Thursday, February 4, 2010

జీవించటము అంటే......


నీవలన చిరునవ్వుపొందిన మోములు
నీవలన ఆనందమయమైన మనస్సులు
నీవలన గమ్యముదొరికిన మనుషులు
నీవలన విజ్ఞానవంతమైన జనులు

దానినే అంటారు జీవించటము......

నీ రాక కోసము ఎదురుచూసే చూపులు
నీ మాట కోసము రిక్కించిఉండే చెవులు
నీ శ్రేయస్సు కోసము ప్రార్దించే చేతులు
నీ విజయాల కోసము కలలుకనే కన్నులు

దానినే అంటారు జీవించటము......

ప్రామాణికాలుగా మారిన నీ జీవిత సంఘటనలు
విలువలుగా మారిన నీ వ్యక్తిగత సూత్రాలు
మార్గదర్శకముగా మారిన నీ నియమబద్ద నిర్ణయాలు
పరిశోదనలుగా మారిన నీ పరిష్కార ప్రభోదనలు

దానినే అంటారు జీవించటము......
వెంటరావు ఆస్తుల కోసము మన వెంపర్లాటలు
కలసిరావు ధనము కోసము మన కర్కోటకాలు
నడచిరావు కీర్తి కోసము మన నానాపాట్లు
తోడురావు కోరికల కోసము మన తత్తరపాట్లు

మనం మార్చిన పరిస్థితులు మనం కూర్చిన సిద్దాంతాలు
మనం దిద్దిన జీవితాలు మనం ఇచ్చిన ఉత్పత్తులు
మనం చేసిన మంచిపనులు మనం ఓదార్చిన హృదయాలు
మనం నిలపెట్టిన నిజాలు మనం పంచిన ప్రేమలు

అవే మనకు మిగిలేది అవే మనతో వచ్చేది
అవే మనకు దక్కేది అవే మనతో నిలబడేవి
అవే మనకు సంత్రుప్తులు అవే మన ఆనందాలు
అవే శాశ్వత సత్యాలు అవే నిరంతర నిక్షేపాలు

ఇదే మానవ జీవిత సారం......
దానినే అంటారు జీవించటము......

---- ప్రభాకర రావు కోటపాటి

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070