Thursday, October 29, 2009

సిరివెన్నెల సీతారామశాస్తి కధలు చదివారా?

సిరివెన్నెల సీతారామశాస్తి కధలు చదివారా?





మనందరికీ పాటల మేస్త్రి గా పరిచయం వున్న సిరివెన్నెల "సీతారామశాస్తి" గారు గతంలో "భరణి" పేరుతో కధలు రాసేవారట. వాటిలో ఏడు కధలను "ఎన్నొరంగుల తెల్లకిరణం" పేరుతో 2004 లో పుస్తకంగా ప్రచురించారు .
ఈ పుస్తకం నేను ఎప్పుడో చదివేసినా అప్ప్డు మీరు నేను అపరిచితులం కాబట్టి , ఇప్పుడు నా బ్లాగుద్వారా సిరివెన్నెల కధలను అందరికీ పరిచయం చెయ్యాలని నాప్రయత్నం.


"ఇందులో చాలాకధలు పురుడుపోసుకొవడం నాకుతెల్సు" ."వాటికోసం అతడుపడ్డ పురిటినొప్పులూ నాకుతెల్సు" .మూడపదులకి పైగా మేము ప్రాణస్నేహితులం. భుజాలు చరుచుకుంటూ పత్రికలకి కధలురాసేము................ అంటూ మాటలరచయిర "ఆకెళ్ళ"గారు తన మిత్రుని కధలను ,అవిరాయడానికి కవి అనుభవించిన వేదనను విస్లేషిస్తూ రాసిన "ఆప్తవాక్యం" పాఠకునికి రచయిత పడ్డ శ్రమను కళ్ళకుకట్టి పిండివంటలు వండుతున్నపుడు ముందుగా ముక్కుకుసోకే కమ్మనివాసనలా కధలపట్ల ఆసక్తిని ఆకలిని కలిగిస్తుంది.

ఇక ఈ పుస్తకంలోని ఏడురంగులు (ఏడుకధలు)
మహాశంతి
...................................
ఈ కధను రచయిత 28సార్లు రాశారట. అందుకేనేమో కధచదువుతు దృశ్యం పాత్రలూ మనకళ్ళముందు జీవం పోసుకుని కనపడతాయి. ఆ పరిసరాల్లో మనమే తిరుగుతున్న భావన కలుగుతుంది.

భూస్వాములకి విప్లవకారులకిమద్య నలిగిన పల్లెకధ. తనకొడుకుని పోగొట్టుకున్న రాజయ్య "ఎందుకు....ఎందుకూ...ఎందుకిదీ... అంటూ పడ్డవేదన ఈకధ.

మరో సింద్ బాధ్ కధ
.......................................................
"నేను తిన్న చావుదెబ్బ మీకుకధగా చెప్పుకుని నన్నునేను ఓదార్చుకుంటున్నా" ..........అని రచయిత స్వగతంలా
కధ చెప్పుకొచ్చారు. అనుకోకుండా కల్సివచ్చిన అదృష్టం అంతలోనే చేజారిపొతుంది. యాభైవేలు ప్రైజు గెలిచిన లాటరీ టికెట్టు స్వహస్తాల్లో ముక్కలై అదృష్టాన్ని చెత్తకుప్ప పాలుచేస్తుంది.

ఎన్నోరంగుల తెల్లకిరణం
..............................................................
ఇంట్లో కార్యక్రమం . అది పెళ్ళొ మరోటో కధ సగంవరకూ మనకు అర్ధంకాదు. అందరూ వచ్చారు. అంతా హడావిడీ. " మూడురోజులూ , వున్నట్టుంది భొరున రాగాలూ పెడబొబ్బలూ. అరగంటతిరక్కుండానే నవ్వులూ నవ్వుతున్నప్పుడు కేరింతలు. మళ్ళీ ఏదో తంతు జరుగుతున్నప్పుడు అందరూ సోకాలూ సానుభూతులూ..............
ఇది తప్పుకదా ,అని కొడుకు ఆవేదనా అతనికి దొరికిన సమాధానం ఈ కధ.
కధచదువుతుంటే మనజ్ఞాపకాలు రేగక మానవు.

మిగిలిన కధలు
చరిత్రచోరులు

ఇదో తిరుగుబాటు కధ

పోస్టుమార్టం

కార్తికేయుని కీర్తికాయం

కధలన్నీ మనచుట్టూనే తిరుగుతాయి. భావుకత, వుద్వేగం, కవిత్వం కలగలిపిన కధలు. మంచి అనుభాతిని మిగులుస్తాయి. ఎంతైనా " సిరివెన్నెల" కధలుకదా.

కొత్తపాళీ గారి సూచనకు ధన్యవాదాలు తెలుపుతూ.................
పుస్తకం : ఎన్నొ రంగుల తెల్లకిరణం
రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్తి
తొలి ప్రచురణ ; జనవరి, 2004

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070