Showing posts with label నా అనంతరంగం. Show all posts
Showing posts with label నా అనంతరంగం. Show all posts

Friday, February 12, 2010

ఉపవాసము

నా భావనలో "ఉపవాసము" అంటే  ఏదో  బరువు  తగ్గడం  కోసమో  లేక  సంప్రదయమనో  చెయ్యడం  కాదు …ఉప --వాసము  అంటే దగ్గరగా  నివసించందం ..అంటే
1.
ఆ  రోజు  మొత్తం  దేవునికి  మరింత  సన్నిహితంగా , దగ్గరగా  ఉండడం, మంచి  ఆలోచనలతో, ఏ విధమైన   అనవసరపు  వ్యర్ధ  ప్రలోభాలకు లోను  కాకుండ,  ఒక  దాని  మీద  ద్రుష్టి  కేంద్రీకరించడము ....
2. లంకణం  పరమౌషధం కాబట్టి ...మన  జీర్నశాయానికి  కొంచెం  విశ్రాంతి  ఇవ్వడం ద్వారా అది మరింత  చక్కగా పనిచేయడానికి దోహదపడం..
3. అన్నిటికంటే   ముఖ్యమైనది ...ఇలా  ఏదో  ఒక  నమ్మకంతోనో, బయంతోనో, సాకుతోను మన  ఇంద్రియాలపై కాసేపైనా పట్టు  సాదించడం. నిగ్రహం కలిగిఉండడం, అదుపులో పెట్టుకోవడం  ...అంటే  మన  తుఛ్మైఅన  కోర్కెలను  కళ్ళెం  వేసి  పట్టుకోవడం  అన్నమాట ....

ఇలా అప్పుడప్పుడు చెయ్యడం వల్లనైనా మనం మన ఇంద్రియ నిగ్రహం పై విజయం సాధించే దిశగా అడుగులు వెయ్యడం ... మీ "అమ్మ" శ్రీనివాస్ 

Thursday, February 11, 2010

Quote for the day/మంచి మాట

నిన్ను నమ్మేది జనం
          నడిపేది దైవం
          చేరాల్సింది గమ్యం
         కావాల్సింది నమ్మకం
         వదలాల్సింది అనుమానం
         వరించేది అదృష్టం
         పొందేది విజయం
        జీవితమంతా ఆనందం /సంతోషం

Wednesday, February 10, 2010

నేను వేములవాడ వెళ్లి వచ్చు సమయములో బస్సు లో నా మది పలికిన పలుకుల గుళికలు

ఇక్కడ "అమ్మ"  అంటే నాకు అత్యంత ఇష్టమైన ౩
ఒకటి. అమ్మలుగన్న ముగురమ్మల మూలపుటమ్మ
రెండు . మాయమ్మ  (మా అమ్మ)
మూడు. అమ్మ స్వచ్చంద సేవ సమితి  


అమ్మతో సాంగత్యం అమృత బాన్డంబు..
అమ్మ కరుణకున్న అవధి ఏది..
అమ్మ లేని నాడు ఆహార్యమేలరా..
అమ్మ ఉన్న చోటే  ఆనందమున్డురా!!!

అమ్మ కోసం ఆత్మ అర్పింపజాలన
అమ్మ అవని ఉన్న నా అత్మ యేనురా
అమ్మ ఊసులేని ఈ శ్వాస ఏలరా
అమ్మతో ఈ బంధం ఏనాటిదోనురా!!!

అమ్మ చల్లని చూపు ఆశీరవచనంబు
అమ్మరా ఈ అమ్మ లలితమ్మర.. 
అమ్మరా ఈ అమ్మ మీ అమ్మరా!!!

నిముషమైనా కదల నువ్వు లేక నా ముందు
 నిముషమైనా కదల  నువ్వు లేక మదియందు 
నిను చేరు, నిను కొల్చు, నిను చూచు భాగ్యంభు
కల్పించావే నాకు కల్పతరువా !!!

క్షణమైన స్తంభించు నువ్వు లేక లోకంభు,
క్షణములో తొలగించు ఈ మయజాలంబు,  
అమ్మ చల్లని చూపు అవనిపైన
సృష్టించు అంతట సంతసంభు!!!

చూపవే.. ఆ కరుణ నిముషమైనా
శాశ్వతముగా.. శోకం లోకమొదులు
చూపవే నీ కరుణ చూపవే తల్లి
బాపవే కష్టాలు బాపవే  తల్లి
నిను కొల్చు, నిను తల్చు నిష్కల్మషముగా
దరి చేర్చుకో తల్లి దాపు జేరి ..
చేయవే ఈ జన్మ సార్ధకంబు..
నిను కొల్చి, నిను తల్చి అర్పించులాగా
నీ కొరకే సాగించు జీవితంబు!!!
 
ఏల నాకీ భ్రమలు, పైపైన మాయలు?
ఎప్పటికిన్ కొల్చు నిను శాశ్వతముగా ? 
 ఎప్పటికిన్ స్తుతించు నిను శ్వాసలాగా   ?

ఏమిటీ భంధాలు, ఏమిటీ ప్రేమలు?
ఏమిటీ పుట్టుకలు, ఏమిటీ చావులు?
ఏమిటీ ఘోరాలు, ఏమిటీ నేరాలు?
చూపవే తల్లి వీటి పరిష్కారాలు..

చూపవే జనని  నిత్య సంతోసము
చూపవే జనని నిత్య ఆనందము
ఏ వాడనైనా, ఏ ఉరునైనా,  
ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ..
ఎందెందు నువ్వున్న అందందు..
ఎల్లకాలములలో, ఎల్ల వేళలలో,
అన్ని భావాలలో, అన్ని భావనలలో,
అన్ని మార్గాలలో, అన్ని జాతులలో,
అన్ని కులాలలో, అన్ని మతములలో..
అర్పింతు నా జన్మ, అర్పింతు నా కర్మ
అర్పింతునే నీకు సర్వంబును..
తీసుకో ఓ జనని, చేర్చుకో తల్లి..
కలుపుకో నీ యందు కనికరము చేతన్

కాపాడు, రక్షించు ,కవ్వించు, నడిపించు జనని
తొలగించావే భ్రమలు తొందరగ తల్లీ
చేర్చుకో నీ దరికి, చేర్చుకో తల్లి,..

పుట్టగానే జనులు పుట్టునే కోర్కెలు
నువ్వు-నేనులనే జంట స్వార్ధముల్
నాది-నాది   అంటూ సాగేను జీవితము

కట్టేరు మేడలు, కట్టేరు భవనాలు,
చేరేరు చివరికి మట్టిలోన
తెలుపవే జనని నీవేమిటో నాకు
చూపవే తల్లి కర్తవ్య మార్గము

ఏల పుట్టిన్చావో...ఎటుల నడిపించేవో..ఎడేడో  తిప్పేవో..ఎందుకొరకో.
ఏమిటో మర్మంబు, ఏమిటో కార్యంబు, తెలియచేయవే నాకు ఇప్పుడైనా ,
తెలియచేయవే నాకు కొంచెమైనా,
ఎందుకీ నాటకము, ఎందుకీ భుటకము, ఎందెందు వెతికినా నువ్వే కదా, ఏమేమి చేసిన నువ్వే కదా...  

ఇది నా అంతరంగం...మీ అమ్మ శ్రీనివాస్ 
 

Friday, February 5, 2010

ఆలోచన-ఆయుధం

కెరటాలపై తేలుతూ,   ఆటుపోట్లను  ఎదుర్కొంటూ,  నీటి  మీద  నిలదొక్కుకుంటూ, నావ  గమ్యం  చేరడానికి  చుక్కాని  మీద  నియంత్రణ  ఎంత  అవసరమో...

మనిషి  జీవితంలో కూడా  కష్ట, సుఖాలను  ఎదుర్కొంటూ, ఆనందడోలికల్లో  తేలియాడుతూ   గమ్యాన్ని/లక్ష్యాన్నిచేరడానికి  "ఆలోచనల" మీద  నియంత్రణ  కూడా  అంతే  అవసరం..

మానవ జీవితాన్ని  దిశా, నిర్దేశం  చేసేది  మరియు ముందుకు నడిపే చుక్కాని కూడా   "ఆలోచన" లేదా "ఆలోచనల సముదాయమే" .. నా ఈ జీవిత అనుభవాల పరంపరలో నేను నేర్చుకున్న నీతి, తెలుసుకున్న సత్యం "అన్నిటికి మూలం ఆలోచనే" అని. 

ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా సాధించాలంటే దాని గురించి ప్రతి క్షణం (లేక ఎక్కువ సేపు)  ఆలోచించగలిగితే చాలు..ఖచ్చితంగా  అనుకున్నది సాదించగలిగే శక్తీ, యుక్తి తో పాటు అనుకున్నది తొందరగా  సాదించటానికి వీలవుతుంది.  అది చదువు , ఉద్యోగం , స్నేహం,  ప్రేమ,
లక్ష్యం కావొచ్చు, మరేదైనా కావొచ్చు... అది ఎంత చిన్నదైన లేక ఎంత పెద్దదైన కావొచ్చు విజయం నీ ముంగిట అనతికాలంలోనే రెక్కలు కట్టుకొని వాలుతుంది.

మానవ జీవితాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దోకోవడానికి  కావాల్సిన ఒకే ఒక ఆయుధం "ఆలోచన" ... ఆలోచనలు మంచివైతే నీ పయనం మంచి వైపు...
ఆలోచనలు  చెడువైతే నీ దారి చెడువైపు...

ఆలోచనలు  - మాటలుగా 
మాటలు - చేతలుగా చేతలు - ఇస్టాలుగా
ఇస్టాలు - అలవాట్లుగా (ఆచరణలు)
అలవాట్లు - స్వభావాలుగా  (వ్యక్తిత్వంగా )
స్వభావాలు - తలరాతలుగా  పరివర్తన చెందుతాయి..

అంటే ఒక్క నీ ఆలోచనల సమాహారమే నీ జీవితాన్ని నడిపే ఆయుధం... నీ మాటే నీవు సృష్టించుకొనే ప్రపంచం  (Word Makes World) ... కావున


చెడు ఆలోచనలను నియంత్రించుకో...
మంచి ఆలోచనలను పెంపోదించుకో...
ఆనందకరమైన పరిసరాలను సృష్టించుకో..
మహోన్నత వ్యక్తిత్వాన్ని అవలంబించుకో..
మంచి సమాజాన్ని సృష్టించుకో..
అందరికి ప్రేమను పంచుతూ..అందరికి సేవ చేసుకొంటూ.. జీవిత లక్ష్యాన్ని చేరుకో...   

జీవిత సమరంలో కష్టాల్, సుఖాల్, దుఖాల్ ఏమి ఎదురైనా మొక్కవోని దైర్యంతో, మంచి ఆలోచనలతో లక్ష్యాన్ని చేరుకో... ఈ ప్రపంచాన్ని అంతటా ప్రేమను పంచే ఒక ఆనందకరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దుకో.... ఇందుకు నీ  వంతుగా మంచి ఆలోచనలు అభివృద్ధి  చేసుకో.... 

మీ "అమ్మ"  శ్రీనివాస్  


ఆది నుంచి ఆకాశం మూగది.....
అనాదిగా తల్లి ధరణి మూగది...
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు...
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు...ఇన్ని మాటలు..

Thursday, February 4, 2010

నా అంతరంగం (అనంతరంగం)

 

మనసంత ఆహ్లాదO, వళ్ళంతా ఉరిమే ఉత్సాహం, మోముపై సిగ్గుతో కూడిన నవ్వు, మదిలో ఆమె ఆలోచనలు...

మనసుకు ఎప్పుడూ దొరకనంత ప్రశాంతత, ఇంకా ఇంకా పొందాలి అనిపించే అనుభూతి అది.. 

వర్ణనాతీతO ఆ ఉద్రేకo, ఆ భావనలో అందరు మంచి వాళ్ళే, ఎటు చూసినా ఆనందమే, సంతోషమే, 

చేసే పనిలోనే నిరుత్సాహం..మనసులో ఏవేవో ఆలోచనలు, భవిస్యత్తు పై ఆకాంక్షలు......

నునువెచ్చని గ్రీష్మంలా...మావిచిగురు తిన్న కోయిలలా .....పిల్లలకి పాలిస్తున్నతల్లి పొందే అనుభూతిలా అదో వింత మధురానుభూతి..

జీవితంపై కొత్త ఆశలు , తొంగిచూస్తున్న ఏవేవో కొత్త తలపులు, అనుభూతులు..ఆలోచనలు… 

ఎడారిలో ఒయాసిస్సులా ప్రేమపై ఆలోచనలు... కవితలుగా మారుతున్న పదాలు, భావనలు

సర్వరాజు. శ్రీనివాస ప్రసాద్ రావు 

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070