Friday, February 12, 2010

చిరునవ్వులతో బ్రతకాలి

ఆత్మీయత కరువైనా అంధకారం ఎదురైనా
బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏమైనా

చిరునవ్వులతో బ్రతకాలి
చిరంజీవిగా బ్రతకాలి
ఆనందాలను అన్వేషిస్తూ
అందరికోసం బ్రతకాలి
అందరినీ బ్రతికించాలి

బ్రతుకే నీకు బరువైతే ఆ భారం
బరువేదైన గురితో ఓ నలుగురితో పంచుకో
కలతే లేని జీవితమంటే విలువే లేదులే
అలుపే లేక ఎ గేలుపు అవలీలగా రాదులే
నింగినంటు ఎవేర్స్ట్ ఐనా నేల నుండి మొదలవతుంది
నమ్ముకోకు అదృష్టని ..నమ్ముకో ధైర్యాన్ని
మెరుపులే పిడుగులై ఉరుముతున్నా
ఉరకలు వేసే కిరణం జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి
చిరుదివ్వెలుగా వెలగాలి
లోకం నిండిన సోకం తుడిచే
వేకువలా ఉదయించాలి
వెన్నెలలే కురిపించాలి

ఎదిగే పక్షి రెక్కకు సహజం ఎగిరే లక్షణం
వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం
ఎది నీది కాదు అనుకో ఎదో నాటికి
ఆయిన రేపు మిగిలే ఉంది ఆశావాదికి
కొమ్మలన్ని చుక్కలవైపే కోరి కోరి చూస్తూ ఉన్న
మట్టితోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా
చీడలే నీడలై వీడకున్న
అందరి బౄందావనమే జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి
శ్రీకరంలా బ్రతకాలి
గతమంతా కనుమరుగవుతున్నా
నిన్నటి స్వప్నం నిలవాలి
నీ సంకల్పం గెలవాలి

ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి
ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి
ఆశే నీ లక్ష్యం చెరే ఆస్త్రం మిత్రమా
ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా
ఆశ వెంట ఆచరణ ఉంటే అద్భుతాలు నీ సొంతం
ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం
నిప్పులే గుండెలో నిండుతున్నా
ఉప్పొంగే జలపాతం జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి
చిగురాశలతో బ్రతకాలి
అంతిమ విజయం అనివార్యమని
ఆశిస్తూ నువ్వు బ్రతకాలి
ఆశయాన్ని బ్రతికించాలి

నీడె నిన్ను భయపెడితే ఆ నేరం వెలుగుదా
నలుసే నిన్ను భాధపెడితే ఆ దోషం కంటిదా
నేస్తం చూడు జీవితం అంటే నిత్యం సమరమే
సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే
పారిపోకు ఎ ఓటమికి ప్రపంచాన్ని విడిచి
జారిపోకు పాతాళనికి బ్రతుకుబాట మరచి
వరదలా మౄత్యువే తరుముతున్నా
ఆరని అగ్నిజ్వాలే జీవితం

చిరునవులతో బ్రతకాలి
శిఖరంలా పైకి ఎదగాలి
చావుకు చూపే ఆ తెగింపుతో
జీవించాలనుకోవాలి
నువ్వు జీవించే తీరాలి

విజయం తలుపు తెరిచేవరకు విసుగే చెందకు
విసుగే చెంది నిస్పౄహతో నీ వెనుకే చూడకు
చిందే చమట చుక్కకు సైతం ఉంది ఫలితమే
అది అందే వరకు సహనంతో సాగాలి పయనమే
అంతరాత్మ గొంతే నులిమి శాంతి కొరుకుంటవా
అల్లుకున్న అనుబంధాలే తలడిలిపోవా
అలజడే నిలువునా అలుముకున్నా
అలుపెరుగుని చైతన్యం జీవితం 
 

చిరునవ్వుతో


 ప్రతి రోజుని ప్రభవించని చిరునవ్వుతో చిరునవ్వుతో
ప్రతి ఉహని బ్రతికించుకో చిరునవ్వుతో చిరునవ్వుతో

ప్రతి మనిషిని పరికించారా చిరునవ్వుతో చిరునవ్వుతో
ప్రతి రాత్రిని పవలించని చిరునవ్వుతో చిరునవ్వుతో

రు రు రూ రు రు...

ప్రతి రోజు ప్రారంభించు చిరునవ్వుతో
ప్రతి రోజు గడుపు చిరునవ్వుతో
ప్రతి రోజు ముగించు చిరునవ్వుతో ....

గతమనది గతమేనురా
వ్యధ చెందకు విలపించకు
విధి రాతలో కష్టాలకు కడ ఏదిరా దుఖించకు

తలరాతనే ఎదిరించారా చిరునవ్వుతో చిరునవ్వుతో
మున్ముముందుకే అడుగేయరా చిరునవ్వుతో చిరునవ్వుతో

Quote for the day/మంచి మాట



మనకు ఏమి హక్కు ఉందని నిర్దేశించడానికి ? 

 
ఏ ప్రాణియొక్క జీవన రీతులు దానివి !
ఏ ప్రాణియొక్క ఇష్టాఇష్టాలు దానివి!
ఏ ప్రాణియొక్క ధర్మాధర్మాలు దానివి!
ప్రతి ప్రాణి కూడా సర్వ స్వతంత్రమైనది!!

మనకు ఏమి హక్కు ఉందని "అది ఆ విధంగా వుండాలి - ఈ విధంగా వుండాలి" నిర్దేశించడానికి ?

ప్రతి ప్రాణి పట్ల సరైన సదవగాహనను కలిగి వుండాలి, ఆ ప్రాణి యొక్క సర్వ స్వాతంత్రతను దానికి ఇచ్చి, ఆ యొక్క సర్వ స్వాతంత్రత పట్ల సహ్రుదయతను, మైత్రిభావాన్నికలిగివుండాలి - - పత్రిజి

ఉపవాసము

నా భావనలో "ఉపవాసము" అంటే  ఏదో  బరువు  తగ్గడం  కోసమో  లేక  సంప్రదయమనో  చెయ్యడం  కాదు …ఉప --వాసము  అంటే దగ్గరగా  నివసించందం ..అంటే
1.
ఆ  రోజు  మొత్తం  దేవునికి  మరింత  సన్నిహితంగా , దగ్గరగా  ఉండడం, మంచి  ఆలోచనలతో, ఏ విధమైన   అనవసరపు  వ్యర్ధ  ప్రలోభాలకు లోను  కాకుండ,  ఒక  దాని  మీద  ద్రుష్టి  కేంద్రీకరించడము ....
2. లంకణం  పరమౌషధం కాబట్టి ...మన  జీర్నశాయానికి  కొంచెం  విశ్రాంతి  ఇవ్వడం ద్వారా అది మరింత  చక్కగా పనిచేయడానికి దోహదపడం..
3. అన్నిటికంటే   ముఖ్యమైనది ...ఇలా  ఏదో  ఒక  నమ్మకంతోనో, బయంతోనో, సాకుతోను మన  ఇంద్రియాలపై కాసేపైనా పట్టు  సాదించడం. నిగ్రహం కలిగిఉండడం, అదుపులో పెట్టుకోవడం  ...అంటే  మన  తుఛ్మైఅన  కోర్కెలను  కళ్ళెం  వేసి  పట్టుకోవడం  అన్నమాట ....

ఇలా అప్పుడప్పుడు చెయ్యడం వల్లనైనా మనం మన ఇంద్రియ నిగ్రహం పై విజయం సాధించే దిశగా అడుగులు వెయ్యడం ... మీ "అమ్మ" శ్రీనివాస్ 

Thursday, February 11, 2010

ఓ అమ్మ కథ…

మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది. మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది. ఇంక అప్పట్నించి చూడండి. ”మీ అమ్మ ఒంటి కన్నుది” అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు.

అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది. ఒక్కోసారి నాకు.అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు.

“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను. నువ్వు చచ్చిపో!” కోపంగా అరిచేసే వాణ్ణి. ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు. నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది. ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు.

ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది. నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు. నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను.

ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను.
ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను. పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను. మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను. బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కొనుక్కున్నాను. మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!

అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి. ఇంకెవరు? మా అమ్మ. ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతో జడుసుకుంది. “ఎవరు నువ్వు? ఎందుకొచ్చావిక్కడికి? నువ్వెవరో నాకు తెలియదు. నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?ముందు నువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!” సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను.

“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను” ఆమె అదృశ్యమైపోయింది. “హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”. భారంగా ఊపిరి పీల్చుకున్నాను. ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించుకోనవసరం లేదు అనుకున్నాను.

కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు. వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను. స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను. ఎంత వద్దకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి. మా అమ్మ ఒంటరిగా కటిక నేలపై పడి ఉంది. ఆమె చేతిలో ఒక లేఖ. నా కోసమే రాసిపెట్టి ఉంది. దాని సారాంశం.
ప్రియమైన కుమారునికి,

ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను. నేనింక నీవుండే దగ్గరికి రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా! ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకున్నాను. కన్నపేగురా. తట్టుకోలేక పోతోంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగాలు లేవు. కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే. వస్తే నీకు మళ్ళీ అవమానం చేసినదాన్నవుతాను. ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు. చిన్నా! నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా! అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను. నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధపడలేదు. ఒక్క రెండు సార్లు మాత్రం ” వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనా కదా!” అని సరిపెట్టుకున్నాను. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు.

ఉత్తరం తడిసి ముద్దయింది. నాకు ప్రపంచం కనిపించడం లేదు.నవనాడులూ కుంగిపోయాయి. భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను. తన జీవితమంతా నాకోసం ధారబోసిన మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి? ఎన్ని జన్మలెత్తి ఆమె ఋణం తీర్చుకోను?

PS:ఒక వెబ్‌సైటులో నేను చదివిన ఆంగ్లకథకు స్వేచ్చానువాదం.
Disclaimer: ఇది నా జీవిత కథ కాదు. దయచేసి నాపై ఎవరూ కోపగించుకోవద్దు

అలెగ్జాండర్ మూడు కోరికలు

అలెగ్జాండర్ మూడు కోరికలు

alexander-l అలెగ్జాండర్ చాలా రాజ్యాలను జయించిన తర్వాత ఇంటికి తిరిగి వెళుతున్నాడు. మార్గమధ్యంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణ శయ్యపై చేరాడు. తాను మరణించడం తథ్యమని అలెగ్జాండర్ కు అవగతమైపోయింది.తాను సాధించిన గొప్ప గొప్ప విజయాలు, అమిత శక్తిశాలురైన  సైన్యం, అంతులేని సంపద తన్ను మరణం నుంచి దూరం చేయలేవని స్పష్టమైపోయింది.
ఇంటికి వెళ్ళాలనే కోరిక తీవ్రతరమైంది. తన తల్లికి కడసారిగా తన ముఖాన్ని చూపించి కన్ను మూయాలనే ఆశ. కానీ సమయం గడిసే కొద్దీ దిగజారుతున్న అతని ఆరోగ్యం అందుకు సహకరించడం లేదు. నిస్సహాయంగా ఆఖరి శ్వాస కోసం ఎదురు చూస్తున్నాడు. తన సైన్యాధికారులను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు.
“నేనింక కొద్దిసేపట్లో ఈ లోకం నుంచి నిష్క్రమించబోతున్నాను. నాకు చివరగా మూడు కోరికలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నెరవేర్చకుండా విస్మరించకండి.” అని వారి నుండి వాగ్ధానం తీసుకున్నాడు.
అశ్రు నయనాలతో కడసారిగా తమ రాజు గారి ఆజ్ఞను వినమ్రంగా అంగీకరించారు ఆ అధికారులు.
నా మొదటి కోరిక:  ” నా శవ పేటికను కేవలం నా వైద్యులు మాత్రమే మోయాలి”
రెండవ కోరిక: “నా పార్థివ దేహం  స్మశానానికి వెళ్ళే దారిలో నేను సంపాదించిన విలువైన వజ్రాలు, మణి మాణిక్యాలు పరచండి”
మూడవ కోరిక: “శవపేటిక లో నుంచి నా ఖాళీ చేతులు బయటికి కనిపించే విధంగా ఉంచండి”
చుట్టూ మూగి ఉన్న సైనికులు ఆయన విచిత్రమైన కోరికలు విని ఆశ్చర్యపోయారు.కానీ వారిలో ఎవ్వరికీ ఆయన్ను అడిగే ధైర్యం లేకపోయింది. అలెగ్జాండర్ కు అత్యంత ప్రీతి పాత్రుడైన ఒక సైనికుడు దగ్గరగా  వచ్చి, ఆయన చేతులను ముద్దాడి, ఆయన కోరికలను తప్పక నెరవేరుస్తామని మాట ఇచ్చాడు. ఈ కోరికల వెనక ఆంతర్యమేమిటో సెలవియ్యమని అడిగాడు.
అలెగ్జాండర్ అతి కష్టమ్మీద ఇలా అన్నాడు. “ఈ మూడు కోరికలు నేనిప్పుడే నేర్చుకున్న మూడు పాఠాలకు ప్రతిరూపాలు.”
“మొదటి కోరికలో నా ఆంతర్యం, నిజానికి ఏ వైద్యుడూ మరణాన్ని ఆపలేడు . ఒకవేళ  వైద్యం చేసినా వల్లకాటి వరకే.” అని చెప్పడానికి.
“రెండవ కోరికలో నా ఆంతర్యం, నా జీవితంలో సింహ భాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది.అదేదీ నా వెంట తీసుకెళ్ళలేక పోతున్నాననీ, కేవలం సిరిసంపదల వెంటబడి విలువైన సమయాన్ని, జీవితంలో మాధుర్యం కోల్పోవద్దని చెప్పడానికి”
“మూడవ కోరికలో నా ఆంతర్యం ఈ ప్రపంచంలోకి నేను వచ్చేటపుడు వట్టి చేతులతో వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే ”
అని చెప్పి కన్ను మూశాడు.
అలెగ్జాండర్ రాజ్యకాంక్ష గల చక్రవర్తే కావచ్చు. కానీ ఆయన గురించిన ఈ సంఘటనలో భారతీయ ఆత్మ ఉంది. ఆధ్యాత్మిక సారం ఉంది. అందుకనే ఈ సంఘటన అంటే నాకు ఎంతో ఇష్టం.
అందరికి ఎక్కువ అసక్తి కలిగించేవి.......ప్రేమ... దేవుడు... జీవితం.

So naa gurinchi kakundaa veeti gurinchi naa feelings rastunnanu...so that meeru naa gurinchi ardham cheskovachu.

-----------------------------------
 
గెలుపు : తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే..గెలుపంటే!!

జీవితం......
సీతారాములు పడ్డాన్ని కష్టాలు ఎవరన్నా పడ్డారా! పాపం రాముడు ఎప్పుడన్నా రాజ్యసుఖాలు అనుభవించాడా!
అసలు సీతమ్మోరికొచినన్ని కష్టాలు ఏదేవతకైనా వచ్చినయ్యా! మరి వాళ్ళని మన కష్టాలు తీర్చమని అడుక్కోవటం ఏంటి!
ఏంటంటే రాములోరి కధ మనకి ఏం చెప్తోందంటే కష్టాలు రాకూడదు అన్ని సుఖాలే ఉండాలి అని కాదు... ఎన్ని కష్టాలొచ్చినా మనకొక తోడుండాలి ..
రాముడికి సీతలా..సీతకి రాముడిలా ..ఆ కష్టాల్ని ఆనందంగా ఎదుర్కోవాలని ,ఎదుర్కొని ఆదర్సవంతమైన జీవితం గడపాలని
ఇట్లు captain శ్రీనివాసమౌళి ...బెంగుళూరు.
(శేఖర్ కమ్మల)

ఫ్రేమ అంటే :
కన్నుల ఒడిలో ..కలలనుచేర్చే కనుపాపరా ప్రేమంటే
మనసుల బడిలో మమతలు చదివే పసి పాపరా ప్రేమంటే
నవ్వుల చినుకులు చిలికే మేఘం ప్రేమంటే..
పువ్వులు పంచే ప్రేమసుగంధం ప్రేమంటే..
మనిషిని నడిపేది ప్రేమంటే..
అనిపిస్తుంది అది తోడుంటే!
(శ్రీనివాసమౌళి)

గాలికి గంధము పూయడమే ..పువ్వుకు తెలిసిన ప్రేమ సుధ..
రాలిన పూవుల జ్ఞాపకమే కాలం చదివే ప్రేమ కధ...

ఎగిరిపోయింది...సీతాకోక చిలుక...
కానీ మిగిలిపోయింది వేళ్ళపై అది వాలిన మరక
(వేటూరి)

స్పర్శానుభూతి గొప్పదే కాదనను..
అది మానసికమైతే మరీ గొప్పది ఎంతో వెచ్చనైనది
కాదనగలవా!
(నచకి)

Attitude towards life:
సాధించే సత్తా ఉంటే సమరం ఒక సయ్యాటా !!!
తలవంచుకు రావలసిందే ప్రతి విజయం నీ వెంటా !!!
(సిరివెన్నెల)

స్వర్గమే సొంతమౌతుందిరా! అంత పదునైందిరా ఈడనే ఆయుధం
స్వప్నమై చెరిగిపోనీకురా..కరిగిపోనీకురా ..నేడు నీ యవ్వనం
నడవాలంటే ..నడపాలంటే..నిలబడి చూడకురా..
(సిరివెన్నెల)

బొమ్మనే చేశాడు ప్రాణమే పోశాడు...
సిరులిచ్చి దీవించి చింతలే తీర్చాడు
ఉన్ననాడే మేలుకుని ఉట్టికెక్కమన్నాడు..
ఊపిరాగిపోయిందా...మట్టిపాలే వీడు..
మేలుకోవే ఓ! మనసా.....మేలుకోవే ...ఓ! మనసా
(వనమాలి)

ఎవ్వరి వెనకనో నీడగ నిలబడి పడుండాలా మనం ...
యవ్వన తరుణము రవ్వలు చిలికితే తలొంచాలీ జగం...
బతుకు బళ్ళో చదువంటే ..వరద ఒళ్ళో ఎదురీతే....
(సిరివెన్నెల)

కష్టాలతో సావాసమా! చెప్పు నావల్ల ఇకకాదని....
కన్నీళ్ళపై కనికారమా! చెప్పు నావైపుకే రాకని...
నవ్వుతుండే మనుష్షులుంటే నవ్వు పంచే మనస్సులుంటే..
లోకమంతా ప్రేమలోన తూలి...సోలి..
తేలిపోదాం ప్రేమ వీధుల్లో..సోలిపోదాం ప్రేమ లోతుల్లో
(శ్రీనివాసమౌళి)

మనిషి అశను నిరోధిస్తే....ప్రేమను నిషేధిస్తే...దేవుడు...శాడిస్టే.....
(నచకి)

నొప్పి లేని నిముషమేది..జనమైనా..మరణమైనా..
జీవితాన అడుగు అగుగునా..
నీరసించి నిలిచిపోతే..నిముషమైనా నీది కాదు...
బ్రతుకు అంటే..నిత్య ఘర్షణ.
ఊపిరుంది ఆయువుంది నెత్తురుంది..సత్తువుంది...
ఇంతకన్న సైన్యముండునా
(గురువు గారు-- సిరివెన్నెల)


Never Believe wt the lines of ur hand predict abt ur future,
caz people who d'nt hve hands also hv a future... Believe in urself

"Sometimes love is for a moment, sometimes love is for a lifetime.
Sometimes a moment is a lifetime."

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070