Wednesday, August 26, 2009

మథర్ థెరీసా జననం

మథర్ థెరీసా

మథర్ థెరీసా (1988)
జననం ఆగష్టు 26 1910(1910-08-26)
స్కోప్జే, ఓట్టోమాన్ సామ్రాజ్యం (ప్రస్తుత మాసిడోనియా)
మరణం సెప్టెంబర్ 5 1997 (వయసు: 87)
కోల్కతా, భారతదేశం
వృత్తి రోమన్ కాథలిక్ సన్యాసిని, మానవతావాది[1]

మదర్ థెరీసాగా పేరు పొందిన ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు (ఆగష్టు 26, 1910సెప్టెంబరు 5, 1997) మాసిడోనియాలో అల్బేనియన్ సంతతికి చెందిన కుటుంబంలో జన్మించింది.[2]. ఈమె తన జీవితాన్ని పేద రోగులకు సేవచేయడంలోనే గడిపింది. ఈమె సేవకు గుర్తింపుగా 1979 లో ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారము లభించింది. ఈమెకు తరవాత భారతదేశ ప్రభుత్వం కూడా 1980లో భారతరత్నను ప్రకటించింది.

బాల్యం

మదర్ థెరీసా జన్మించిన స్థలం

నికోలా మరియు డ్రేన్ బొజాక్షువు దంపతులకు పుట్టిన ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు వారి చివరి సంతానము. రాజకీయాల్లో నిమగ్నమై ఉండే నికోలా ఒక రాజకీయ సమావేశం తర్వాత వచ్చి వ్యాధికి గురై మరణించాడు. ఆ సమయంలో ఆగ్నీస్‌కు 8 సంవత్సరాలు.[2] ఆయన మరణం తర్వాత ఆగ్నీస్ రోమన్ కాథలిక్ గా పెరిగింది. జోన్ గ్రాఫ్ క్లూకాస్ బయాగ్రఫి ప్రకారం ఆగ్నీస్ మిషనరీస్పై ఆ వయసులోనే ఇష్టం పెంచుకొన్నది. 12 సంవత్సరాల వయసులోనే మిషనరీస్ లో చేరాలని నిర్ణయించుకున్నది.[3] తర్వాత ఆమె 18 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి సిస్టర్స్ ఆఫ్ లోరెటొలో మిషనరీగా భర్తీ అయ్యింది. ఆ తర్వాత ఎన్నడూ ఆగ్నీస్ తన కుటుంబసభ్యులను చూడనేలేదు.[4]

ముందుగా ఆగ్నీస్ ఐర్లాండ్ దేశంలోని రాత్‌ఫార్న్‌హామ్ లో ఉన్నలోరెటో అబ్బేలో ఆంగ్లభాష నేర్చుకోవడానికి పంపించబడింది.[5] 1929 లో భారతదేశానికి వచ్చిన తర్వాత హిమాలయాల దగ్గరలో ఉన్న డార్జీలింగ్‌లో తన మిషనరీ జీవితాన్ని ప్రారంభించారు.[6] 24 మే 1931 నాడు ఆవిడ తన సన్యాస జీవితాన్ని ప్రారంభించినది. ఆ సమయములో ఆవిడ తన పేరును థెరీసా గా మార్చుకున్నారు.[7] 14 మే 1937 నాడు ఆవిడ పూర్తిస్థాయి సన్యాసినిగా మారిపోయారు. ఈ సమయంలో ఈమె తూర్పు కలకత్తాలోని 'లోరెటొ కాన్వెంట్ స్కూల్'లో ఉపాధ్యాయినిగా పనిచేసేవారు.[8][9] థెరీసా ఉపాధ్యాయవృత్తితో సంతోషాన్ని పొందినా ఆవిడ చుట్టుప్రక్కల ప్రబలి ఉన్న పేదరికాన్ని చూసి చలించిపోయేవారు.[10] 1943 లో కలకత్తాలో వచ్చిన కరువు వల్ల చాలా మంది మరణించారు. కలకత్తాలో హిందూ ముస్లింల తగాదాల వల్ల ఆగష్టు 1946లో భయాందోళనలు ప్రబలిపోయాయి.[11]

ఆరోగ్యం మరియు మరణం

మదర్ థెరీసా మొట్టమొదటిసారిగా 1983లో గుండెపోటుతో బాధపడ్డారు. ఆ సమయంలో ఆవిడ రోమ్ నగరంలో, పోప్ జాన్ పాల్ II ని కలవడానికి వెళ్ళారు. రెండవసారి 1989లో గుండెపోటు రాగా ఆవిడకు శస్త్రచికిత్స ద్వారా పేస్‌మేకర్ ను అమర్చారు. 1991లో మెక్సికోలో ఉండగా నిమోనియాతో బాధపడ్డారు, తరవాత మళ్ళీ హృదయసంబంద వ్యాధులతో బాధపడ్డారు. ఆరోగ్యపరిస్థితులు అనుకూలంగా లేనందున ఆవిడకు మిషనరీస్ ఆఫ్ చారిటి ముఖ్యపదవి నుండి విశ్రామం కోసం ప్రతిపాదించగా, మిగతా సన్యాసినులు (నన్‌లు) ఆమె ఆ పదవిలోనే కొనసాగాలని కోరుకున్నారు. అందువలన ఆవిడ ఆ పదవిలో తరవాత కూడా కొనసాగారు.

మూలాలు

  1. PBS Online Newshour (Sept. 5, 1997).Mother Teresa Dies, www.pbs.org. Retrieved August, 2007
  2. 2.0 2.1 2002). "Mother Teresa of Calcutta (1910-1997)". Vatican News Service
  3. Clucas, Joan Graff. (1988). Mother Teresa. New York. Chelsea House Publications, pp. 24. ISBN 1-55546-855-1.
  4. Sharn, Lori (September 5, 1997). "Mother Teresa dies at 87". USA Today. Retrieved May 30, 2007
  5. Clucas, Joan Graff. (1988). Mother Teresa. New York. Chelsea House Publications, pp. 28-29. ISBN 1-55546-855-1.
  6. Clucas, Joan Graff. (1988). Mother Teresa. New York. Chelsea House Publications, pp. 31. ISBN 1-55546-855-1.
  7. Sebba, Anne (1997).Mother Teresa: Beyond the Image. New York. Doubleday, p.35. ISBN 0-385-48952-8.
  8. Clucas, Joan Graff. (1988). Mother Teresa. New York. Chelsea House Publications, pp. 32. ISBN 1-55546-855-1.
  9. Spink, Kathryn (1997). Mother Teresa: A Complete Authorized Biography. New York. HarperCollins, pp.16. ISBN 0-06-250825-3.
  10. Spink, Kathryn (1997). Mother Teresa: A Complete Authorized Biography. New York. HarperCollins, pp.18-21. ISBN 0-06-250825-3.
  11. Spink, Kathryn (1997). Mother Teresa: A Complete Authorized Biography. New York. HarperCollins, pp.18, 21-22. ISBN 0-06-250825-3.

బయటి లింకులు

విమర్శలు

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070