్థలు ఈ కళను వినియోగించుకొని లాభాలు ఆర్జిస్తుంటాయి. అలసటగా ఉండి ఓ షాపులోకి వెళ్ళిన వ్యక్తి కొద్దిపేపట్లోనే సేదతీరి అనేక వస్తువులు కొనటానికి కారణం ఆ షాపులో మంద్రస్థాయిలో వినపడే ఆహ్లాదకరమైన సంగీతమే. అది అలసటను తీర్చటమే కాకుండా అతడు కొనటానికి సుముఖుడు కావటానికి కొన్ని సంకేతభావాలు పంపిస్తుంది. విద్యార్థులు ఆల్ఫా సంగీతాన్ని జోడిస్తూ క్లిష్టమైన విషయాలు చదివితే అవి స్పష్టంగా మనసులో నమోదవుతాయి.
_________________________________
మనం చదివినదాంట్లో తుదీ మొదలు భాగాలే గుర్తుంటాయి. మధ్యలోది మరుగునపడిపోతుంది. ఏకధాటిగా రెండు గంటలు చదివినపుడు ఓ మొదలు, ఓ తుది మాత్రమే వచ్చి చదివినదానిలో అతి తక్కువే మనసులో నమోదవుతుంది. అయితే ఆ రెండు గంటల కాలంలో నాలుగు వ్యవధానాలు ఇస్తూ చదివితే దానిలో 4 మొదలు, 4 తుది ఘటనలు ఏర్పడతాయి. చదివినదానిలో ఎక్కువ నమోదై, గుర్తుండిపోతుంది.
__________________________________________
(ఈనాడు, ౬ & ౧౩ :౦౪:౨౦౦౮)

Friday, June 26, 2009
సాటిలేని సాధనం... మైండ్ మ్యాపింగ్
సాటిలేని సాధనం... మైండ్ మ్యాపింగ్
ఎంతో ఉపయోగకరమైన 'కార్నల్ నోట్సు'కు కూడా కొన్ని పరిమితులున్నాయి. అవి- వాక్యపూరణకు అవసరమైన వ్యర్థపదాలు చోటుచేసుకోవటం, జ్ఞాపకశక్తి వినియోగానికి తక్కువ అవకాశం ఉండటం. ఈ లోపాలను సవరించి మంచి ఫలితాలనిచ్చే తిరుగులేని నోట్సే 'మైండ్ మ్యాపింగ్'. మన మెదడు పనిచేసే విధానాన్ని ఆధారంగా చేసుకొని ఈ విధానాన్ని మానవాళికి అందించిన విద్యావేత్త టోనీ బూజాన్.
మైండ్ మ్యాపింగ్ స్వరూపం చూద్దాం. విషయానికి కీలకమైన ప్రధాన భావం ఓ చిత్రం/దానికి చిహ్నమైన ఆకృతి (image) రూపంగా నోట్సు మధ్యభాగంలో ఉంటుంది. చెట్టులోని కాండానికి కొమ్మలు అతికినట్టు ప్రధాన భావానికి ప్రతిరూపమైన చిత్రం/ ఆకృతికి అనుసంధానంగా మిగతా భావాలు కొన్ని వర్గాలుగా విడివడివుంటాయి. ప్రతి భాగం తనకు సంబంధించిన విజ్ఞానాన్ని శాఖ, ఉపశాఖలుగా ప్రదర్శిస్తుంది. శాఖ, ఉపశాఖల లైన్ల (lines) పైన ముఖ్యభావాలను సూచించే కీలక పదాలు, చిత్రాలు లేదా గుర్తులను సూచిస్తారు. ఈ శాఖలు, ఉపశాఖలు, చిత్రాలు, చిహ్నాలు వివిధ రంగుల్లో ఉండడం వల్ల మైండ్‌మ్యాపు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
మైండ్ మ్యాపింగ్ ఎలా చేయాలి?
దీని నిర్మాణం ఆసక్తికరంగా ఉంటుంది. ఆకృతిలో ఎంత స్వేచ్ఛ కనిపిస్తుందో, దాని నిర్మాణంలో అంత శాస్త్రీయత ఇమిడివుంటుంది. మైండ్‌మ్యాపులను ఇష్టం వచ్చినట్టు కాక, కొన్ని సూత్రాల ఆధారంగా తయారుచేసుకోవాలి. సౌలభ్యం కోసం వాటిని ఐదు వర్గాలుగా విభజించి, మైండ్ మ్యాపు నిర్మాణాన్ని చూద్దాం.

1. పేపరు మధ్య నుంచి నోట్సు
తెల్లగా ఉండే కాగితాన్ని అడ్డుగా ఉండే లాండ్‌స్కేప్ ఆకృతిలో పెట్టి దాని మధ్యభాగంలో విషయానికి కీలకమైన ప్రధానభావాన్ని ఓ చిత్రం/ దానికి చిహ్నమైన ఆకృతి రూపంలో చిత్రించాలి.
ఉదాహరణకు... పుస్తకం చదవడం వల్ల ఉపయోగాల గురించి నోట్సు రాసేటప్పుడు పేపరు మధ్యలో పుస్తకం ఆకృతిని గీయాలి. ఇలా నోట్సు మధ్యభాగంలో ప్రారంభించడం వల్ల మన ఆలోచనలకు అన్నివైపులా అల్లుకుపోయే అవకాశం లభిస్తుంది. పైగా, భావాలను స్వేచ్ఛగా, సహజంగా వ్యక్తీకరించడానికి వీలవుతుంది.
2. ప్రధాన చిత్రానికి శాఖల అమరిక
చెట్టుకు కొమ్మలు, వాటి రెమ్మలు ఎలా పొందికగా ఉంటాయో, అదే విధంగా మైండ్‌మ్యాపులోని శాఖలు, ఉపశాఖలు ఒకదాని నుంచి మరొకటి పుట్టుకొచ్చినట్టు చక్కని అమరికలో లైన్లు గీయాలి. మధ్యశాఖలను లావుగా, ఉపశాఖలను సన్నగా గీయాలి. రేఖల నిడివి సమానంగా ఉండాలి. చెట్టుకొమ్మల మల్లే ఈ రేఖలు కూడా వంపు తిరిగి సహజంగా ఉండేలా గీయాలి. అలా ఉంటేనే మెదడు గుర్తుపెట్టుకుంటుంది.
3. కీలక పదాల, చిత్రాల, రంగుల వాడుక
శాఖల, ఉపశాఖల లైన్ల పైభాగంలో కీలక పదాలను అందంగా రాయాలి. ఒక గీతపై ఒక పదమే ఉండాలి. మాటలతో పాటు గుర్తులు/చిత్ర ఆకృతులు వాడితే మరీ మంచిది. ఓ చిత్రం వేల మాటల అర్థాన్ని స్ఫురింపజేస్తుంది కదా! అలాగే మైండ్‌మ్యాపులో తప్పనిసరిగా పాటించవలసిన నియమం ఏమంటే- కేంద్రం నుంచి ప్రారంభమయ్యే ముఖ్యశాఖ, దాని ఉపశాఖలు, వాటి ఉప ఉపశాఖలన్నీ ఒకే రంగులో ఉండాలి. వాటిపై రాసే చిత్రాలను కూడా రంగుల్లో చిత్రిస్తే మెదడు బాగా గుర్తుపెట్టుకుంటుంది. రంగులకు సృజనాత్మకత ఎక్కువ. కాబట్టి అవి వేల భావాలను ప్రేరేపిస్తాయి.
4. స్పష్టమైన నిర్మాణం
అవసరానికి తగ్గట్టు కావలసిన రీతిలో వంచుకోడానికి మైండ్‌మ్యాపులో అవకాశం ఉన్నా, దానిలో కూడా ఓ స్పష్టమైన నిర్మాణం ఉంది. శాఖల పొడవు, పదాల నిడివి సమానంగా ఉంటాయి. ఒక శాఖకూ, మరో శాఖకూ మధ్య ఉండే ఖాళీస్థలం కూడా సమానంగా ఉంటుంది. అందువల్ల మైండ్‌మ్యాప్ ఆకర్షణీయంగా కన్పిస్తుంది. మైండ్‌మ్యాపును పెంచి రాయవలసివస్తే వేరే పేపర్లో కానీ, పక్క పేపర్లో కానీ రాయకూడదు. ఉన్న పేపరుకు మరో పేపరును అతికించి పేపరును పెద్దది చేయాలి. ఒకే పేపర్లో మొత్తం మైండ్‌మ్యాపును చిత్రించాలి.
మైండ్ మ్యాపు తయారుచేసే విధానం వినోదాత్మకంగా ఉండాలి. వ్యక్తిలోని సృజనాత్మకత, కాల్పనికత, భావుకత, ఊహా ప్రాగల్భ్యాలను నిద్ర లేపేలా ఉండాలి. అలాగే మైండ్‌మ్యాపును లిఖించే వ్యక్తికి సంబంధించిన వ్యక్తిత్వం నోట్సులో ప్రతిఫలిస్తూ ఉండాలి. అందం, అభినయంతో మైండ్‌మ్యాపు ఆకర్షణీయంగా ఉండాలి.
మైండ్‌మ్యాపును తయారు చేసుకోవటం గురించి చెప్పుకున్న పై భావాలను మైండ్‌మ్యాపులో ఏ విధంగా చిత్రించవచ్చో చూడండి.
________________________________________
అభ్యాసం చేస్తే అద్భుతాలు
మైండ్ మ్యాప్ ఉపయోగాలను ప్రధానంగా పది రకాలుగా చెప్పుకోవచ్చు.
ఓ మైండ్‌మ్యాపుగా ఇలా చిత్రీకరించవచ్చు.
1. విషయం అర్థం కావాలంటే: ప్రధాన అంశాన్ని ఒక చిత్రం లేదా దాని చిహ్నమైన ఆకృతి ద్వారా నోట్సు మధ్యలో చిత్రించాలి. దాని చుట్టూ ముఖ్యమైన భావాలను శాఖలుగా అమర్చాలి. ఒక్కొక్క శాఖలో సాపేక్షంగా ఇతర భావాలను పేర్చి, వాటికి తగిన వివరణ ఇవ్వాలి. ఇలా చేస్తే ఎంతటి క్లిష్టమైన భావమైనా తేలిగ్గా అర్థమవుతుంది.
2. కాలం ఆదా చేయాలంటే: మైండ్ మ్యాపింగ్‌లో కీలక పదాలకు చోటు ఉంటుంది. రాతలో 80 శాతం ఆక్రమించే పూరణపదాలకు (ఫిల్లింగ్ వొర్ద్స్) కు తావుండదు. అందువల్ల తక్కువ కాలంలో ఎక్కువ అంశాలు రాసుకోవచ్చు.
3. స్పష్టంగా గుర్తుండాలంటే: మన మెదడు ఎలా పనిచేస్తుందో మైండ్ మ్యాప్‌లో చిత్రీకరణ అలా జరుగుతుంది. మెదడు, మైండ్‌మ్యాప్ పరస్పరం బింబ ప్రతిబింబాలుగా ఉంటాయి. దానివల్ల-
- శాఖ, ఉపశాఖలతో అనుసంధానమనేది జ్ఞాపకశక్తికి ప్రాణవంతమైన సూత్రం. ఒక భావం తట్టగానే వందల వేల భావాలు మన మస్తిష్కంలో నిద్రలేవడానికి కారణమిదే. అలాంటి అనుసంధానం, అల్లిక జిగిబిగి మైండ్‌మ్యాప్‌కు ప్రత్యేకం.
- మెదడు కీలక పదాలనూ, చిత్రాలనూ, ఆకృతులనూ గుర్తుపెట్టుకుంటుంది. మైండ్‌మ్యాప్‌లో ఉండేవి కూడా కీలక పదాలూ, చిత్రాలూ, ఆకృతులే. అందువల్ల అమోఘమైన జ్ఞాపకశక్తి మైండ్‌మ్యాప్ సొంతం.
* మైండ్‌మ్యాపులు దృశ్యాత్మకంగా ఉండడం వల్ల పునశ్చరణ (రివిజన్) చేయడం తేలిక అవుతుంది.
4. మెదడుకుండే అనంతశక్తిని వాడుకోవాలంటే: మెదడులోని కుడి ఎడమ వలయాల్లో అనంత మేధాశక్తి దాగివుంటుంది. ఊహాశక్తి, చిత్రలేఖనం, పద విజ్ఞానం, తార్కిక అంశాలు ఉన్న కుడి, ఎడమ వలయాలు అనుసంధానమైనపుడు అద్భుతశక్తి ఆవిర్భవిస్తుంది. మెదడులోని ఈ అపూర్వశక్తులను అనుసంధానం చేసుకోవడానికి మైండ్‌మ్యాప్ చక్కగా సహకరిస్తుంది.
5. సృజనాత్మకంగా ఆలోచించాలంటే: యాంత్రికమైన లీనియర్ ఆలోచనా విధానానికి కాక, క్రియాత్మకమైన లేటరల్ ఆలోచనా విధానానికి మైండ్‌మ్యాప్ అవకాశం కల్పిస్తుంది. అందువల్ల మనసు సృజనాత్మకమైన కొత్త ఆలోచనలతో ప్రేరణ పొందుతుంది.
6. సమస్యా పరిష్కారం చేయాలంటే: విషయాన్ని విశ్లేషించడం, దాన్ని కొన్ని వర్గాలుగా విభజించడం, వాటిమధ్య అనుబంధాన్ని నిర్మించడం మైండ్‌మ్యాప్‌కు కొట్టిన పిండి. అందువల్ల సమస్యలోని వివిధ పార్శ్వాలను ఏకకాలంలో అవగతం చేసుకోడానికీ, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం రాబట్టడానికీ మైండ్‌మ్యాప్ సహకరిస్తుంది.
7. ప్రణాళికాబద్ధంగా ఉండాలంటే: విషయాన్ని క్రమబద్ధంగా నిర్వహించడానికీ, ఓ క్రమపద్ధతిలో వ్యవస్థీకరించడానికీ, ఎక్కువ సమాచారాన్ని సంక్షిప్తంగా ఒకచోట నిక్షిప్తం చేయడానికీ పక్కా ప్రణాళిక కావాలి. ప్రణాళికా ప్రక్రియకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తుంది మైండ్‌మ్యాప్. కాబట్టి సుదీర్ఘ పరిశోధనా పత్రాలు రూపొందించడానికీ, విపులమైన వ్యాసాల/ పుస్తకాల రచనకూ, సుదీర్ఘమైన సభల నిర్వహణకూ; ప్రయాణాలు, వినోద యాత్రల వంటి అనేక క్లిష్టమైన అంశాలు చేపట్టడానికీ మైండ్‌మ్యాప్ అనుకూలంగా ఉంటుంది.
8. ధారాళంగా భావ వ్యక్తీకరణ చేయాలంటే: ఒక ఉపన్యాసం రక్తి కట్టాలంటే వక్త ధారాళంగా, సుదీర్ఘంగా భాషిస్తూ ఎలాంటి విరామాలు లేకుండా శ్రోతలను ఉర్రూతలూగించాలి. సుదీర్ఘమైన, విషయ ప్రాధాన్యం ఉన్న ప్రెజెంటేషన్స్ వంటి భావవ్యక్తీకరణకు దృశ్యాత్మకంగా ఉండే మైండ్‌మ్యాప్‌లు ఎంతో సదుపాయంగా ఉంటాయి.
9. చదువు వినోదాత్మకంగా సాగాలంటే: చిత్రాలతో, వివిధ వర్ణాలతో మైండ్‌మ్యాపులు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిని తయారుచేయడం, చదవడం కూడా తమాషాగా ఉంటుంది. అందువల్ల చదువు వినోదాత్మకంగా ఉండి, ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
10. సర్దుబాటుతో పాటు స్పష్టమైన ఆకృతి కలిగివుండాలంటే: స్పష్టమైన ఆకృతిని కలిగివుంటూనే మైండ్‌మ్యాపులో అవసరానికి తగ్గట్టుగా సర్దుబాటు గుణం ఉంటుంది. అంతేకాక ఒక ప్రధాన భావాన్ని ప్రతిబింబించే శాఖకూ, మరొక ప్రధాన భావాన్ని వ్యక్తం చేసే శాఖకూ మధ్య కొంత ఖాళీ చోటు ఉంటుంది. నూతన విషయాలను చేర్చుకొని రాసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. అందువల్ల కాలం వెచ్చించి, మరొక మైండ్‌మ్యాప్ రాసుకోవాల్సిన అవసరం లేదు.
(ఈనాడు, ౨౩ & ౩౦:౦౩:౨౦౦౯)