Thursday, February 4, 2010

పరిత్యజించవలసిన పదహారు దురలవాట్లు



పొందేవు పొగత్రాగి పరమానంద డోలికలు
గుర్తించకున్నావు గుప్తంగా శరీరమందు చీలికలు

మునిగిపోయేవు మధ్యమందు తేలియాడి తెలియనిలోకాలలో
తెలుసుకోలేవు తీవ్రంగాజరిగే కర్కశకోత కణజాలములలో

ఆస్వాదించేవు అతిరుచిప్రాదాన్య ఆహారమును సర్వమనేభావనలో
ఆహ్వానిస్తున్నావు అనారోగ్యాన్ని అనాలోచిత ఆనందాన్వేషణలో

కోరిచూసేవు కాలక్షేపముగా హింస కామపూరిత చిత్రములను
మరచిపోయేవు మానసికముగా దహించుకుపోయే దురాలోచనలను

విహారముచేసేవు విందులతో వినోదాలతో జీవితకాలాన్ని
జీర్నించుకోలేకున్నావు జీవన గమ్యరాహిత్యము లక్ష్యలేమిల నిర్జీవసామ్యాన్ని

వేర్రులుచాచేవు విలాసభారిత అవసరాలకొరకు ధనార్జనదారులందు
మునిగిపోతున్నావు మార్గరహితముగా ఉండిపోతున్నావు అప్పులవూబులందు

జీవనం సాగించేవు నిర్లక్ష్యముగా సోమరితనముతో బద్దకప్రపంచములో
ప్రయాణిస్తున్నావు అనాలోచితముగా అంధకారభూయిష్ట నిశ్రుహప్రపంచములో

కాలక్షేపముచేసేవు కాలహింసతో భావించి కాలము విలువలేని వస్తువని
విలువకట్టలేకున్నావు ఒక ఘడియ తిరిగిరాని సంపాదించలేని వజ్రసమానమని

బ్రమించేవు కులప్రీతి పరమతద్వేషములను ఘనకార్యయుక్తమని
విస్మరిస్తున్నావు సమైక్యత స్నేహపూరితసమాజము అభివృద్దికారకమని

అర్రులుచాచేవు అక్రమసంపాదన లంచములకోరకు స్వార్ధమే ధ్యేయమని
కానకున్నావు అది కాలసర్పమై సమస్తప్రజలను హరించివేస్తుందని

చొరబడి చొచ్చుకొని సాగేవు అడ్డదారులలో తాత్కాలిక లాభార్జన వృత్తి ధర్మమని
అర్ధముచేసుకోలేకున్నావు పరులసేవలో ఆనంద పారవశ్యం పొందగలవని

కొనసాగించేవు అబద్దము అవినీతి అసూయద్వేషాలతో అనుక్షణ సహజీవనము
త్యజిస్తున్నావు విశ్వాసము నిజాయితి సంప్రాప్తింప చేసే అనంత ఐశ్వర్య సర్వస్వము
మోహించేవు అహంభావము ఆవేశములను అద్భుత అలంకారములుగా
చూడలేకున్నావు అనుభందము అత్మీయతలను వ్యక్తిత్వశోభిత జ్యోతులుగా
ప్రతిభాశాలిగా విర్రవీగేవు విశ్వవిజ్ఞానిగా అప్రయోజకపఠనముచేసి అజ్ఞానముతో
అస్వాధించలేకున్నావు నిరంతర విద్యార్థిగా అనంత శాస్త్రరహస్యాలను వినయముతో

అభివర్నించేవు పవిత్రప్రేమగా ఆకర్షణ ఆత్మవంచనలకు ఆదిపీఠము వేసి అద్భుతముగా
చేరుకోలేకున్నావు శాశ్వత ప్రేమను మానసిక సౌందర్యాలను అంతర్గత విలువల ఆధారముగా

పొంగిపోయేవు విదేశీ సంస్కృతి విచ్చలవిడితనముతో సర్వస్వతంత్ర జీవన మాధుర్యమని
పొందజాలకున్నావు భరత సంస్కృతి మాత్రువాత్సల్యముతో సంరక్షించి నీకై దాచిన విజ్ఞానగని

పరిత్యజించు ఈ పదహారు దురలవాట్లను నిస్సందేహముగా
పరివర్తనచెందు క్రియాశీల దేశభక్తి సంపన్న సమాహారముగా
----ప్రభాకర రావు కోటపాటి

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070