Thursday, November 5, 2009

భావోద్వేగాలను నియంత్రించడం అంటే

భావోద్వేగాలను నియంత్రించడం అంటే ఇదీ - నిజముగా జరిగిన సంఘటన

అందరూ అంటూంటారు "మేము ఎంత కటిన పరిస్థితులలోనైనా దృఢముగా ఉంటాము" అని. కాని చిన్న ఓటమి ఎదురవగానే పాతాళానికి కృంగిపోతారు. కాని క్రింద సంఘటన చదవండి. ఒక ఇంటర్వ్యూలో అభ్యర్థి మానసిక సామర్థ్యాన్ని పరీక్షించడానికి అడిగిన ప్రశ్న. ఇది నిజముగా జరిగినది.

ఆ ప్రశ్న ఏమిటంటే:

"మీ అమ్మ గనుక వేశ్య ఐతే?"

చాలామంది అభ్యర్థులు ఈ ప్రశ్న విని నిశ్చేష్టులయ్యారు. కొందరు కన్నీళ్ళు పెట్టుకొన్నారు. కొందరు ప్రశ్నించిన అధికారిని కొట్టబోయారు. ఇంచుమించు మనము కూడా అలానే ప్రవర్తిస్తామనుకోండి.

కాని ఒకే ఒక అభ్యర్థి తడుముకోకుండా ఆలోచించి చెప్పిన సమాధానం ఏమంటే:

"మా అమ్మ గనుక వేశ్య ఐతే మా నాన్న ఒక్కడే ఆమెకు విటుడు"
ఆశ్చర్యపోయారా ? ఎంతమందికి ఇంత మానసిక స్థైర్యం ఉంటుంది?

ఇది మన భారతదేశంలోని ఒక యాజమాన్య సంస్థ (management institute) లో నిజముగా అడిగిన ప్రశ్న

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070