Wednesday, October 28, 2009

అమ్మ

మదర్స్ డే రోజు తప్పితే అమ్మ విలువ ఇంకెప్పుడు గుర్తురాదు కాబోలు వీళ్ళకు. ఇదంతా మార్కెటింగ్ మహిమ. సృష్టిలో మానవుడికే కాదు ప్రతి ప్రాణికి అమ్మ వుంది. ఎవరికైనా అమ్మ అమ్మే. ప్రతి అమ్మ తన బిడ్డని ఒక వయసు వచ్చేవరకు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అది ప్రకృతి సహజం కూడా! ఎవరి మన్ననల కోసమో, బిరుదుల కోసమో, మెప్పుల మేకతోళ్ళ కోసమో అమ్మ తన పిల్లలిని లాలించదు పాలించదు. అది తన ధర్మంగా చేస్తుంది. కాకి పిల్ల కాకికి ముద్దయినట్లు బిడ్డ అవిటిదైనా, కురూపి అయినా తల్లికి ముద్దే. ఎన్ని కష్టాలు పడి అయినా బిడ్డ బ్రతకదని తెలిసినా చివరి నిమిషం వరకు బిడ్డ గురించి తపించే తల్లులెందరో. ఏమి ఆశించి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు? అలాంటి అమ్మని ఈ ఒక్క రోజే గుర్తు చేసుకోవటం అంత ఆత్మవంచన ఇంకొకటి వుండదేమో.

అమ్మని ఏ అనాధాశ్రమంలోనో పడేసి ఏడాదికొకసారి ఒక గ్రీటింగ్ ముక్కో, ఓ కేకు ముక్కో పడేస్తే సరిపోతుందనుకునేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇదా మనకు మన చదువులు నేర్పిన సంస్కారం!! ఇదా మనకు మన సంపదలు తెచ్చిన వైభోగం!!!

అమ్మ కోరేది ఈ ఒక్క రోజు ఆర్భాటపు వేడుకలని, బహుమతులిని, ప్రశంసలిని కాదు. రోజూ ఆప్యాయంగా అమ్మా అన్న ఒక పిలుపుని, ముదిమిలో లాలనని పాలనని, నీకు నేనున్నాను నీ జీవితమంతా తోడుంటాను అన్న ఒక భరోసాని . అంతకన్న మననుండి ఆమె ఏ పట్టుపీతాంబరాలని, కాంచన మణిమాణిక్యాదులని ఆశించదు.

అమ్మ గురించి ఎప్పుడో ఎక్కడో చదివిన రెండు వ్యాక్యాలు....

అమ్మ.....

ఆకలివేళ అక్షయ పాత్ర
ఆపద వేళ ధైర్యం మాత్ర.

ఈ రోజుమదర్స్ డే ని ఘనంగా ఆర్భాటంగా జరుపుకోవాలి అని నొక్కి వక్కాణిస్తుంది. ఇలా వక్కాణించేవాళ్ళు ఎంతమంది తమ అమ్మలిని అత్తలిని ప్రేమగా చూసుకుంటున్నారంటారు?

ఇదా పరిష్కారం

"వరంగల్‌లో ఇద్దరు కాలేజి విద్యార్ధినుల మీద యాసిడ్ దాడికి పాల్పడ్డ వాళ్లని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపేసారు".

సమస్యకి ఇదే పరిష్కారమా? ఇదే అంతిమ తీర్పా?.

"
నిందితులు నేరప్రవృత్తి కలిగినవారని, పథకం ప్రకారమే వారు అమ్మాయిలపై అమానుషంగా యాసిడ్‌ దాడి చేశారని వరంగల్‌ ఎస్పీ సజ్జనార్‌ అన్నారు". వారు నేరప్రవృత్తి కలిగినవారని ముందే తెలిసినప్పుడు మరియు స్వప్నిక తండ్రి నిందితుడి మీద రిపోర్టు ఇచ్చినప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదు, అరెస్టు చేసినవాడిని ఎందుకు వదిలేసినట్లు, తను నేరప్రవృత్తి కలిగినవాడని తెలిసి కూడా వదిలేసాక తన మీద నిఘా ఎందుకు ఏర్పాటు చేయలేదు. ఎన్‌కౌంటరే ఇలాంటివాటికి పరిష్కారమా? నేరం జరిగాక చట్టం తన పని తాను చేయటం కాదు, ముందుగా ఆ నేరం జరగకుండా చేయటం చట్టం విధి. స్వప్నిక పరిస్థితి విషమంగా ఉంది మరి ఆ అమ్మాయికి ఏమైనా అయితే దానికి ఎవరు బాధ్యులు?

యాసిడ్‌తో దాడి అమానుషమే, ఇలాంటి వాటికి కఠిన శిక్షలు పడాల్సిందే. కాని తప్పంతా నిందితుడిదే లాగా కూడా కనిపించటం లేదు. నిందితుడు ఆ అమ్మాయి మీద 25,000 రూపాయల వరకు ఖర్చు చేసాడట, మరి ముందుగా ఆ అమ్మాయి ఇలాంటివి వద్దని ఎందుకు వారించలేదు, తనని ఎందుకు ప్రోత్సహించినట్లు? ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి నా మీద ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నాడా అని అమ్మాయిలు ఆలోచించాలి, తల్లిదండ్రులూ ఆలోచించాలి, ఆదిలోనే ఇలాంటి స్నేహాల్ని తెంపివేయాలి.

ఎవరూ పుట్టుకతో నేరస్థులుగా పుట్టరు. పెంపకం, పరిసరాలు, అనుభవాలు వారిని నేరస్థులుగా మారుస్తాయి. అలాంటి వారిని ఎన్‌కౌంటర్‌లో చంపటం మాత్రం సరైన పరిష్కారం కాదు. నేరం చేయటానికి ముందే భయపడేట్టు శిక్షలు ఉండాలి. ఎవరైనా అమ్మాయిల వెంట పడటం, వేధించటం లాంటివి చేస్తున్నప్పుడు హెచ్చరికలతో వదిలివేయకుండా కఠిన శిక్షలు పడేలా చూడాలి. వాళ్లు ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా మొదటిసారే గదా అని హెచ్చరికలతో వదిలివేయకుండా ప్రారంభంలోనే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి, వారికి సరైన కౌన్సిలింగు ఇప్పించి వారి ప్రవర్తన మార్చుకునేట్లు చేయాలి. అమ్మాయిల వంక కన్నెత్తి చూడటానికి కూడా భయపడే విధంగా చట్టాలు కఠినంగా అమలు చేయాలి, అవసరమైతే అందుకు అనుగుణంగా చట్టాల్ని మార్చాలి.

ఆడపిల్లలు కూడా తమ పరిధుల్లో తాము ఉండాలి. ఎవరితో పడితే వారితో సినిమాలు షికార్లు తిరగటం, కాలేజిలు ఎగ్గొట్టి తిరగటం లాంటివి ఎప్పటికైనా వారికే ప్రమాదం. స్నేహానికి, వ్యామోహానికి తేడా తెలుసుకుని మెలగాలి. ఇది ఇప్పటి సమస్య కాదు. ఇలాంటివి జరిగినప్పుడే మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు మేలుకుంటాయి తప్ప ఇలాంటివి జరగకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరు ఎందుకని?. కాలేజిలలో ఇలాంటి వాటిపై చక్కటి సెమినార్లు, ఇతర కార్యక్రమాలు చేపట్టి పిల్లలలో అవగాహన, పరివర్తన తీసుకురావాలి. ప్రవర్తనా సమస్యలు ఉన్న పిల్లలకి వర్క్‌షాపులు పెట్టి వాళ్లలో మార్పు తిసుకురావటానికి ప్రయత్నించాలి అంతే కాని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రోడ్లెక్కి అరవటం కాదు మనకి కావల్సింది.

ఈ సమస్య ఏ ఒక్కరిదో కాదు. దీనికి పరిష్కారం కూడా ఏ ఒక్కరి చేతుల్లోనో లేదు. ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. ఎక్కడైనా ఎవరైనా ఏ ఆడపిల్లనైనా వేధిస్తున్నట్లు మీ దృష్టికి వస్తే చాతనైన సహాయం చేయండి, నాకెందుకులే అని పక్కకు తప్పుకు వెళ్లకండి, రేపు మన పిల్లలే ఆ పరిస్థితిలో వుండవచ్చు.

తెలుగులో మహిళా బ్లాగుల ప్రస్థానం

తెలుగులో మహిళా బ్లాగుల ప్రస్థానం

మనసు భావాలని పంచుకోవటానికి బ్లాగు ఓ చక్కని వేదిక, ఇది మహిళల విషయంలో మరింత నిజం కూడా. ఇప్పుడు తెలుగు బ్లాగుల్లో మహిళల బ్లాగులు ఓ విశిష్ట స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. కథలు, కవితలు, సమీక్షలు, పుస్తకాలు, సినిమాలు, పాటలు, గేయాలు, రాజకీయాలు, అంతరంగాలు, స్వగతాలు, చలోక్తులు, విశ్లేషణలు, విమర్శలు, ముగ్గులు, వంటలు, కొండకచో ముఖాముఖీలు----ఒక్కటేమిటి..... పొడుపు కథలనుండి......అన్నమయ్య పదాల వరకు బ్లాగుల్లో మహిళలు స్పృశించని అంశం లేదు, అందరి గురించి అన్నిటి గురించి వ్రాసేస్తున్నారు.

తెలుగులో మహిళా బ్లాగులు 2005 లో మొదలయ్యాయి. మొదటగా వచ్చింది ఇందు భార్గవి ది అని చెప్పవచ్చు. ఈమెను ఆది బ్లాగరిత అనవచ్చేమో. ఇందు భార్గవి ఇంగ్లీషులో 2004లోనే మొదలుపెట్టినా తెలుగులో 2005 ఏప్రియల్‌లో వ్రాయటం మొదలుపెట్టారు. తను తెలుగులో వ్రాసింది చాలా తక్కువే, ఇప్పుడు పూర్తిగా ఇంగ్లీషులోనే వ్రాస్తున్నట్లున్నారు. తరువాత అభిసారిక . అభిసారిక కూడా మధ్యలో చాలా రోజులు కనపడలేదు, మరల తాజాగా 2008 నవంబరు నుండి వ్రాయటం మొదలుపెట్టారు. ఈమె పాత టపాలయితే ఏవీ ఇప్పుడు లేవు. తరువాత శైలజ అంగర, స్వాతికుమారి, సౌమ్య, రాధిక, లలిత, అమూల్య లాంటి వాళ్లు మొదలుపెట్టారు. వీరిని తొలితరం తెలుగు మహిళా బ్లాగర్లగా చెప్పుకోవచ్చు. వీరిలో ప్రస్తుతం సౌమ్య, రాధిక మాత్రమే తరుచుగా వ్రాస్తున్నారు. శైలజ అంగర మొదలుపెట్టటం ఐదు బ్లాగులు మొదలుపెట్టినా ఎక్కువగా వ్రాయటం లేదు. లలిత గారయితే తన బ్లాగుని పూర్తిగా మూసివేసారు. తను ప్రస్తుతం తెలుగు పిల్లల కోసం ఓ వెబ్ సైటుని నడుపుతున్నారు. అమూల్య కూడా ప్రస్తుతం వ్రాయటం లేదు. స్వాతికుమారి గారు తన బ్లాగుకి కొద్ది రోజులు విరామమిచ్చినట్లున్నారు.

2007 వరకు కాస్త నత్త నడక నడిచిన మహిళా బ్లాగులు 2007....2008 వచ్చేటప్పటికి పరుగు అందుకున్నాయి. విభిన్న రంగాల నుండి వచ్చిన వారు--గృహిణులు, రచయిత్రులు, కవయిత్రులు, ఉద్యోగినులు, స్త్రీవాదులు, ఎందరెందరో బ్లాగులు మొదలుపెట్టారు.

నిడదవోలు మాలతి, స్వాతి శ్రీపాద, శ్రీవల్లీ రాధిక, రమ్య లాంటి రచయిత్రులు, సత్యవతి, కల్పన రెంటాల, కొండేపూడి నిర్మల లాంటి స్త్రీవాదులు బ్లాగులు మొదలుపెట్టిన వారిలో ఉన్నారు.

అందరిలోకి చెప్పుకోవలసింది ఒంటిచేత్తో అవలీలగా ఏడు బ్లాగులు వ్రాస్తున్న జ్యోతి గారినే. ఒక సామాన్య గృహిణి అసామాన్య బ్లాగరుగా మారి సాధించిన విజయం ఇది. తనని స్ఫూర్తిగా తీసుకుని బ్లాగులు మొదలుపెట్టిన వారు ఎందరో. తన ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే బ్లాగులు వ్రాయమని ప్రోత్సహించటమే కాదు, దానికి కావలసిన సాంకేతిక సహాయం కూడా అందిస్తుంటారు. ఎక్కడో పల్లెటూరు నుండి తమ భావాలని పంచుకుంటున్న మహిళా బ్లాగర్లు కూడా వున్నారు

కొన్ని మహిళా బ్లాగుల గురించిన పరిచయం కింది టపాలలో చూడవచ్చు.
http://vareesh.blogspot.com/2008/09/blog-post_10.html
http://vareesh.blogspot.com/2008/09/blog-post_21.html

తెలుగులో తొలి మహిళా బ్లాగుల గురించి వివరాలు అందించిన తాడేపల్లి గారికి, సి.బి.రావు గారికి ధన్యవాదాలు.

పాండవులున్న గుట్టలట.....ఎవరయినా చూసారా?

పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు, రాముడు వనవాసం చేసినప్పుడు ఎక్కడెక్కడ తిరిగారో చెప్పటానికి మన దేశంలో బోలెడు కథలు ప్రచారంలో ఉన్నాయి. వాళ్లు నిజంగా అక్కడ తిరిగారో లేదో తెలియదు కాని ఆ ప్రదేశాలు చూసినప్పుడు మాత్రం ఒక రకమయిన ఉద్వేగానికి లోనవుతాం. అనుకోకుండా అలాంటి ఓ కొండకి ఈ మధ్య వెళ్ళి వచ్చాం....అదే పాండవుల గుట్టలు (పాండవుల గుహలు, పాండవుల కొండలు....ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు). పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు అక్కడ ఉన్నారని కథ, దానికి ఆనవాళ్లుగా అక్కడ కొండల మీద దశరథుడు గీసాడని చెప్పే బొమ్మలు ఇంకొన్ని చారిత్రిక ఆధారాలు ఉన్నాయి.....ఇవన్నీ నిజమా కాదా అన్నది పక్కన పెడితే.....పచ్చని చేల మధ్య ఈ కొండలు మాత్రం నిజంగా ఓ అద్భుతం. నాకు బాగా నచ్చాయి. ఇవి వరంగల్లు జిల్లా రేగొండ మండలంలో ఉన్నాయి.

పోయిన వారాంతం వరంగల్లు జిల్లాలోని రామప్ప గుడి చూడటానికి వెళ్లి పనిలో పనిగా వీటిని కూడా చూసి వచ్చాం. రామప్ప గుడి నుండి 24 కి.మీ దూరంలో ఈ కొండలు ఉన్నాయి. రామప్ప నుండి ఘనపురం మీదుగా పరకాల రోడ్డులో భూపాలపల్లి క్రాసు రోడ్డు (కొత్తపల్లి) దాకా వెళ్ళాక ఎడమ వైపుకి తిరిగితే అక్కడి నుండి ఒక కి.మీ దూరంలో జూబ్లీనగర్--తిరుమల గిరి గ్రామాల మధ్య ఉన్నాయి ఈ కొండలు. ఈ కొండల్ని చూస్తే మెకన్నాస్ గోల్డు సినిమాలోని కొండలు గుర్తొస్తాయి (నేను చూసిన నాలుగయిదు ఇంగ్లీషు సినిమాలలో ఇది ఒకటి, అదీ బడాయి).

ఈ కొండలు ఓ 300-400 మీటర్ల ఎత్తు ఉండి ఉండవచ్చు. వీటిని పూర్తిగా చూడాలంటే ఓ రోజు పడుతుంది. ఎన్ని గుహలో.....ఎన్నెన్ని మలుపులో! అన్నీ ప్రకృతి విచిత్రాలే! కొండ పైకి నడవటానికి కొంతవరకు మెట్లు, సిమెంటు చేసిన దారి ఉన్నాయి. ఆ పైన ఎక్కాలంటే కాస్త కష్టమే. ఓపిక ధైర్యం ఉన్నవాళ్లు ఎటునుండయినా ఎక్కవచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే వీటిని గురించి చెప్పేవాళ్లు.... దారి చూపించే వాళ్లు లేకపోతే వీటిని చూడటం మన వల్ల కాదు. వచ్చిన వాళ్లకి దారి చూపించటానికి, వాటి గురించి చెప్పటానికి ఆ కొండల దగ్గర ఓ ఇద్దరు ముసలి వ్యక్తులు ఎప్పుడూ కాచుకుని కుర్చుని ఉంటారు....వాళ్లు లేకపోతే మనం ఏమీ చూడలేము. వాళ్లకి ఎంతో కొంత మనకు తోచినంత ఇస్తే చాలు. ఆ వయస్సులో కూడా వాళ్లు అంత ప్రయాసపడి మనకి దారి చూపుతున్నందుకు నిజంగా అభినందనీయులు. అది వాళ్లకి భుక్తి మార్గం కూడా. వాళ్లు గత నలభై సంవత్సరాలనుండి ఇదే వృత్తిలో ఉన్నారట, మరియు ఈ కొండలకి ఈ మాత్రమన్నా ప్రాచుర్యం రావటానికీ, అక్కడ ఈ మెట్ల సౌకర్యం అదీ రావటానికి వారే కారణమట! ఇంకా ఏదో చేయాలన్న తపన ఉంది వాళ్లల్లో.

మేము కొండ పైకి సుమారు రెండు కి.మీ ఎక్కి ఉంటాము.....అంటే అంతవరకే నడక దారి మెట్లు ఉన్నాయి . కొండలు విభిన్న ఆకృతులలో భలే ఉన్నాయి. అభిమన్యుడి రధచక్రం, కృష్ణుడి చక్రం...ఇలా ఆకారాలని బట్టి వాటికి పేర్లు. ఓ కొండ అయితే పడుకున్న ఒంటె ఆకారంలో ఉంది. మధ్య మధ్య చిన్న చిన్న నీటి మడుగులు...వాటికి కుంతీ గుండం, ద్రౌపది గుండం..భరధ్వాజ గుండం..పాండవుల కోనేరు.... అని ఏవేవో పేర్లు. ఇంకొక విషయమేమిటంటే ఇక్కడి రాళ్లు అసలు జారవు, కొంచం గరుకుగా ఉన్నాయి.

ఓ నిఠారయిన కొండ మీద కుంతీదేవి గుడి ఉంది. ఈ కొండ ఎక్కటం చాలా కష్టంగా ఉంటుంది.....ఏటవాలుగా కొండ అంచు మీద ఎక్కాలి. మధ్యలో పట్టుకోవటానికి నాలుగు చిన్న చిన్న ఇనుప రాడ్లు పాతారు.. ..ఆ రాడ్ల పక్కనే కాలు పెట్టటానికి కొంచం రాతిని చెక్కారు. అవి కూడా ఈ మధ్యే పెట్టారట....లేకపోతే అసలు ఎక్కలేకపోదుం..ఆ కొండ అంచున ఎక్కుతూ ఒక్కసారి కిందకి చూసామంటే.....ఇక అంతే! కాస్త భయం ఉన్నవాళ్లయితే కిందకి పడిపోతారేమో కూడా! ఆ ముసలివాళ్లు ఇద్దరూ మాత్రం ఎంత అలవోకగా ఎక్కారో! పైకి ఎక్కాక మాత్రం మహ ఆద్భుతంగా ఉంటుంది....ఓ గుహ.....అందులోకి మోకాళ్లమీద పాకుతూ వెళ్లాలి....అక్కడ..అప్పట్లో కుంతీదేవి పూజ చేసిన దేవుని విగ్రహాలని చెప్తారు....అవి ఉంటాయి. పక్కన నీటి గుండం..అక్కడ నీరు ఎప్పుడూ వస్తుంటుందట.

ఇది ధర్మరాజు పీఠం

మునీశ్వర గుహ, ధర్మరాజు పీఠం..ఇలా కొన్ని గుహలకి పేర్లు పెట్టారు. మునీశ్వర గుహ....ఇక్కడ భరధ్వాజ ముని తపస్సు చేసుకునేవాడట. ధర్మరాజు పీఠం...ఇక్కడ ధర్మరాజు కూర్చునేవాడట. ఇక్కడ చాలా చల్లగా ఉంది. అక్కడే రకరకాల బొమ్మలు గీసి ఉన్నాయి...వాటిని పాండవులు గీసారని చెప్తారు. అవన్నీ కూడా ఎప్పటివో పురాతనకాలం నాటివి లాగానే ఉన్నాయి. కొండ పైకి ఎక్కేముందు కూడా కింది నుండి చూస్తుంటే ఒకచోట జింకల బొమ్మలు గీసి ఉంటాయి....... ధర్మరాజు ఎక్కడ ఉంటే అక్కడ అలా జింకలు బొమ్మలు గీసేవాడట!!

ఇవి పాండవులు గీసిన బొమ్మలట!

అప్పట్లో వాళ్లు రాళ్లతో గుమ్మాలు దర్వాజాలు కూడా కట్టుకున్నారట....అలాంటి ఓ ధర్వాజా చూసాము. మేము అన్ని కొండలు చూడలేదు.....అవన్నీ చూడాలంటే చాలా ఓపిక కావాలి....ఎక్కటం కూడా కష్టమే. ఈ కొండల మీద రకరకాల మెడిసినల్ ప్లాంట్సు కూడా ఉన్నాయి..పాము విషానికి విరుగుడుగా పనికొచ్చేవి..డయాబెటిస్‌ (షుగర్) వ్యాధికి వాడే ఆకులు, జమ్మి, మారేడు.. ఇలా చాలా రకాల మొక్కలు చూపించారు.

ఇదే రాతి దర్వాజా, మాకు దారి చూపిన తాత

ప్రస్తుతానికయితే ఈ కొండల దగ్గర పర్యాటకులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. అసలు వీటి గురించి సరయిన ప్రచారం కూడా లేదనే చెప్పవచ్చు. వీటిని చూసాక మన చుట్టూ ఉన్న ఇలాంటి వాటిని వదిలి ఎక్కడికెక్కడికో వెళ్లి చూసి వస్తుంటాము అనిపించింది. ఎప్పుడూ చూసే ప్రదేశాలే కాకుండా ఇలాంటి చోట్లకి వెళితే కొత్త అనుభవాలు..కొంగొత్త అనుభూతులు మన సొంతం చేసుకోవచ్చు. పిల్లలకి కూడా మంచి హుషారుగా ఉంటుంది. హైదరాబాదులాంటి రద్దీ ప్రదేశాలనుండి ఇలాంటి వాటి దగ్గరకి వెళితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో!

ఇప్పటికయితే ఇక్కడ పర్యాటకుల రద్దీ అసలు లేనట్టే, ఎప్పుడయినా వస్తుంటారట. మేమెళ్లిన రోజయితే పండగని ఎవరూ రాలేదు అని చెప్పారు. ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని వీటిని అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక స్థలంగా మారుతుంది.

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070