Saturday, November 7, 2009

ఉపనిషత్తులు ?

ఉపనిషత్తులు అనగా ఏమిటి?

వేదాంతము అని మనము పిలుచుకొనేదే ఉపనిషత్తులు. ఇవి వేదాలకు చివరిగా ఉండడంవలన వీటిని వేదాంతముఅంటారు.శ్రీ భగవద్గీత కు మూలాలు ఉపనిషత్తులే. వేదాలలో ఎక్కువ భాగం కర్మకాండకు (అనగాయజ్ఞయాగాలు,పూజలు మొదలగునవి) ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వగా ఉపనిషత్తులలో జ్ఞానమునకే ప్రాముఖ్యతనుఇచ్చి కర్మకాండను పట్టించుకొనలేదు. "ఉపనిషత్" అను పదానికి అర్థం సమీపములో ఉండడం. సత్యాలను గురువుదగ్గర తెలుసుకోవడం లేక ఆత్మ(పరమాత్మ) కు సమీపములో ఉండడం అని అర్థం. ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. అందులో 108 ఉపనిషత్తులు మనకు తెలుసు. ఈ 108 లో 10 ఉపనిషత్తులకు ఆదిశంకరాచార్యులు భాష్యం వ్రాసారు. వీటినే దశోపనిషత్తులు అంటారు.

ఈ దశోపనిషత్తులు ఏమిటనేవి క్రింది శ్లోకం వివరిస్తుంది.

"ఈశ కేన కఠ ముండ మాండూక్య ప్రశ్న తిత్తిరి
ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ"

అవి
1.ఈశావాస్య ఉపనిషత్తు
2. కేనోపనిషత్తు
3. కఠ ఉపనిషత్తు
4.ప్రశ్నోపనిషత్తు
5. ముండకోపనిషత్తు
6. మాండూక్య ఉపనిషత్తు
7. తైత్తిరీయ ఉపనిషత్తు
8. ఐతరేయ ఉపనిషత్తు
9.ఛాందోగ్య ఉపనిషత్తు
10. బృహదారణ్యక ఉపనిషత్తు

ఈ బ్లాగులో వీటిని గురించి వివరించాలనేది నా ప్రయత్నం. అంటే ఇక్కడ నేను సొంతముగా వ్రాసేది ఏమీ ఉండదు. మాహాత్ముల వాణినే నేను వ్రాస్తాను. కాని నేను అర్థం చేసుకొన్నది కూడా ప్రతి టపా చివర వ్రాస్తాను.

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070