Wednesday, February 3, 2010

ఎవరు నెర్పేరమ్మా ఈ కొమ్మకు


ఎవరు నెర్పేరమ్మా ఈ కొమ్మకు
పూలిమ్మని రేమ్మ రేమ్మకు
యెంత తొందరలే హరి పూజకు

ఫ్రొద్దుపొడవక ముందె పూలిమ్మని
కొలువయితివా దేవి నా కోసము !!2!!

తులసీ..తులసీ దయా పూర్ణ తలచి

మల్లెలివి నా తల్లి వరలక్ష్మి కి!!2!!
మొల్లలివి నన్నేలు నా స్వామికి
యేలీల సేవింతు యేమనసు కీర్తింతు!!2!!

సీతమనసే నీకు సింహాసనం
ఒక పూవ్వు పాదాల ఒక దివ్వె నీ వ్రాలా!!2!!
ఒదిగి నీయేదుట …ఇదే వందనం ఇదే వందనం.

ఈ పాట వింటున్నప్పుడల్లా నా మనస్సు మలయానిలము తాకిన అనుభూతి చెందుతుంది.శృతి చేసిన వీణపై హిందోళం రాగం పలికించినప్పుడు కలిగే మధుర భావం నా హృదయం అంతా నిండి పరవశం కలుగుతుంది.ఈ పాట మనస్సుకు మైమరపే కాదు బుద్ధికి ఆలోచనను కూడా కలిగిస్తుంది…అది ఎలాగంటారా?ఆ విషయానికే వస్తున్నాను.
సూర్యోదయం కాకమునుపే వృక్షాలు,మొక్కలు అంతా నిద్రలేస్తాయి. తొలి సంధ్య వేళ కల్లా హరి పూజకు పూలిస్తాయి.ఒక్క చెట్లేనా ఊహు!పశు పక్ష్యాదులు కూడా మేల్కొని భానోదయం కాక మునుపే మెల్కోని తమకు తోచిన రీతిలో ఆ పరమాత్మునికి,ఆయన సృష్టిలో భాగమైన మనను సేవిస్తాయి..ఒక్క మాటలో చెప్పాలంటే మనకన్న ముందరే తెల్లవారుఝామునే ప్రకృతిలొని జీవకోటి(ఒక్క మనుష్యులు తప్ప) అంతా మేల్కొని తమ తమ విద్యుక్తధర్మాలను నిర్వహిస్తాయి.మనమేమో బారెడు పొద్దెక్కినా లేవము ఒక వేళ లేచినా ప్రొద్దున్నే చెయ్యవలసిన కార్యక్రమములు చెయ్యము(శుచిగా తయారవ్వడం,దైవారధనకు కనీసం ఐదు నిముషాలు అన్న వెచ్చించకపోవడం మొదలైనవి).అంటే మనకన్న పశువులే నయమని మనం ఒప్పుకుని చూపిస్తున్నాం కదా ప్రపంచానికి.తెల్లవారకముందే నిద్రలేచి హరి పూజకై కొమ్మ కొమ్మకు రెమ్మ రెమ్మకు పూలిస్తున్నవు,ఎంత భాగ్యశాలివమ్మ నీవు అని వృక్షదేవతను కొనియాడుతూనే, ప్రొద్దుటే నిద్రలేవని మనలను సున్నితంగా మందలిస్తున్నారు కవి.

లక్ష్మీ అంశతోనున్న తులసి శ్రీహరికి అత్యంత ప్రియము.శ్రీమన్నారయణునికి ప్రియమైన తులసీ దయాంతరంగురాలవై నా కోసం మా ఇంట వెలిసినావా…విష్ణుహృత్కమలవాసిని అయిన శ్రీ వరలక్ష్మీ ఇదిగో నీ ప్రీతికై మల్లెపూలు తెచ్చాను.నన్నేలు నా స్వామి కోసం మొల్లలు పెట్టుకుంటున్నాను.ఆహా!కృష్ణ శాస్త్రి గారి హృదయం ఎంత రసభరితము కాకపోతే ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకుండా ఇక్కడ భక్తి,శృంగార రసాలు ఒకేసారి గుప్పించగలిగారు..

శ్రీ రామచంద్రా!నిన్నే విధంగా సేవించను?ఏ విధంగా కీర్తించను?మీమేంత చేసినా అది నీకు తక్కువే కదా!సీతమ్మ తల్లి నిన్న ప్రేమించినంతగా,ఆరాధించినంతగా ఎవ్వరూ నిన్ను ప్రేమించి ఆరాధించి ఉండరు కదా!అందుకే మా అమ్మ సీత మనసే నీకు సింహాసనమైనది.ఒక పువ్వు నీ దగ్గర ఎలా శరణమంటుందో,ఒక దీపం తన తుది జీవిత క్షణం వరకు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఎలా సేవించుకుంటుందో అలా నీ శరణు గోరి,చేరి సేవించుకుంటాను.అందుకు ముందుగా నా వందనములు అందుకోవయ్యా!

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070