సూర్యకిరణాలు పరచుకున్న జీవన మైదానంలో పనిలోనో / పరధ్యానంలోనో నిమగ్నమయ్యిపోయిన జీవి మీద మెల్లిగా కమ్ముకుంటున్న నీడను ఎవరన్నా గ్రహించేలోపే, అనువైన శరీర భాగాన్ని తన రెండు కాళ్ళ మధ్యన పట్టు బిగించి తన్నుకుపోయే పెద్ద గద్ద మృత్యువు. ఎప్పుడెక్కడెలా ఈ గద్ద వస్తుందో తెలీదు. ఎటు పోతుందో తెలీదు. వస్తుందని తెల్సు. పోతుందని తెల్సు. దాన్ని తప్పించుకోలేమని తెల్సీ ప్రయత్నించటం, ఓడిపోవటం, ఏడవటం – దేవుడు hire చేసుకొన్న స్క్రిప్ట్ రైటర్ ఎవరో కానీ, జీవితాలన్నింటిలో కొన్ని లైన్లు కాపీ పేస్ట్ చేసేశాడు!
పండగ పూట ఈ చావు గోల ఏంటీ? అని విసుక్కునేలోపు, అసలు సంగతి మొదలెడతా!
మా అమ్మ చిన్నప్పుడు, సంక్రాంతి నెల అంటే ముగ్గులూ, భోగి మంటలూ, పంట ఇంటికి రావడాలూ వంటివన్నీ! మా అమ్మ పెళ్లి అయ్యాక సంక్రాంతి అంటే వారం ముందే అన్ని కొత్త సినిమాలకి వరుస షోలకి అడ్వాన్సు బుకింగ్ చేసుకొని ఆర్టీసీ క్రాస్‍రోడ్స్ లోనే “పండగ” చేసుకోవడం. ఇప్పుడేమో అందరూ ఇంటిపట్టునుండి, చేసిన వంటలేవో “జెమిని పెట్టు”, “తేజలో ఏం సినిమా వేశాడో?!”, “ఈ వాడు పాత సినిమాలేస్తాడు..”, “మా లో ఏమొస్తుందో!” అన్న చర్చల మధ్య నలుగురూ కల్సి తినడం.
“మా సినిమా చూడండో.. చూడండో” అన్న దండోర ప్రతీ పండక్కి ఉన్నదే అయినా, సంక్రాంతి పూట ఒక స్పెషల్ – అదే జంధ్యాల గారి జయంతి.
పోయిన ఆదివారం, ఇంకా నిద్ర వదలని కళ్ళతో టేబుల్ మీద పరిచి ఉన్న పేజీని చూసీ చూడంగానే రెండు చేతులూ జోడించి నమస్కరించాను. నిద్ర మత్తు వదిలించుకొని, సాక్షి ఫామిలీ పేజిలో సగం వరకూ నిండున్న “జంధ్యాల” గారి ఫోటో అలానే చూస్తుండిపోయాను. కొందరి ప్రముఖుల అభిప్రాయాలు వేసి, “అతి త్వరలో.. మరెన్నో!” అంటూ ముగించాడు.
సచిన్ ఇరవై ఏళ్ల బట్టీ ప్రతీ ఇంటర్వ్యూలోనూ ఒకటే మాట: “ఐ ఎంజాయ్ మై క్రికెట్!” అని. నేను సచిన్‍కి వీరాభిమానిని! అయినా సచిన్ ఇంటర్వ్యూ చూస్తున్నా, చదువుతున్నా “ఐ ఎంజాయ్ మై క్రికెట్” అంటూ mock చేస్తుంటాను, “అదే నీవు.. అదే మాట!” అని పాట కూడా అందుకుంటాను.
నేను జంధ్యాల అభిమానిని కాను. “బాబూ.. చిట్టీ” అన్న డైలాగులో “బ” వినిపించగానే జంధ్యాల మార్కు డైలాగని గుర్తించగలగాలట! నాకు మొత్తం డైలాగు చెప్పినా గుర్తురాదు. ఆయన రాసిన డైలాగులు ఎవరన్నా వినిపిస్తే, ఏ సినిమాలో ఏ సన్నివేశంలో అది వస్తుందో చెప్పటం నా వల్ల కాదు, అప్పటికే ఆ సినిమా ఒక పది పదిహేను సార్లు చూసున్నా! ఆయన ఎన్ని సినిమాలు తీసారంటే చెప్పలేను. ఆయన సినిమాలని సమగ్రంగా విశ్లేషించలేను
.
నాకు నాలుగైదేళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా, నన్ను “వివాహభోజనంబు” అన్న సినిమా తీసుకెళ్లారు మా వాళ్లు. ఆ సినిమా చివర్లో మాయాబజార్‍లో “వివాహభోజనంబు” పాట వస్తుందనీ, అంతకు ముందు నేను చాలా నవ్వుకున్నాననీ నాకు ఇప్పటికీ గుర్తు. ఓ రెండు దశాబ్దాలు గడిచినా జంధ్యాల సినిమాలంటే నాకదే జ్ఞాపకం – బోలెడన్ని నవ్వులు! మహా ఇష్టంగా తిన్న పదార్థం రుచి మాత్రమే గుర్తుండి, ఆ పదార్థం పేరు గానీ, ఆకారం గానీ, మరే వివరాలు గానీ గుర్తులేనట్టుగా ఉంటుంది జంధ్యాల గారి సినిమాలతో నా జ్ఞాపకం, ఇన్నేళ్ల బట్టి ఎన్ని సినిమాలు మళ్లీ మళ్లీ చూస్తున్నా!
మరిప్పుడు నేనెందుకు ఇదంతా రాయడం?!
జంధ్యాల గారి పుట్టిన రోజుకీ, వర్థంతికీ ఎంతో మంది ఎన్నో విధాలుగా ఆయన్ని వేనోళ్ళ కొనియాడుతారు. ఎన్నెన్నో కబుర్లు చెప్తారు, ఆయన గురించి. తెలుగు సినిమాలో హాస్యం లాస్యం ఆయన వల్లనేనని! ఆయన ఎందరికో అన్నం పెట్టారని. ఆయన బహుముఖప్రజ్ఞాశాలని. ఆయన అది అనీ.. ఇది అనీ..
కానీ నాకెప్పుడూ ఆయన గురించి చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య గుర్తు వస్తూ ఉంటుంది. ఆయన చనిపోయిన కొత్తల్లో ఓ సంతాప సభలో కళాతపస్వి విశ్వనాథ్ గారి మాటలు:
(టివిలో చూసానప్పట్లో, నా జ్ఞాపకాల్లో ఊరిన ఆయన మాటలు)
“జంధ్యాల బతికున్నంత కాలం మా ఇద్దరి మధ్యా ఎలాంటి అసూయ గానీ, పోటీ గానీ లేవు. కానీ నాకిప్పుడు జంధ్యాలని చూస్తుంటే నాకు మహా అసూయగా ఉంది. తాను మరణించినా, ఆయన కోసం ఇంత మంది ఇలా కల్సి గుర్తుచేసుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను చనిపోయాక ఇలా చేస్తారా? అన్న ఆలోచన వస్తుంది..”
ఈ మాటల్లో అంతరార్థం ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంటుంది.
మొన్నేదో కథను రాసే ప్రయత్నంలో భాగంగా: “చావు టూ వీలర్ మీదే వస్తుంది. దానికి కావాల్సిన మనిషిని ఎక్కించుకొని పోతుంది. ఆ మనిషికి సంబంధించిన మనుషులని కానీ, బాగేజీలని కానీ ఏది వెంట తీసుకెళ్ళనివ్వదు. చుక్కలన్నీ కలిపి అందంగా వేసుకొన్న ముగ్గులో తనక్కావాల్సిన పువ్వునో, తుమ్మెదనో తనతో తీసుకుపోతుంది. చెరిగిన ముగ్గులా మిలిగిపోతాయి మిగితా జీవితాలు. చావుతో ఒక్క చావు కాదనుకో!” అన్న లైన్లు రాసుకున్నాను.
జంధ్యాల గారి గురించి ఈ పూట ఆలోచిస్తుంటే అనిపిస్తుంది, ఆయన మృత్యువుని కూడా నవ్వులతో ఓడింఛేశారని. నవ్వుల చక్రవర్తి ముందు మరణం కూడా దాసోహం అందని. నవ్విస్తూ, నవ్వుతూ కాలం గడిపేసిన ఆయన పోయాక కూడా మన కోసం బోలెడు నవ్వుల్ని మన దగ్గరే వదిలి వెళ్లటమే కాక, విపరీత పరిస్థితుల్లో మనల్ని మనం నవ్వించుకోవటం ఎలానో నేర్పారు. “చేపలు తెచ్చి పెడితే ఆకలి తీర్చిన వారమవుతాం. చేపలు పట్టడం నేర్పితే బతుకుతెరువు చూపించిన వారమవుతాం” అన్న ఆంగ్ల సామెతలా ఆయన్ని మనకి చీకట్లో నవ్వుల బాణాసంచా కాల్చడం నేర్పారు. ఆయన సినిమాలు చూడకుండా మనం పెరిగుంటే, అందులో ఎన్ని నవ్వులు మైనస్ అయ్యేవో! మనవి ఇంకెంత ఏడుపుగొట్టు జీవితాలయ్యేవో!
మృత్యువు తర్వాత కూడా జీవితం ఉంటుంది. ఆ జీవితంలో మనం భౌతికంగా తప్పించి మరన్ని విధాలుగానూ జీవిస్తూనే ఉండచ్చు. ఎప్పటికీ భౌతికంగా ఉండడం కన్నా, పదుగురి నోట నానుతూ, ఆనందాన్ని పంచుతూ ఉండడమే అమరత్వం. అప్పుడు చావుకూడా, స్టేజి మీద నుండి ఓ కీలక పాత్రను తొలిగించడానికి దేవుడి స్క్రిప్ట్ లో ఉన్న inefficiently misplaced extra character గా మిగిలిపోతుంది.
కళ ద్వారా అమరత్వాన్ని సంపాదించిన అతి కొద్ది మందిలో జంధ్యాల గారు చిరస్మరణీయులు! కష్టాల్.. నష్టాల్.. దుఃఖాల్.. అన్నీ శ్రీశ్రీ కవిత్వమంత ఘాటుగా, తీవ్రంగా, సూటిగా వచ్చినా మన దగ్గరున్న తారకమంత్రం “జంధ్యాల”.
ఆయనకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు!
రాసిన వారు: పూర్ణిమ
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న, చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులో పోడుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
Wednesday, January 13, 2010
Friday, January 8, 2010
నాలోనే నువ్వున్నట్టా..!?

నా సాహచర్యం నీ జీవనచిత్రంలో క్రొంగొత్త రంగులు నింపిందన్నావు.
నీ కళ్ళలోకి చూస్తే నాపైనున్న అపరిమితమైన ప్రేమ తొణికిసలాడింది.
నాలో నేనే నా సంతోషం చిరునామాని వెతుకుతుంటే నీ రూపు కనిపించింది.
ఇంతకీ నీలో నేనున్నట్టా.. నాలోనే నువ్వున్నట్టా..!?
నేనే నువ్వా.. నువ్వే నేనా.. ఇద్దరం ఒకటేనా.!?
ఏమో.! ఆకాశానికి చందమామ అందమా.. చందమామకి ఆకాశం ఆధారమా అంటే ఏమని చెప్పగలం.?
ఆకాశం, చందమామ ఒకచోట చేరితేనే కదా అసలైన ఆనందం..

పాఠాలు నేర్పే గురువులను చులకనగా చూసేవారికి ఈ సంఘటన ఒక కనువిప్పు
పాఠాలు నేర్పే గురువులను చులకనగా చూసేవారికి ఈ సంఘటన ఒక కనువిప్పు కావాలి.
ఈ సంఘటన నిజంగా జరిగిన సంఘటన.
కంచి కామకోటి పీఠంలో జగద్గురు పరమాచార్య చంద్రశేఖరేంద్రసరస్వతులవారు పీఠాధిపతిగా ఉన్న రోజులవి.
ఒక రోజు ఆయన గదిలో ఉండగా ప్రొద్దునపూట అక్కడి వేదపాఠశాలలో చదివే పిల్లలు అరుస్తూ ఆడుకొంటున్న శబ్దం వినిపించింది. ఈ సమయంలో తరగతిలో చదువుకొనకుండా బయట ఎందుకు ఆడుకొంటున్నారని పరమాచార్యులవారు బయటికి వచ్చి ఒక పిల్లవాడితో ఎందుకు తరగతికి వెళ్ళలేదు? అని అడిగారు. గురువు గారు రాలేదని ఆ పిల్లవాడు చెప్పాడు. పక్కన ఆడుకొంటున్న ఇంకో పిల్లవాడు జోక్యం చేసుకొని "గురువు గారు పాఠం చెప్తున్నారు. మేమే బయటకు వచ్చి ఆడుకొంటున్నాము" అన్నాడు. ఇద్దరిలో ఎవరిది నిజమో కనుగొనడానికి పరమాచార్యులవారు ఇద్దరినీ వెంటబెట్టుకొని తరగతి గది వద్దకు వెళ్ళి చూస్తే గురువుగారు లేరు.
అప్పుడు పరమాచార్యుల వారు రెండవ పిల్లవాడితో అబద్దం ఎందుకు చెప్పావంటూ ప్రశ్నించారు. ఆ పిల్లవాడు ఏ మాత్రం భయపడకుండా " రోజూ వచ్చే మా గురువు గారు ఈ రోజు ఏదో అత్యవసర పని మీద రాలేకపోయుంటారు. వారు రాకపోయినా తరగతిలో కూర్చొని చదువుకోవలసిన బాధ్యత మాది. కాని మేము అలా చేయలేదు. అంటే తప్పు మాది. గురువుగారు రాలేదని మీరుఆయనను కోప్పడతారు. మీ కోపాన్నుండి ఆయననను తప్పించడానికి చిన్న అబద్దం చెప్పడం నేను ధర్మమే అనుకొంటున్నాను. ఈ సమయంలో చదువుకోక ఆడుకోవడం మా తప్పే." అన్నాడు.
అంతటి నడిచే దేవుడిగా పేరొందిన పరమాచార్యులవారు కూడా ఆ పిల్లవాడి గురుభక్తిని చూసి ఆశ్చర్యం పొందారు.
" నీవురా నిజమైన శిష్యుడివి "అంటూ ఆ పిల్లవాడి భుజం తట్టారు పరమాచార్యులవారు.
నేడు కళాశాల విద్యార్థులైనంత మాత్రాన కొమ్ములు వచ్చేసినట్లు ప్రవర్తిస్తూ గురువులను అవమానిస్తున్న వారిని, అలా చేయడానికి ప్రోత్సాహం ఇస్తున్న సినిమాలు,TVలు, పత్రికలు పైన పేర్కొనబడ్డ అబ్బాయి కాలి గోటికి సరిపోతారేమో ఆలోచించండి

సచిన్ టెండూల్కర్ లా ఆలోచిస్తే ఇంతటి విధ్వంసాలు జరుగుతాయా
సచిన్ టెండూల్కర్ లా ఆలోచిస్తే ఇంతటి విధ్వంసాలు జరుగుతాయా?

సచిన్ ఆట గురించి మనకు తెలుసు. క్రింది సంఘటన చూస్తే మన ప్రవర్తనతో ఎదుటివారి మనసులను ఎలా గెలుచుకోవచ్చో తెలుస్తుంది.
ఆ మధ్య ముంబాయిలో ఒక కొత్త ఇల్లు కట్టుకొన్నాడు. అతను అలా కట్టుకోవడం వలన తమ ప్రాంతంలో ఇళ్ళ ధరలు పెరిగాయని ,సచిన్ అంతటివాడు తమ మధ్యకు వస్తున్నాడని అందరూ ఆనందించారు. కాని సచిన్ ఇల్లు కట్టుకొనేప్పుడు ఎదుటివారికి కలిగే అసౌకర్యం గురించి ఎంత ఆలోచించాడంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటి వారికీ స్వయంగా ఉత్తరాలు వ్రాశాడు. ఆ ఉత్తరం లోని విషయం ఇది.
" నేను మీ ప్రాంతములో ఇల్లు కట్టుకొంటున్నాను. అది పెద్ద ఇల్లు. ఈ ఇంటినిర్మాణమప్పుడు ఎన్నో లారీలు పగలు,రాత్రీ తిరగవలసి వస్తుంది. ఇంకా ఇంటినిర్మాణంలో బండలు పగలగొట్టవలసి వస్తుంది. చిన్నచిన్న డైనమెట్లు కూడాఅందుకు ఉపయోగించవలసి వస్తుంది. ఎవరికీ దెబ్బలు తగులకుండాఏర్పాటుచేసాము. కాని శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది. పగలురాత్రీ అని తేడాలేకుండా పని చేయాల్సి ఉండడం వలన మీకు చాలా అసౌకర్యంగా ఉంటుంది.నన్ను మన్నించగలరు. ఈ ప్రాంతంలోకి నేను చేరిన తర్వాత నేను మీ కాలనీఅనే కుటుంబంలో ఒక సభ్యుడను అవుతాను కదా.
ఒక కుటుంబములో ఒక కొత్త సభ్యుడు రావడం అనేది ఒక తల్లికి బిడ్డ పుట్టడంలాంటిది. తల్లి నవమాసాలూ మోసేటప్పుడు చాలా కష్టాలు పడవలసి వస్తుంది.అప్పుడే బిడ్డ రాగలడు. అలానే మీ కాలనీ అనే కుటుంబములోనికి నేను కొత్తగావస్తున్నాను కాబట్టి అందుకు మీరు కొంత కష్టం పడవలసిఉంటుంది అని తెలుపడానికి బాధపడుతున్నాను.. నన్ను మీ కుటుంబములోనికిచేర్చుకుంటారని ఆశిస్తున్నాను."
అసలు సచిన్ రావడమే తమకు ఎంతో గొప్పగా, ఆనందముగా భావించారు ఆ ప్రాంతవాసులు. ఐనా వారు ఏమీ అనలేదని సచిన్ ఊరుకోలేదు. వారి అసౌకర్యం ఊహించి ఎంత గొప్పగా వ్రాశాడో కదా.
ఇలా ఎదుటివారికి కలిగే బాధను మన విధ్వంసకారులూ (చీటికీమాటికీ ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్తులను తగులబెడుతున్నవారు) తెలుసుకొంటే బాగుంటుంది కదా
Thursday, December 31, 2009
Happy New Year
Hi all,
I wish you and your family WISH YOU A HAPPY AND PROSPEROUS NEW YEAR - 2010.
I wish the new will bring you all good and suceess in your life.
Regards
Srinivas
9866983281
I wish you and your family WISH YOU A HAPPY AND PROSPEROUS NEW YEAR - 2010.
I wish the new will bring you all good and suceess in your life.
Regards
Srinivas
9866983281
Monday, December 28, 2009
వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.
వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.
పండగ ఆచరించు విధానం
ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.
ఏకాదశి వ్రతం నియమాలు :
1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి.
2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.
3. అసత్య మాడరాదు.
4. స్త్రీ సాంగత్యం పనికి రాదు.
5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.
7. అన్నదానం చేయాలి.
పండుగ ప్రాశస్త్యం
ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి
వైఖానసుడి కథ
పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!
మురాసురుడి కథ
కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.
తాత్త్విక సందేశం
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం; ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు
Sunday, December 27, 2009
FW: ముక్కోటి ఏకాదశి
ముక్కోటి ఏకాదశి
సూర్యుడు<http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81> ఉత్తరాయణానికి<http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%82&action=edit&redlink=1> మారేముందు వచ్చే ఏకాదశినే<http://te.wikipedia.org/wiki/%E0%B0%8F%E0%B0%95%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B6%E0%B0%BF> వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ<http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B1%88%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%A0%E0%B0%82&action=edit&redlink=1> వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచిఉంటారు. ఈరోజు మహావిష్ణువు<http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B1%81%E0%B0%B5%E0%B1%81> గరుడ వాహనారూఢుడై మూడుకోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడుకోట్ల<http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81> ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.[మార్చు<http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AE%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%8F%E0%B0%95%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B6%E0%B0%BF&action=edit§ion=1>] పండగ ఆచరించు విధానం
ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి<http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%B8%E0%B0%BF> తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి<http://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B6%E0%B0%BF> నాడు అతిథిలేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాపవిముక్తులవుతారంటారు. ఉపవాసంవల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.
పండుగ ప్రాశస్త్యం
ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి
వైఖానసుడి కథ
పర్వతమహర్షి<http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%A4%E0%B0%AE%E0%B0%B9%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF&action=edit&redlink=1> సూచనమేరకు వైఖానసుడనే<http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B1%88%E0%B0%96%E0%B0%BE%E0%B0%A8%E0%B0%B8%E0%B1%81%E0%B0%A1%E0%B1%81&action=edit&redlink=1> రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!
మురాసురుడి కథ
కృతయుగంలో<http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%83%E0%B0%A4%E0%B0%AF%E0%B1%81%E0%B0%97%E0%B0%82> ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. విష్ణువు<http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B1%81%E0%B0%B5%E0%B1%81> మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని మురాసురుడు<http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AE%E0%B1%81%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B8%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81&action=edit&redlink=1> మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! వెంటనే మహాలక్ష్మి<http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF> దుర్గ<http://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97> రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.
తాత్త్విక సందేశం
విష్ణువు<http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B1%81%E0%B0%B5%E0%B1%81> ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు<http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%A8%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81&action=edit&redlink=1> (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు<http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A_%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81&action=edit&redlink=1> (కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం; ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.
Thanks & Regards
S.Srinivasa Prasad Rao
9177999263
P Let us do our best to save nature, save water, plant trees, protect greenery, keep our surroundings clean, reduce usage of plastics, and use renewable energy sources.<http://ammasocialwelfareassociation.blogspot.com/>

Subscribe to:
Posts (Atom)