Sunday, May 31, 2009

How to Socialize With People

How to Socialize With People

Socializing with people is a behavior that is innate to human beings. This is due to the fact that our ancestors used to hunt in groups for food and even worked together. However, in today's world, we often find loners in the society, spending their lives in solitude, without mingling with others. This is perhaps because of the fact that they lack the characteristics required to socialize with the people around them. If you are one of the people who find it difficult to go out and make friends with people, do not worry. We are here to help you with some tips, which will help you learn how to socialize with people.

Socializing With People

Smile
Your million dollar smile can act as a gesture to show that you wish to socialize with others. When you are with a group of people, wear a pleasant smile on your face. Make an eye-contact while smiling. See how people respond to this. It will surely be a positive response. They will smile back. Some of them may even be ready to initiate a conversation with you.

Develop Positive Attitude
An important step towards socializing with people is to develop a positive attitude. You should have an optimistic outlook towards life. Be positive and live in high spirits. When you go out and meet people, leave all your tensions back home and fit into the environment of the place.

Find A Common Point
When you are with people at a party or a social get-together, try to find a common interest. This will give you a chance to open up yourself to others. If you succeed in finding similar taste or interests, it will be easier for you to proceed further and develop familiarity with them.

Build Rapport
To socialize with people, you need to build a rapport with them. You should present yourself as an approachable person, who has many things (or at least few things) common with others. In the process, you should share your point of view with others, listening to their as well. You should be able to relate to people, making them feel neither inferior nor superior to you. This brings out another quality needed to socialize with people - communication skills.

Communicate EffectivelyShare your views, when you are in a social circle. However, do not be aggressive while presenting your viewpoint. When you are with a group of people, you have to lend your ears first and speak your mind later on. Be a good listener. This will make you more knowledgeable about the people surrounding you. You will be able to judge them better, by listening to their words carefully. The habit of listening to others will also give you an idea about the level of sophistication of the people around you and present yourself according to the situation.

విద్య యొసగు వినయంబు

నేటి మన దేశప్రజలు నైతికంగా,ఆర్థికంగా,మానవత్వపరంగా మరియు సంప్రదాయపరంగా ఎంత దిగజారిపోయున్నారో మనకు తెలియంది కాదు.దీనికి కారణాలు చాలా ఉన్నాయి.
మొదట మనము చెప్పుకోవాల్సింది మన విద్యావ్యవస్థ గురించి.ఇక్కడ మెకాలే అనో లేక మరోటి అనో మనం చెప్పుకోవడం లేదు.విద్యావ్యవస్థ లోని మూల(basic) సమస్యను గురించి చెప్పుకోవాలి."మొక్కై వంగనిది మానై వంగునా" అన్నది మన పెద్దలు చెప్పిన సత్యము.

విద్య యొక్క మొదటి లక్ష్యము పిల్లల యొక్క ఆత్మవిశ్వాసం పెంపొందించడము.తర్వాత నైతికముగా అభివృద్ధి చెందేలా చేయడము అనగా సంస్కారవంతులుగా తీర్చిదిద్దడము మొదలగునవి వస్తాయి.
ఇక్కడ ఒక నిజముగా జరుగుతున్న విషయాన్ని గురించి చూద్దాము.
"ఒక సారి ఒక మంత్రిగారు మన దేశం నుండి జపాన్ కు పర్యటించడానికి వెళ్ళారు.వారి సాంకేతిక ప్రతిభ మొదలగునవి చూసి ఆశ్చర్యపడి అక్కడి ఒక మంత్రి గారితో "ఏమండీ!పురాణ కాలం నుండీ మన రెండు దేశాలు మంచి మిత్రులు.మీ ప్రజలకున్న తెలివితేటలే భారత ప్రజలకు కూడా ఉన్నాయి కదా.మరి అభివృద్ధి విషయంలో ఇంత తేడా ఎందుకున్నదో చెప్పగలరా?" అన్నారు. అప్పుడు ఆ జపాన్ మంత్రిగారు "మీరన్నది నిజమే.మనము మంచి మిత్రులమే.ఇంకా చెప్పాలంటే భారతీయులకు మేము ఎంతో ఋణపడి ఉన్నాము.చాలా వైజ్ఞానిక విషయాలకు మీరే మాకు మార్గదర్శకులు.కాని ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే మా దేశంలో 10 కోట్లమంది "పౌరులు" ఉన్నారు.మీ దేశంలో 100 కోట్లమంది "వ్యక్తులు" ఉన్నారు."అని సమాధానం ఇచ్చారు. ఇక్కడ మనం "పౌరులు" మరియు "వ్యక్తులు" మధ్య తేడా గమనించవచ్చు.

జపాన్ వారి విధ్యా విధానంలో విశేషం ఏమిటంటే వారి పిల్లలకు చిన్నపటి నుండే తమ దేశపు గొప్పతనం గురించి వారి సంస్కృతి గొప్పతనం గురించి భోధిస్తారు.వారి దేశపు ప్రఖ్యాత వ్యక్తుల గురించి చెపుతారు.ముఖ్యముగా తమ దేశము భగవంతుని దృష్టిలో ఎంతో ఉన్నతమైనదని అందుకే ప్రపంచములో మొట్టమొదట సూర్యుడు తమ దేశములోనే ఉదయిస్తాడని నూరిపోస్తారు.తద్వారా తమ దేశముపైన అపార గౌరవ విశ్వాసాలు పెంపొందేలా చేస్తారు. తమపైన తమకు విశ్వాసం పెంపొందేలా చేస్తారు.తము మహోన్నత వ్యక్తుల వారసులము అన్న భావన పెంపొందించుకొనేలా చేస్తారు.తర్వాతే మిగతా విషయాలు అనగా సైన్సు,లెక్కలు మొదలగునవి వస్తాయి.
ఇప్పుడు అందరికీ అర్థం అయ్యే ఉంటుంది.జపాన్ వారు అంతగా ఎందుకు అభివృద్ధి చెందారో. కొన్ని విషయాలలో వారూ వెనుకబడి ఉండవచ్చు అన్న విషయం కాని ఇక్కడ ఆ విషయం అప్రస్తుతం అని భావిస్తాను.

మన దేశంలో ఇలాంటి విద్యా విధానాన్ని మనం కలలోనైనా ఊహించగలమా? మన సంస్కృతీసంప్రదాయాలు ఎంత ఉన్నతమైనవో అందరికీ తెలుసు. అవి మాత్రం అసలు చెప్పరు. "విద్య యొసగు వినయంబు" అన్న పెద్దలమాట ఎంత వృధాగా పోతోందో మనకు తెలుసు.మన ఇప్పటి విద్యావిధానం పిల్లలను మార్కులు తెచ్చుకొనే యంత్రాలుగా ,ర్యాంకులే పరమావధిగా మారుస్తోంది.ఇక నైతిక,సంస్కార విలువలు ఎలా నేర్పుతాయి?
కనీసం మన పిల్లల నుండి ఐనా మనము మార్పును తీసుకురాలేమా?

"ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకీ..అటో ఇటో ఎటోవైపు.."

ఈ వాక్యం వినడానికి ఎంతబావుందో కదా..! అందులో ఎంత వాస్తవం, ఎంత మార్గదర్శకం ఉందో కదా..!
ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది మనుషులు ఉన్నారు. అందరూ ఒక్కో విధమైన మనస్తత్వాలు, ఆలోచనలు కలిగిఉంటారు. ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు అనిపిస్తుంది, మరొకరికి పిచ్చితనం అనిపిస్తుంది. ఒక్కటే విషయం, చూసే మనిషి దృక్పథాన్ని బట్టి అభిప్రాయం మారుతూ ఉంటుంది.
ఈ ప్రపంచంలో ప్రతీ మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు.అవి మామూలే...సముద్రపు అలల్లా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ, కొంతమందికి జీవితమే ఒక సమస్య . వాళ్ళనే మనందరం అనాధలు అంటూ ఉంటాం. అనాధలు అంటే ఎవరూ లేనివారనేగా మన ఉద్దేశ్యం. ఎన్నో కారణాల వల్ల ఈ ప్రపంచంలో ఒంటరిగా వదలివేయబడ్డ పసిపాపలే అనాధలవుతారు. ఇంత మంది మనుషులున్న ఈ విశాల ప్రపంచంలో తమకి మాత్రమే ఎందుకు ఎవరూ లేరో వాళ్లకేప్పుడూ అర్ధం కాని విషయం. ఒకోసారి విధి వక్రీకరించి తనవాళ్ళని పోగొట్టుకోవడం వల్ల కూడా కొంతమంది పిల్లలు అనాధలవుతారు. అలాంటి దురదృష్టానికి గురి అవ్వని మన లాంటి అదృష్టవంతులైన మనుషులు అలాంటి పసిపాపల కోసం ఎంతో కొంత ఆలోచించాలి. ఏదో ఆకలితో ఉన్నారని ఒక పూట అన్నం పెట్టడమో, ఒక పది రూపాయలు ఇవ్వడమో చేసి ఊరుకుంటే సరిపోదనీ, అది సరి కాదని కూడా నా అభిప్రాయం. దాని వల్ల వారి జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. చేతనయితే వారి మీద జాలి, దయ చూపించకుండా ప్రేమ చూపించగలగాలి. మనం చేసే చిన్న పని ద్వారానయినా వాళ్ల జీవితంలో ఒక మార్పు రావాలి. వాళ్లు భవిష్యత్తులో మంచి మనసున్న మనుషులుగా ఎదగాలి. ప్రతీ మనిషి జీవితానికి కనీస అవసరాలయిన తిండి, నీడ, ఆరోగ్యం కాకుండా చదువు కూడా కావాలి. అప్పుడే వాళ్ల జీవితాన్ని వాళ్ళే నిర్మించుకోగలిగే విజ్ఞానం, శక్తి వస్తాయి.

సరే..! ఇదంతా బానే ఉంది. మాకూ ఇలాంటి భావాలు, ఆలోచనలు చాలా ఉన్నాయి. కానీ, మన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆలోచించుకోవాలి కదా అని అనుకుంటున్నారా? ఇలాంటివన్నీ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా... ఇంకా మేము ఇరవైల్లోనే ఉన్నాము, జీవితంలో ఇంకా స్థిరపడలేదు, ఇప్పుడే ఉద్యోగం వచ్చింది కానీ కొంచెం ఆర్ధిక స్థిరత్వం వచ్చేవరకు ఇలాంటివి అమలు చేయడం కష్టం, ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి కదా....ఇలా ఇలా ఏదో ఒక రకంగా మీ ఆలోచనలు సాగుతూ ఉండవచ్చు. నాకెలా తెలుసంటే నేను కూడా అలాగే చాలా సార్లు ఆలోచించాను కాబట్టి. ఇలానే మాట్లాడుకుంటూ ఉండగా ఒకసారి నా స్నేహితుడన్నాడు నాతో... "నేను పేద కుటుంబంలో పుట్టి చాలా కష్టపడి చదువులో ఈ స్థాయికి వచ్చాను. చదువుకునే రోజుల్లో నేను కష్టపడే ప్రతీ దశలోనూ, నాకు ఉద్యోగం వచ్చాక ఎంతో మందికి ఎన్నో చేయాలి భవిష్యత్తులో అని ఎన్నో అనుకున్నాను. తరవాత కొంతకాలానికి నా చదువయిపోయి ఒక చిన్న ఉద్యోగం వచ్చింది. కానీ, నా కుటుంబ బాధ్యతలు, నా స్వంత జీవితంలో ఉన్న పరిస్థితుల్ని బట్టి ఇంకా కొన్ని రోజులకి పెద్ద ఉద్యోగం వచ్చాక నా వంతు కృషి తప్పకుండా చేయాలి అనుకున్నాను. ఇలా కొంత కాలం గడిచాక ఒకరోజు అకస్మాత్తుగా నా మనసుకి ఒక విషయం తట్టింది.

అది ఏంటంటే...నువ్వు ఒకటి చేయాలి అని గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు ఎంతో కొంత చేయగలవు ఏ పరిస్థితిలోనయినా.. నువ్వు వస్తుందనుకే ఆ అత్యంత అనుకూల పరిస్థితి మన జీవితాల్లో ఎన్నటికీ రాదు. ఎందుకంటే మన అవసరాలు, ఆశలు ఎప్పటికీ పూర్తి అవ్వవు. ఒకవేళ అయినా కూడా సరికొత్తవి ఆ జాబితాలో చేరుతూనే ఉంటాయి. కాబట్టి ఉన్నంతలో ఏదో ఒకటి వెంటనే మొదలు పెట్టు." ఎవరో గొప్పవాళ్ళు చెప్పినట్టు "వేయి మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది". కానీ, ఆ ఒక్క అడుగు ఎప్పుడు వెయ్యాలా అని ఎదురుచూస్తూనే కాలం గడిచిపోతుంది, ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో..ఈ విషయం గురించి ఈ రోజు ఇక్కడ చెప్పే ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే నాకు తెలిసిన దాన్ని చెప్పడం వల్ల ఇది చదివగానే ఆ మొదటి అడుగు వేయాలని ఎదురుచూస్తున్నవారెవరైనా ఉంటే కనీసం ఒక్కళ్ళయినా వెంటనే ముందడుగు వేస్తారని..అలా మొదటి అడుగుగా... నేను నా స్నేహితుడి ద్వారా ఒక ఆర్గనైజేషన్ గురించి తెలుసుకున్నాను. అది ప్రపంచం మొత్తం అనాధ పిల్లలకోసం నడుపుతున్న ఒక సంస్థ. మన ఇండియా లో కూడా ఉంది. వాళ్ళేం చేస్తారంటే, ఇలాంటి పిల్లలను వెళ్లి వెతికి తీసుకొచ్చి వాళ్ల సంస్థలో చేర్పించుకుంటారు. ఒకోసారి తల్లితండ్రులు ఉన్నా కూడా, బాగా పేదవాళ్లవడం చేత పిల్లలని సరిగ్గా చూసుకోలేని, చదువు చెప్పించలేని స్థితిలో ఉన్న పిల్లలని కూడా చేర్చుకుంటారు. అలాంటి పిల్లకి, మంచి తిండి, ఉండటానికి వసతి, ఆరోగ్యం, చదువుకునే అవకాశం కల్పిస్తారు. అయితే వీళ్ళు ఎవరి దగ్గరినుంచైనా విరాళాలు తీసుకుంటారు ఈ సంస్థ నడపడం కోసం. వీళ్ళు చేసే ఒక గొప్ప విషయం ఏంటంటే...మనం ఒక చిన్న విరాళం ఇచ్చినందుకు ప్రతిఫలంగా మనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తారు. అది ఎలా అంటే...వాళ్ల website లో చాలామంది పిల్లల photos ఉంటాయి పేరు, ఊరుతో సహా.. ఎవరో ఒకళ్ళని మనం సెలెక్ట్ చేసుకుని నెలకి 600Rs/- INR పంపిస్తే ఆ child కి కావలసిన అన్ని సౌకర్యాలనీ వాళ్లు అమరుస్తారు. మనమే కాకపోయినా ఎవరో ఒకళ్ళు ఆపని చేస్తారు. కానీ, మనం చేస్తే ఆ సంస్థ వాళ్లు, ఆ child photo ని మనకి పంపించడమే కాక, ఎప్పటికప్పుడు వాడు ఏమి చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఎలా చదువుతున్నాడు, వాడి progress card ...లాంటివి కూడా పంపిస్తారు. మనకి కావాలంటే అప్పుడప్పుడూ వెళ్లి వాడిని కలవచ్చు. వెళ్ళలేకపోయినా ఉత్తరాలయినా రాయచ్చు. So, almost its a kind of virtual adoption. అలా అని, మీరు ఇన్ని రోజులు కట్టాలి అనే నిర్భందం లేదు. ఒక నెల నుంచి మొదలుకుని ఎన్ని నెలలయినా కట్టచ్చు మీ వీలుని బట్టి. ఇలాంటివి ఎంత సంతోషాన్నిస్తాయో నేను మాటల్లో చెప్పలేను. ఒకసారి చేసి చూస్తే మీరే స్వయముగా తెలుసుకోవచ్చు.

ఈ రోజుల్లో 600 రూపాయలు చిన్న మొత్తమేనని నా అభిప్రాయం. ఎందుకంటే మనం ఒక జత బట్టలు కొనుక్కుందామన్నా అంతకంటే ఎక్కువే అవుతుంది. కాబట్టి ఆలోచించి చూడండి మీరు చేయగలేరేమో...!!

మరి ఒక మంచి పని కోసం మన మొదటి అడుగు ముందుకి వేద్దామా...??

Saturday, May 30, 2009

United States of india - ఇదొక ధనికదేశం.

ఫోన్ : లబ్బరు గాజులు లబ్బరు గాజులు లబ్బరు గాజులు తెచ్చానే...

స్వదేశ్ కుమార్ : (ఎత్తి) హలో ! యెస్ స్వదేష్ స్పీకింగ్ !

విదేశ్ రావ్ : హలో స్వదీ ! నేనేరా విదీని ! ఎలా ఉన్నావ్ ?

స్వదేశ్ : ఓహ్ నువ్వా ? నా సంగతి సరే గానీ నువ్వెలా ఉన్నావురా అమెరికాలో ?

విదేశ్ : నేనిప్పుడు అమెరికాలో లేన్రా ! ఇక్కణ్ణుంచే మాట్లాడుతున్నాను.

స్వదేశ్ : వార్నీ ! వ్హాటే ప్లెజెంట్ సర్‌ప్రైజ్ ! చెప్పాపెట్టకుండా అమెరికా నుంచి ఎప్పుడొచ్చేశావురా ? సరే ! డైరెక్టుగా ఇంటికొచ్చేయ్, మాట్లాడుకుందాం !

విదేశ్ : వచ్చేవాణ్ణే గానీ స్వైన్ ఫ్లూ టెస్టులు చేస్తామని చెప్పి ఇక్కడ షమ్సాబాద్ ఎయిర్ పోర్టులో మమ్మల్ని లగేజితో సహా ఆపేశార్రా ! తరువాత మా అడ్రస్సూ, ఫోన్ నంబరూ తీసుకుంటారట. నాకు హైదరాబాదులో సొంత అడ్రస్సేం లేదు గదా ! అందుకని నీ మెయిలింగ్ ఆడ్రస్ కొంచెం చెప్తావా, నోట్ చేసుకుంటాను ?

స్వదేశ్ : సరే రాస్కో ! కేరాఫ్ స్వదేష్ కుమార్, హౌజ్ నంబర్ 12-34-567/3a/abc/ijk/pqr/xyz....

విదేశ్ : చచ్చాం పో, ఇదేం నంబర్రా బాబూ ?

స్వదేశ్ : హహ్హహ్హా ! మా హైదరాబాదులో ఇళ్ళ నెంబర్లన్నీ ఇలానే ఉంటాయ్ - అనగా ఇలాగే తగలబడతాయ్.

విదేశీ : సరే, రాసుకున్నా. తరవాత ?

స్వదేశ్ : తరవాత.... కుతుబ్ షాహి టూమ్స్ చౌరస్తా....

విదేశ్ : ఆగాగు, ఒక విషయం చెప్పు. నువ్వుండేది టూమ్స్ దగ్గరా ?

స్వదేశ్ : అబ్బా ! టూమ్స్ అంటే టూమ్స్ కాదురా ! ఒక విషయం అర్థం చేస్కో, హైదరాబాదులో పేరుకీ ఏరియాకీ సంబంధం లేదురా బాబూ ! గోల్కొండ చౌరస్తా అంటారు. అక్కడ గోల్కొండ ఉండదు. చార్మినార్ చౌరస్తా అంటారు. అక్కడ చార్మినార్ ఉండదు.

విదేశ్ : అయితే దీనికి హైదరాబాదనే పేరు తీసేసి మాయాబజార్ అంటే బావుంటుందేమో !

స్వదేశ్ : అదేదో నువ్వు సి.ఎమ్. అయ్యాక ఆలోచించు. ప్రస్తుతానికి అడ్రస్ రాస్కో !

విదేశ్ : సరే, చెప్పు !

స్వదేశ్ : సాయిగణేష్ ఎంక్లేవ్... ఆనంద్ నగర్ కాలనీ... అవంతీ ఎస్టేట్స్... ధర్మాపూర్ లేయౌట్... బాలాపూర్ రోడ్డు... హైదరాబాద్.

విదేశ్ : మై గాడ్ ! ఎక్కడైనా ఒక కాలనీ, ఒక ఏరియా ఉంటుంది. నీ ఒక్క కొంపకి పరమపద సోపానపటంలా ఇన్ని పూర్ లేంటి ? నగర్ లేంటి ? లేయౌట్ లేంటి ? ఎంక్లేవులేంటి ? వింటూంటే పిచ్చెక్కిపోతోందిరా నాయనా ! అసలీ అడ్రస్ పట్టుకుని నువ్వు రోజూ ఆఫీసు నుంచి తిన్నగా ఇంటికి చేరుకోగలుగుతున్నావా ? అని !

స్వదేశ్ : అసలు జీవితం గాడితప్పినవాడే దారితప్పి హైదరాబాదొస్తాడ్రా. మళ్ళీ ఇక్కడ దారితప్పితే అదో పెద్ద ఇష్యూ కాదులే !

విదేశ్ : నువ్వన్నది నిజంరా ! నేను కూడా నా అమెరికా జీవితం గాడి తప్పడం వల్లే హైదరాబాదొచ్చా.

స్వదేశ్ : అంటే ?

విదేశ్ : అంటే ఏముంది ? నీకు తెలుసుగా, క్రైసిస్ ఎలా ఉందో ! యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాస్తా అనెంప్లాయ్డ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయిపోయింది. ఇదివరకులా ఉజ్జోగాలూ, సజ్జోగాల్లేవ్. నా ఉజ్జోగానిక్కూడా ఎసరొచ్చింది. నా వీసా కూడా రిన్యూ చేసే అవకాశం లేకపోయె. దాన్తో "నా జన్-మ-భూ-మి ఎన్-తా అన్-ద-మైనా దేశమూ...." అని పాడుకుంటూ ఇక్కడికొచ్చిపడ్డా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాకి !

స్వదేశ్ : బాధలో ఉన్నా భలే చెప్పావురా విదీ ! మరి నీ భవిష్యత్ ప్రణాళికేంటి ? ఇక్కడే పర్మనెంటుగా ఉందామనా ? మళ్లీ స్టేట్స్ వెళదామనా ?

విదేశ్ : నా చేతిలో ఏముందిరా ? నేను అనుకుని ఇక్కడికొచ్చానా, అనుకుని అక్కడికెళ్ళడానికి ? ముందిక్కడేదైనా జాబ్ చూసుకుని తరవాత ఆలోచిస్తా. కానీ ఎంత స్వదేశమైనా ఒరే, అక్కడ అన్నేళ్ళు ఉండొచ్చాక ఇక్కడుండడం కష్టమేరా బాబూ !

స్వదేశ్ : కష్టమంటే ఏ దృష్టితో నంటావ్ ?

విదేశ్ : ఎంత క్రైసిస్ లో ఉన్నా ఆ వాతావరణం వేరు. ఆ మనుషులు వేరు. ఆ థాట్ క్లైమేట్ వేరు. మంచి రూల్సు, రెగ్యులేషన్సు ఉంటాయి. అందరూ పాటిస్తారు. ఇక్కడ అంతా ఖరాబోళ్ళు, గరీబోళ్ళు. రూల్సు పెట్టినా ఎవడూ పాటించడు. పాటించే వాతావరణం లేదు. అక్కడ యాభై స్టేట్స్ ఉన్నా అన్ని ఉన్నట్లే ఉండదు. చాలా పీస్ ఫుల్ గా ఉంటుంది. ఇక్కడైతే ఎప్పుడూ ఏదో ఒక గోల, గొడవ, గందరగోళం, న్యూసెన్సు. ఎలా ఉండగలనా ? అని ఆలోచిస్తున్నాను.

స్వదేశ్ : యు ఆర్ మిస్టేకెన్ మ్యాన్ ! అంత డిసిప్లిన్ లేకపోవచ్చు గానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా కూడా బాగా డబ్బున్న దేశమే.

విదేశ్ : ఒరే స్వదీ ! నాకెంత జాబ్ లేకపోతే మాత్రం, ఇలాంటి పూర్ జోక్సేసి నవ్వించాలని చూడకురా బాబూ, చిరాగ్గా ఉంటుంది.

స్వదేశ్ : జోకులు కాదురా ! నిజమే చెబుతున్నా.

విదేశ్ : అదే, ఏంటా నిజం ? అనడుగుతున్నా.

స్వదేశ్ : మొన్న జరిగిన ఎన్నికల్లో మనవాళ్ళు ఎంత డబ్బు తగలేశారో తెలుసా ? ఒక్క ఆంధ్రాలోనే వెయ్యికోట్లు పెట్టారు. డెవలప్డ్ కంట్రీలూ గాడిదగుడ్డు అంటావ్, ప్రపంచంలో ఎక్కడున్నారో చూపించరా నాకు - మనలా ఖర్చుపెట్టేవాళ్ళు !

విదేశ్ : అవున్రా ! ఇందులో ఇండియానే గ్రేట్ ! అయినా అంతమాత్రానే ఇండియా రిచ్ అంటే ఎలా ?

స్వదేశ్ : తొందరపడకు, ఇంకా ఉంది విను. ఎందులో చూసుకున్నా ఇండియానే రిచ్చి. నువ్విప్పుడు హైదరాబాద్ నుంచి మీ స్వగ్రామం వెళ్లాలంటే నీకు టిక్కెట్లు దొరకవ్.

విదేశ్ : అదేంట్రా ?

స్వదేశ్ : అదంతేరా ! పనీపాటా లేకుండా, ఒకవేళ ఉన్నా ఎగ్గొట్టి మరీ డబ్బులు తగలేసి, బస్సులూ, రైళ్ళూ ఎక్కి చుట్టాల్నీ, పక్కాల్నీ చూడ్డానికి వెళ్ళే దర్జా మనవాళ్ళకే సొంతం. అందుకని నీకు టిక్కెట్లు దొరకవ్. ఏ డోరుకో, కిటికీకో వేళ్ళాడుతూ వెళ్ళాల్సిందే.

విదేశ్ : మై గాడ్ ! మళ్ళీ అదొకటా ?

స్వదేశ్ : అదొక్కటే కాదురా ! ఇంకా చాలా ఉన్నాయి. ఒక మాటడుగుతా చెప్పు. మీ దేశంలో క్రిస్మస్ ఏడాదికి ఎన్నిసార్లు జరుపుకుంటారు ?

విదేశ్ : ఛ ! ఇదేం ప్రశ్నరా ? ఒక్కసారే గదా !

స్వదేశ్ : ఛ ! దట్స్ వై ఐ పిటీ యుఎస్. ద పూర్ కంట్రీ ! మేమిక్కడ దీపావళి ఎన్నిసార్లు జరుపుకుంటామో తెలుసా ?

విదేశ్ : ఆఁ ఎన్నిసార్లేంటి ?

స్వదేశ్ : ఎన్నిసార్లంటే అది మాకే తెలీదు, నీకేం చెప్తాం ?

విదేశ్ : అదేంట్రా ? మన చిన్నప్పుడు మామూలుగా ఏడాదికోసారి జరుపుకునేవాళ్ళం కాదూ ?

స్వదేశ్ :ఇప్పుడంతా మారిపోయిందిరా ! ఇప్పుడిక్కడ మనకి నిత్యదీపావళి. అదే మన గ్రేట్ నెస్. బర్త్ డే రోజు టపాసులు కాలుస్తాం, పెళ్ళిరోజు కాలుస్తాం. పిల్లలు పుడితే కాలుస్తాం. రిజల్ట్స్ వస్తే కాలుస్తాం. రిజల్ట్స్ రాకపోయినా కాలుస్తాం. పరీక్షలు అయిపోతే కాలుస్తాం. పరీక్షలు జరక్కపోయినా కాలుస్తాం. ఎన్నికల్లో గెలిస్తే కాలుస్తాం, ఓడిపోయినా కాలుస్తాం. దీపం వెలిగిస్తే చాలు, ఫైరింజన్ వేసుకొచ్చి గగ్గోలు పెట్టే పిరికిదేశంరా మీది. మా డబ్బూ, మా ధైర్యం మీకెక్కడివిరా ?

విదేశ్ : నిజమేరా బాబూ ! ఈ విషయంలో కూడా ఇండియానే గ్రేట్.

స్వదేశ్ : చూశావా ? ముందు పూర్ జోక్ అదీ ఇదీ అన్నావ్. ఇప్పటికి నీతో ముచ్చటగా మూడుసార్లు ఒప్పించాన్రా, ఇండియానే రిచ్ అని !

విదేశ్ : ఖర్చుదేముందిరా ? ఎవడైనా పెడతాడు. పదికోట్లు కూడా పది నిమిషాల్లో తగలెయ్యొచ్చు. సంపాదించడంలోనే ఉందిరా అసలైన గొప్పతనం. ఇండియాలో ఎవరికుందిరా అంత సంపాదన ?

స్వదేశ్ : అక్కడే ఉందిరా మాకూ, మీకూ తేడా ! మీకు ఆఫీసుకెళితే గానీ డబ్బు రాదు. కళ్ళు తెరిచి చూడాలే గానీ ఇండియాలో ఎటు చూసినా డబ్బే. అసలు ఎప్పుడూ లక్ష్మీదర్శనానికి నోచుకోని దరిద్రజీవితం గదరా మీది.

విదేశ్ : ఒరే ! ఒరే ! స్వదీ ! అమెరికాని అలా అంటే నేనొప్పుకోన్రా ! నాక్కోపమొస్తుంది. అసలు నీ ఉద్దేశమేంటో చెప్పు.

స్వదేశ్ : మీ యవ్వారాలన్నీ క్రెడిట్ కార్డుల్తోనేగా జరిగేది. ఇహ మీరు డబ్బు మొహం చూసేదెప్పుడు ? అందుకని మీకు లక్ష్మీదర్శనం లేదన్నాను.

విదేశ్ : అలా అంటావా ? అలాగైతే సరే ! ఒప్పుకున్నాను. మరి ఇండియాలో ఎటు చూసినా డబ్బేనని ఇందాక ఓ గొప్ప స్టేట్ మెంట్ పడేశావు గదా ! ఎక్కడ్రా ? నాకేం కనిపించట్లేదేం ? కొంపదీసి నువ్వీమధ్య గబ్బర్ సింగ్ ముఠాలో గాని చేరావేంటి ?

స్వదేశ్ : ముఠాలెందుకోయ్ ఉద్యోగాలుండగా ? ఒక ప్రశ్న వేస్తా, సమాధానం చెప్పు. మీ దేశంలో ఒక పోలీసాఫీసర్ ఏ మాత్రం సంపాదిస్తాడు ?

విదేశ్ : నెలనెలా జీతమొస్తుంది, ఒక ఇల్లు కడతాడు. రెండు కార్లు ఉండొచ్చు. అది కాక కొద్దిగా స్టాక్స్ లో ఏమైనా పెడతాడేమో ! అంతే !

స్వదేశ్ : ఆపరా బాబూ ! ఇహ చెప్పకు. అమెరికా పేదరికం తల్చుకుంటే నాకు గుండె తరుక్కుపోతోంది. అదే మా దేశంలోనైతే పోలీసాఫీసరంటే సొంత వ్యాపారాలుంటాయి. పరిశ్రమలుంటాయి. కార్లే కాదు, ఏకంగా బస్సులూ, లారీలూ కూడా ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఉంటుంది. డజన్ ఫ్లాట్ లూ, ఇళ్ళూ ఉంటాయి. ఇద్దరు ముగ్గురు పెళ్ళాలుంటారు. ఏం చేస్తే మీ పోలీసాఫీసర్ మా పోలీసాఫీసర్ తో సమానమవుతాడంటావురా ? మా కానిస్టేబుల్ సంపాదనలో సగం కూడా లేదు గదరా నాయనా మీ పోలీసాఫీసర్ల సంపాదన !

విదేశ్ : మహాప్రభో ! నన్నింక వదిలేయ్. లొంగిపోయాను. పూర్తిగా లొంగిపోయాను. మీ United States of india - ఇదొక ధనికదేశం.

స్వదేశ్ : సో, ఆ పూర్ కంట్రీలో ఉద్యోగం పోయిందని చెప్పి ఊరికే వర్రీ అవకు. ఈ రిచ్ కంట్రీలో నువ్వెలాగైనా హ్యాపీగా బతకొచ్చు. ఇహ వచ్చెయ్... బయల్దేరి మా యింటికొచ్చెయ్.

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070