మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న, చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులో పోడుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
Saturday, August 15, 2009
Thursday, August 13, 2009
ఆఁకొన్న కూడె యమృతము
ఆఁకొన్న కూడె యమృతము
తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్
సోఁకోర్చువాఁడె మనుజుఁడు
తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!
తాత్పర్యం: లోకంలో ఆకలి వేసినప్పుడు అన్నమే అమృతము, బాధ పొందకుండా ఇచ్చువాడే దాత, ఆవేశాన్ని ఓర్చుకొనేవాడే మానవుడు, ధైర్యం కలవాడే వంశశ్రేష్ఠుడు.
ఆకలితో ఉన్నప్పుడు అన్నం అమృతంలాగా ఉంటుందంటున్నారు. ఈ సంగతి మనందరికీ కనీసం ఒక్కసారయినా అనుభవం అయ్యే ఉంటుదని కదా...! అసలు అలాంటివి అప్పుడప్పుడు జరిగితేనే మనకు కూడా ఆ విలువ తెలిసి వస్తుంది.
ఈ సంగతి చెప్తుంటే నాకొకటి జ్ఞాపకం వస్తుంది. నేను ఇంటర్మీడియట్ చదవడానికి హాస్టల్ లో మొదటిసారిగా చేరాను. మెస్ కి వెళ్ళిన ప్రతీ పూట నా కంచంలో కనీసం సగభాగం పడెయ్యడానికి ఉండేది. నిజానికి ఆ హాస్టల్ లో భోజనం చాలా బావుంటుంది. ఆ సంగతి నాకు తరవాత వేరే వేరే hostels కి వెళ్ళినప్పుడు అర్ధం అయింది :) అప్పట్లో నాకు రోజూ సరిగ్గా తినబుద్ది కాక పడేస్తూనే ఉండేదాన్ని. అలా ఎంత అన్నం వేస్ట్ అయ్యిందో అప్పుడు ఆలోచించలేదు కానీ, ఇప్పుడు గుర్తు వస్తే మాత్రం చాలా బాధగా ఉంటుంది. అయితే ఒక సారి నేను Masters చదువుతున్నప్పుడు ఒక ఆదివారం ఉదయం నుంచి ఏమీ తినక చాలా ఆకలిగా ఉంది. మా మెస్ లో ఆదివారం ప్రత్యేకంగా మంచి వంటలు చేసేవాళ్ళు. ఆ రోజే మధ్యాహ్నం క్లాస్ ఎక్కువసేపు ఉండటంవల్ల మెస్ కి ఆలస్యంగా వెళ్ళాను. అప్పటికి అన్ని అయిపోయి పాత్రలు ఖాళీగా ఉన్నాయి. అసలారోజు ఎంత ఆకలేసిందో.. క్యాంటీన్ కూడా ఉండదు ఆ సమయానికి...చాలా బాధగా అనిపించింది. ఇలాంటప్పుడు అసలే ఇల్లు కూడా గుర్తొస్తుందిగా ... అన్ని కలిసిపోయి చాలా బాధపడిపోయాను. మొత్తానికి ఆ సంఘటన ఎందుకో నన్ను బాగా కదిలించింది. నాకే తెలీకుండా నాలో చాలా మార్పు వచ్చేసింది. అప్పటినుంచి ఏ తిండి పథార్దాలు వృధాగా పడేయ్యలేదు. ముందే చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెం పెట్టుకోడం అలవాటు చేసుకున్నాను. ఒకవేళ ఏదయినా నచ్చకపోయినా చాలా కష్టపడి తినడానికే ప్రయత్నిస్తున్నాను. మొత్తానికి ఒక చిన్న సంఘటన అనుకోకుండా నాలో చాలా మంచి అలవాటునీ, మార్పునీ తీసుకొచ్చింది. చిన్నప్పుడు అన్నం తిననని అలిగితే మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్పేది. మనం అన్నం ముందు కూర్చోగానే అన్నం భయపడుతూ ఉంటుందట మనమేమి అంటామో అని. మనం పేచీలు పెట్టకుండా ఆనందంగా తినేస్తే సంతోషంగా ఉంటుంది. మన దగ్గరికెప్పుడూ వస్తుందంట, లేకపోతే మనకి దొరకదంట. అందుకే మనం మాత్రం ఎప్పుడూ ఆహారాన్ని వృధా చేయకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఆ మాత్రం తినడానికి లేక ఎన్నో కోట్ల మంది ప్రపంచంలో అల్లాడుతున్నారు కదా...అందుకే మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం..!
బాధపడకుండా ఇచ్చేవాడే దాత అంటున్నారు కదా..! అసలు నాకనిపిస్తుంది ఒక మనిషిగా అవసరంలో ఉన్నవాళ్ళకి సహాయం చేయడం కనీస మానవ ధర్మం కదా..! మన దగ్గర మన అవసరానికంటే ఎక్కువగా ఉన్నది ఏదయినా లేని వాళ్ళకి ఇవ్వడం లో ఎంత సంతోషం, తృప్తి ఉంటాయో...ఒక్కసారయినా చేస్తేనే తెలుస్తుంది. అంత సంతృప్తి ఒక పది వేలు ఖర్చుపెట్టి మనకోసం బట్టలు, బంగారంలాంటివి కొనుక్కున్నా రాదు. అసలు అయినా ఒకవేళ అలా మనం చేయగలిగిన సహాయం ఏదయినా చేసినా మనమేదో దానం చేసినట్టు కాదని నాకనిపిస్తుంది. దానం అనేది మరీ పెద్ద పదమేమో కదా..!
ఏది ఏమైనా.. ఈ పద్యంలో నీతి ఎంత గొప్పదో కదా.
మీరేమంటారూ మరిఆఁకొన్న కూడె యమృతము

మీరేమంటారూ మరిఅక్కరకు రాని చుట్టము
అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
నెక్కినఁ బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!
తాత్పర్యం: అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందుకు పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయును.

ఓడలు బండ్లవ్వచ్చూ
ఓడల బండ్లును వచ్చును
ఓడలు నాబండ్ల మీద నొప్పుగ వచ్చును
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ!
తాత్పర్యం: నావలపై బళ్లు, బళ్లపై నావలు వచ్చునట్లే, భాగ్యవంతులకు దారిద్య్రం, దరిద్రులకు భాగ్యం పర్యాయంగా వస్తూంటాయి.
అందరూ అంగీకరించాల్సిన ఒక గొప్ప జీవన సత్యాన్ని చాలా సరళంగా చెప్పారు ఈ పద్యంలో.. ఈ సంగతి మనకి తెలిసినదిగానే అనిపించినా నిజానికి ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలామంది మర్చిపోతుంటారు. సిరిసంపదలు శాశ్వతం కాదని తెలిసినా సిరిననుసరించే గౌరవమర్యాదలు ఇవ్వడమనేది లోక రీతి అయిపోయింది. భాగ్యవంతుల అడుగులకు మడుగులొత్తడం ఒక ఎత్తయితే.. సంపద లేదన్న కారణంగా శక్తి సామర్ధ్యాలు ఉన్నవారిని చిన్న చూపు చూడడం మరింత బాధాకరమైన విషయం.
ఒక వ్యక్తికి ఎంత వరకు విలువని ఇవ్వాలి, ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలి అనే విషయాన్ని వాళ్ల కులగోత్రాలు, వంశ చరిత్ర, సిరిసంపదలు వగైరా.. లాంటి విషయాలని చూసి నిర్ధారణకి రాకుండా వాళ్ల వాస్తవీకమైన వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వగలిగినట్టయితే మనకు చాలా సమస్యలు రాకుండా ఉంటాయి. ఉదాహరణకి ఒక అమ్మాయికి లేదా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారనుకోండి. అప్పుడు పరిగణింపబడే మొదటి విషయాలు ఎక్కువ శాతం వాళ్ల స్టేటస్ కి సంబంధించినవే ఉంటాయి. ఒకవేళ ఈ స్టేటస్ లు తక్కువైన మంచి అబ్బాయి లేదా అమ్మాయి మనకు తెలిసి ఉన్నా కూదా.. ఆ సంబంధానికి పెద్దగా మొగ్గు చూపరు చాలా మంది.
అసలు అమెరికా సంబంధాల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయనీ, దూరదేశం వెళ్ళిన ఆడపడుచులకు అన్యాయం జరుగుతోందనీ.. చాలా మంది ఆవేదన చెందుతూ ఉంటారు. ఇది కాదనలేని సత్యం. కానీ, దీనికి నిజమైన బాధ్యులెవరు?? ప్రతీ తల్లిదండ్రులు ఒక చోట చేరి మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడంటే , మా అల్లుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడని.. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇవే ముచ్చట్లు. కొంతమంది అయితే ఇండియా లోనే పిల్లలు ఉద్యోగం చేస్తున్నారని చెప్పుకోడానికి తెగ ఇబ్బంది పడిపోతుంటారు. మరి కొంతమంది బతిమాలి, బలవంతం చేసి మరీ, విదేశాలకి తోలేస్తూ ఉంటారు పిల్లల్ని స్టేటస్ కోసం... విదేశీ సంబంధాలంటే అదేదో.. గొప్ప భోగం అనుకుంటూ మిగతా విషయాలకి తక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఆదరాబాదరాగా పెళ్ళిళ్ళు చేసెయ్యడం. చివరికి ఏదయినా సమస్య వస్తే అందరూ బాధపడడం. చాలా మంది అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లి జరిగేలోపు అబ్బాయి కుటుంబం నుంచి ఎన్ని రకాల డిమాండ్లు వచ్చినా గానీ, తొందరగా వదులుకోవడానికి ఇష్టపడరు. కట్నం అనీ, లాంఛనాలనీ వాళ్లు కోరికల లిస్టు పెంచుకుంటూ పోతున్నా గానీ, మంచి సంబంధం ఎలాగో ఆ మూడు ముళ్ళు పడిపోతే బాగుణ్ణు... మళ్ళీ ఇలాంటి గొప్ప సంబంధం దొరకదేమో.. అనుకుంటూ పాపం చాలా ఇబ్బందులు పడుతూ పెళ్ళిళ్ళు జరిపిస్తారు. కానీ, వీళ్ళిలా అడుగుతున్నారంటే, వీళ్ళ వ్యక్తిత్వం ఎంత నికృష్టంగా ఉన్నట్టు.. ఎందుకులే వదిలేద్దాం అని మాత్రం అనుకోరు.. ఎంతో చదువు, ఆస్తి ఉన్న మగ పెళ్ళివారు కూడా మంచి తరుణం మించిపోయిన రాదు.. అనుకుంటూ బోలెడు డిమాండ్స్ చేస్తూ ఉంటారు. అమ్మాయి అందంగా ఉండీ, నెలకి అయిదంకెల్లో సంపాదిస్తున్న గానీ, ఈ లిస్టులో మాత్రం ఏమీ మార్పులుండవు.
ఏమిటో.. ప్రపంచం ఎంతో పురోగమిస్తుందంటారు. కులాల మధ్య ద్వేషాలు, స్టేటస్ ల గొడవలు మాత్రం గత వందేళ్ళ నుంచీ అలాగే ఉన్నాయి. ఎప్పటికీ భద్రంగా ఉంచడానికి అనేకానేక వారసులు పుడుతూనే ఉన్నారు. ఇక ఇంతేనేమో మన సమాజం
ఏది ఏమైనప్పటికినీ..ఈ పద్యం లో చెప్పినట్టుగా.. సిరిసంపదలు శాశ్వతం కాదనీ, మనిషి నిజమైన వ్యక్తిత్వమే అన్నిటినీ మించిన పెద్ద ఆస్తి అనీ ప్రతీ ఒక్కరు తెలుసుకోవడమే కాకుండా.. నిజంగా పాటించగలిగితే ఎంత బావుంటుందో కదా..!! ఎవరిదాకానో ఎందుకు గానీ.. ప్రతీ ఒక్కరం మన దగ్గరి నుంచే ఆరంభిస్తే సరి..!! ఏమంటారూ

సుమతీ శతకం
నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా
ధారాళమైన నీతులు
నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ!
తాత్పర్యం: మంచిబుద్ధి గలవాడా! శ్రీరాముని దయవల్ల నిశ్చయముగా అందరు జనులనూ శెభాషని అనునట్లుగా నోటి నుంచి నీళ్లూరునట్లు రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను.
With the grace of Rama
Certainly to gain acceptance by one and all
Unimpeded flow of morals
I'll narrate, with mouth-watering taste, O! wise one

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..!
తోటమాలి నీ.. తోడు లేడులే..!
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..!
లోకమెన్నడో చీకటాయెలే ..!
నీకిది తెలవారని రేయమ్మా..!
కలికీ మా చిలకా.. పాడకు నిన్నటి నీ రాగం..!
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..!
తోటమాలి నీ తోడు లేడులే..!
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..!
లోకమెన్నడో చీకటాయెలే ..!
చెదిరింది నీ గూడు గాలిగా... చిలకా గోరింకమ్మ గాథగా...
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా..ఆ..ఆ..
తనవాడు తారల్లో చేరగా.. మనసు మాంగల్యాలు జారగా..
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా...!
తిరిగే భూమాతవు నీవై.. వేకువలో వెన్నెలవై..
కరిగే కర్పూరము నీవై.. ఆశలకే హారతివై..
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..!
తోటమాలి నీ.. తోడు లేడులే..!
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..!
అనుబంధమంటేనే అప్పులే.. కరిగే బంధాలన్నీ మబ్బులే..
హేమంత రాగాల చేమంతులే.. వాడిపోయే.. ఆ..ఆ..
తన రంగు మార్చింది రక్తమే.. తనతో రాలేనంది పాశమే..
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే...!
పగిలే ఆకాశము నీవై.. జారిపడే జాబిలివై..
మిగిలే ఆలాపన నీవై.. తీగ తెగే వీణియవై..
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..!
తోటమాలి నీ తోడు లేడులే..!
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..!
లోకమెన్నడో చీకటాయెలే ..!
మరి ఈ రాగాన్ని మీరు download చేసుకోవాలనుకుంటే ఈ link చూడండి.
భారమైన మనసుతో.. సెలవు తీసుకుంటున్నాను..!

సిరివెన్నెల సాహిత్యం
మనందరికీ ఎన్నెన్నో నచ్చిన పాటలు ఉంటాయి. కొన్ని పాటల్లో సంగీతం మదిని మెరిపిస్తే.. మరి కొన్ని పాటల్లో సాహిత్యం మురిపిస్తుంది.. మరి కొన్నీటిలో గాయకుల గాత్రం మైమరిపిస్తుంది. ఏదయితేనేం.. ఆయా పాటలు మాత్రం మన మనసుని ఆహ్లాదపరుస్తాయన్నది మాత్రం వాస్తవం. మన సినిమాల్లో అడపా దడపా మంచి మంచి పాటలు వచ్చి మనల్ని అలరిస్తూ ఉంటాయి. ఎన్నెన్నో వచ్చి వెళ్తుంటాయి కాబట్టి.. కాలగమనంలో కొన్ని మరచిపోతుంటాం. ఎక్కడో అనుకోకుండా ఆ పాట వినపడగానే.. పాటతో పాటుగా ఆ పాటలు ఇదివరకు విన్నప్పటి గత స్మృతులు.. దాన్ని అల్లుకున్న భావాలెన్నో మనని ముప్పిరిగొంటాయి. అలా అనుకోకుండా ఒక చక్కని పాట గుర్తొస్తే భలే సంతోషంగా అనిపిస్తుంది. ఆ ఉద్దేశ్యంతోనే.. నా బ్లాగులో అప్పుడప్పుడూ కొన్ని పాటల్ని గుర్తు చేస్తూ ఉంటాను.
కొన్ని అద్భుతమైన పాటలు ఒకోసారి ప్రజాదరణకు నోచుకోవు. సినిమా ఫ్లాప్ అవ్వడమో లేక మరింకేదో కారణాల వాళ్ళో ఆ పాటలు ఎక్కువ మంది దరి జేరవు. ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పే ఈ 'ఎవరో ఒకరు ఎపుడో అపుడు' అనే ఈ పాట 1992 లో వచ్చిన రేవతి నటించిన 'అంకురం' అనే సినిమాలోనిది. ఈ పాట తెలిసిన వారందరూ అద్భుతమనే అంటారు. కానీ.. తెలియని వారు కూడా చాలామందే ఉన్నారన్నది నిజం. విచిత్రం ఏంటంటే.. ఈ పాట పల్లవి తెలిసిన చాలామందికి పాట మొత్తం తెలీదు. మరి కొంతమందేమో ఈ పాట ఉందని తెలుసు గానీ పెద్దగా వినలేదు అంటారు. నిజమేనోయ్.. ఈ పాట చాలా బావుంటుంది. కానీ.. ఈ మధ్య విననే లేదు అనే వారు మరి కొందరు.
సరే లెండి.. తెలిసి ఉన్నా.. తెలీకపోయినా.. మనందరం గుర్తు చేసుకోదగ్గ అద్భుతమైన పాట ఇది. సంగీత దర్శకుడు 'హంసలేఖ' స్వరపరచిన ఈ పాటని చిత్ర, బాలు ఆలపించారు. ఎన్నెన్నో ఆణిముత్యాల్లాంటి పాటల్ని రాసిన సిరివెన్నెల గారి కలం నుంచి జాలువారింది ఈ పాట. మనిషిలో పట్టుదలను, స్ఫూర్తిని రగిలించేలా భావం ఉన్నా పాటలు ఎన్నో ఉన్నాయి మన తెలుగులో. కానీ.. ఈ పాటలో సిరివెన్నెల గారి ప్రయోగాలు ఎంతో అబ్బురపరుస్తాయి. తొలివేకువ కూత కూసే కోడిని, నిశీధిలో తిరుగాడే మిణుగురు పురుగులనూ, ఎండ వేడికి ఒళ్ళు మండి ఆవిరయ్యే సముద్రాన్ని.. ఇలా ప్రకృతిలో ఉన్న వాటన్నిటినీ చూసి మనం స్ఫూర్తిని పొందాలని సిరివెన్నెల గారు చెప్పిన మాటలు పాట విన్న వారి మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయని నా అభిప్రాయం. అంతెందుకు అసలా పల్లవి చూడండి.. ఎవరన్నా ఏదైనా పనికి తొలి అడుగు వెయ్యాలా వద్దా అన్న సంశయంలో ఉంటే "ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకు.. అటో ఇటో ఎటోవైపు.." ఈ వాక్యాలు వింటే.. ఖచ్చితంగా ముందడుగు వేసి తీరుతారు. ఏదైనా క్రొత్త బాటలో నడవాలన్న తలంపు వచ్చినవారికి ఈ రెండు మాటలు చెప్తే మది ఆత్మవిశ్వాసంతో నిండిపోతుంది. కాదంటారా.? "మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి.. మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి.. వెనుక వచ్చువాళ్ళకు బాట అయినది.."
సరే మరి.. నా వంతు అయిపొయింది. ఇంక ఇప్పుడు పాట సాహిత్యం చూసి, పాట విని అభిప్రాయం చెప్పే వంతు మీది :)
పాట వినడం కోసం బ్లాగు పైన ఎడమ వైపున ఉన్నా విడ్జెట్ చూడండి. ఈ పాట download చేసుకోవాలంటే ఇక్కడ చూడండి.
ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
నడవరా ముందుగా.. అటో ఇటో ఎటో వైపు..
అటో ఇటో ఎటో వైపు..!
మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి..
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి..
వెనుక వచ్చువాళ్ళకు బాట అయినది..!
ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
నడవరా ముందుగా.. అటో ఇటో ఎటో వైపు..
అటో ఇటో ఎటో వైపు..!
కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా..
అనుకొని కోడి కూత నిదరపోదుగా ..
జగతికి మేలుకొలుపు మానుకోదుగా ..
మొదటి చినుకు సూటికా దూకి రానిదే..
మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే ..
వాన ధార రాదుగా నేల దారికి..
ప్రాణమంటూ లేదుగా బ్రతకటానికి ..
ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
నడవరా ముందుగా.. అటో ఇటో ఎటో వైపు..
అటో ఇటో ఎటో వైపు..!
చెదరక పోదుగా చిక్కని చీకటి..
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి ..
దానికి లెక్క లేదు కాళరాతిరి..
పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతిని..
రెప్ప వెనక ఆపనీ కంటి నీటిని..
సాగలేక ఆగితే దారి తరుగునా..?
జాలి చూపి తీరమే దరికి చేరునా..?
ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
నడవరా ముందుగా.. అటో ఇటో ఎటో వైపు..
అటో ఇటో ఎటో వైపు..!
యుగములు సాగినా నింగిని తాకక..
ఎగసిన అలల ఆశ అలసిపోదుగా..
ఓటమి ఒప్పుకుంటూ ఆగిపోదుగా..
ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే..
అంత వాడి ఆవిరై వెళ్లి చేరదా..?
అంత గొప్ప సూర్యుడు కళ్లు మూయడా..?
నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా..?
ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
నడవరా ముందుగా.. అటో ఇటో ఎటో వైపు..
అటో ఇటో ఎటో వైపు.