సచిన్ టెండుల్కర్ ఇటీవల సాధించిన మైలురాయి--వన్డేలలో 17000 పరుగులు పూర్తిచేయడం.
సచిన్ టెండుల్కర్ వన్డేలలో 17వేల పరుగుల మైలురాయిని ఏ స్టేడియంలో అందుకున్నారు--ఉప్పల్ స్టేడియం (హైదరాబాదు).
17వేల పరుగులను సచిన్ టెండుల్కర్ ఎవరి బౌలింగ్‌లో పూర్తిచేశారు--హిల్ఫెనాస్ (ఆస్ట్రేలియా).
వన్డేలలో సచిన్ టెండుల్కర్ ఇంతవరకు ఎన్ని సెంచరీలు పుర్తిచేశాడు--45.
సచిన్ టెండుల్కర్ తొలి అంతర్జాతీయ వన్డే వేదిక--గుర్జన్‌వాలా (పాకిస్తాన్).
సచిన్ టెండుల్కర్ ఏ జట్టుపై వన్డేలలో అత్యధిక పరుగులు చేశాడు--ఆస్ట్రేలియా.
వన్డే ఇన్నింగ్సులో సచిన్ టెండుల్కర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు--186(నాటౌట్).
వన్డేలలో అత్యధిక వ్యక్తిగత స్కోరు 186* సచిన్ ఏ జట్టుపై సాధించాడు--న్యూజీలాండ్.
వన్డేలలో 17వేల పరుగుల మైలురాయిని ఎన్నవ వన్డేలో పూర్తిచేశాడు--435వ వన్డే (424వ వన్డే ఇన్నింగ్స్).
సచిన్ ఇంతవరకు వన్డేలలో సాధించిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల సంఖ్య--60.
మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు సచిన్‌కు వన్డేలలో ఎన్ని సార్లు లభించాయి--12..
No comments:
Post a Comment