Monday, August 10, 2009

అమ్మస్వచ్చంద సేవా సమితి

అమ్మస్వచ్చంద సేవా సమితి

అమ్మ అనే పదంతో మనందరికీ ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమిలేదు .

సృష్టిలో తియ్యనైన పదం "అమ్మ"

నిశ్వార్ధమైన ప్రేమకు రూపం "అమ్మ"

భావిభారత పౌరులను తీర్చిదిద్దే గురువు "అమ్మ"

ఇలా ఒక తల్లి

ఎలా అయితే తన బిడ్డను చుడాలనుకుంటుందో

ఎలా అయితే తన బిడ్డను ప్రేమిస్తుందో, ఆదరిస్తుందో

ఎలా అయితే ఉన్నత లక్ష్యాల దిశగా నడిపిస్తుందో

ఎలా అయితే మానవత విలువలను ఇనుమడింప చేస్తుందో

అలానే మన అమ్మ (స్వచ్ఛంద సేవ సమితి) కూడా ప్రేమ కోల్పోయిన వారికీ ప్రేమను అందించాలని, ప్రతి ఒక్కరి మోముపైన చిరునవ్వును చూడాలని, దారి తెలియని వాళ్ళకి దారి చూపించాలని, ప్రతి ఒక్కరికి విలువలతో కూడిన విద్యను అందించి తద్వారా వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో స్థాపించబడి, "అందరిని ప్రేమించడం - అందరిని సేవించడం" అనే నినాదంతో " "నిస్వార్ధమైన సేవను అందించాలనే" లక్ష్యంతో ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న పిల్లవాడిలా వడివడిగా ముందుకు కదులుతోంది..

2008జనవరి 1 అనాధ ఆశ్రమ సందర్శనతో స్పూర్తినొందిన / ప్రేరణ పొందిన 15మంది సన్నిహితుల, స్నేహితుల సముదాయమే "అమ్మ". ఆనాటి ప్రేరణే/ఆలోచనలు ఏప్రిల్ 27, 2008 కార్య రూపం దాల్చాయి.

మొదట అనాధ ఆశ్రమాలను, వ్రుద్దాశ్రమాలను మరియు అనేకరకాలైన ఆశ్రమాలను ప్రతి వారం సందర్శించడం ద్వారా అక్కడి వారితో ఆనందంగా గడపడం, ఆడటం, పాడటం అక్కడి వారిలో నిరాశ, నిష్ప్రుహలను పారద్రోలుతూ వారికీ ఆనందాన్ని పంచుతూ "మీకు మేమున్నాము" అనే భరోసాను కల్పిస్తూ, వారి కష్టాలను, సుఖాలను పంచుకుంటూ.... వారికీ జీవితం మీద ఆశని, ఆసక్తిని కలిగించి వారిని జీవితం లో ఉన్నత లక్ష్యాల దిశగా నడిపించడానికి ప్రయత్నిస్తోంది.

ప్రయత్నంలో భాగంగా ఇలాంటి సామజిక భాద్యతను నిర్వర్తిస్తున్న అనేక రకాల స్వంచ్చాండ సేవ సంస్థలతో కలసి పనిచేయడం, వాటి పని తీరును గమనిస్తూ, సమాజం లో అట్టడుగు స్థాయిలలో ఉన్నవారి అవసరాలను, సమస్యలను వాటికి గల కారణాలను గుర్తించడం. వాటికి మా పరిధికి లోబడి సహాయం చేయడం, వేరే సంస్థల ద్వారా చేయించడం చేస్తూ ఉన్నాము....

అన్ని కష్టాలకు, భాధలకు, సమస్యలకు కారణం మన ఆలోచన విధానం. దానిని సరిగా ఉంచుకున్న నాడు, దానిని సరైన పద్ధతిలో ఉపయోగించిన నాడు, సరైన పద్ధతిలో పెట్టిన నాడు ప్రపంచంలో ఎక్కడ విధమైన అసమానతలు ఉండవని గ్రహించి, ఆలోచన విధానాన్ని సరైన పద్ధతిలో పెట్టగలిగేది, మార్చగలిగే ఒకే ఒక ఆయుధం జ్ఞానం/విజ్ఞానం కాబట్టి జ్ఞానాన్ని అందరికి అందచేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది..

జ్ఞానాన్ని సంపాదించే మార్గమే/ప్రయత్నమే "విద్య/చదువు". కాబట్టి మంచి విలువలతో కూడిన జ్ఞానాన్ని/చదువును అందరికి అందించడానికి పాఠశాలలకు, ఆశ్రమాలకు, మురికివాడలకు తిరుగుతూ అక్కడ క్రమం తప్పకుండా తరగతులను నిర్వహిస్తోంది. వీటిలో ఆటలు, పాటల ద్వారా అక్కడ వారికీ విలువలను మరియు చదువు పై అవగాహన కల్పిస్తోంది.

ప్రస్తుతానికి కార్మిక నగర్, మెట్రో లాంటి మురికి వాడలలోనూ, ఫోరం ఫర్ స్ట్రీట్ చిల్ద్రెన్, శివానంద లాంటి ఆశ్రమాలలోను మరియు కొన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోను ప్రతి వారం తరగతులను నిర్వహిస్తోంది.

ఇలాంటి కార్యక్రమలు చేయడానికి "అమ్మ" కు, తద్వారా సమాజానికి సేవ చేయడానికి సమయాన్ని అందించి నేరుగా కార్యక్రమ్మాల్లో పాల్గొంటూ సహాయం చేసే వారు కొందరైతే, ఆర్ధికంగా సహాయం చేస్తున్న వాళ్ళు మరికొందరు...

ఇతరులకు సేవ చేయడం సామజిక సేవ కాదు ఇది మన భాద్యతదీనికోసం మన ప్రతి ఒక్కరికి సమాజానికి మనవంతు సాయం చేద్దామని ఉంటుంది .. కాని మనం మన పరిస్థితులతో ముడి పెట్టుకొని వాయిదా వేస్తూ వస్తాము …. దీనికోసం బాగా డబ్బు కావాలనే భావనలో .. మనం స్థిరపడ్డాక చేద్దామని వాయిదా వేస్తాము

కాని మన బాధ్యతను నిర్వర్తించడానికి డబ్బు అవసరమే కానీ అన్ని దానితోనే తీరవు, తీర్చడం వీలు కాదు అని తెలుసుకోలేకపోతున్నాము ….

ఇక్కడ డబ్బు లేక పేదరికం కాదు, డబ్బుతో మాత్రమే తీరే సమస్యలే కాదు ప్రేమను, ఆనందాన్ని, ఆప్యాయతని , అభిమానాన్ని , చిరునవ్వును, సంతోషాన్ని , సమయాన్ని పంచడంద్వారా పరిష్కరించగలిగే సమస్యలే అధికం.

ఇలా అధిక మొత్తంలో డబ్బులు అవసరం లేదు అని, చేతులు కలిస్తేనే చప్పట్లు, కొన్ని నీటి బోట్ల సముదాయమే సముద్రం అవుతుందని గ్రహించి "చిన్న మొత్తాల పొదుపు" ద్వారా ఇలాంటివి పరిష్కరించవచ్చానే ఉద్దేశంతో నెలకు మన అనవసర ఖర్చులని తగ్గించుకొని 100/- తగ్గకుండా దాచిపెట్టడం ప్రారంభించడం జరిగింది. ఇలా 15మందితో మొదలైన భాద్యతను రోజు 120కి పైగా స్వీకరించడానికి, ఇందులో చేరడానికి ముందుకు వచ్చారు, ఇంకా వస్తున్నారు...

ఇలాంటి మన చిన్న మొత్తాలు కొందరి జీవితాలను నిలపెట్టడానికి , కొందరి మోముపై నవ్వును, కొందరి చదువులకు, కొందరి ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు...నమ్మలేమేమో..

ప్రపంచంలో ప్రతిది ఒక్కరితోనే, ఒక్కటితోనే మొదలవుతింది... ఒక్కటి మరియు ఒక్కరు నువ్వే...నీ భాద్యత ను నువ్వు నిర్వర్తించు...ఇలా అందరు ముందు వెళితే..అందరి ఆలోచన సరళి మారగలితే ఇలాంటి స్వచ్ఛంద సంస్థల అవసరమే ఉండదు అని ఆశిస్తూ.... దీనికి మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించాలని కోరుకుంటూ.. " అమ్మ" కు మొదటి బిడ్డను ఐనందుకు ఎంతో ఆనందపడుతూ.... ఇలాంటి నిస్వార్ధమైన సేవలను మనం అందరికి అందించాలని, అందిస్తామని హామీ ఇస్తూ...

మీ శ్రేయోభిలాషి.... సేవకుడు

ఎస్. శ్రీనివాస ప్రసాద్ రావ్

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070