ఇక్కడ "అమ్మ" అంటే నాకు అత్యంత ఇష్టమైన ౩
ఒకటి. అమ్మలుగన్న ముగురమ్మల మూలపుటమ్మ
రెండు . మాయమ్మ (మా అమ్మ)
మూడు. అమ్మ స్వచ్చంద సేవ సమితి
అమ్మతో సాంగత్యం అమృత బాన్డంబు..
అమ్మ కరుణకున్న అవధి ఏది..
అమ్మ లేని నాడు ఆహార్యమేలరా..
అమ్మ ఉన్న చోటే ఆనందమున్డురా!!!
అమ్మ కోసం ఆత్మ అర్పింపజాలన
అమ్మ అవని ఉన్న నా అత్మ యేనురా
అమ్మ ఊసులేని ఈ శ్వాస ఏలరా
అమ్మతో ఈ బంధం ఏనాటిదోనురా!!!
అమ్మ చల్లని చూపు ఆశీరవచనంబు
అమ్మరా ఈ అమ్మ లలితమ్మర..
అమ్మరా ఈ అమ్మ మీ అమ్మరా!!!
నిముషమైనా కదల నువ్వు లేక నా ముందు
నిముషమైనా కదల నువ్వు లేక మదియందు
నిను చేరు, నిను కొల్చు, నిను చూచు భాగ్యంభు
కల్పించావే నాకు కల్పతరువా !!!
క్షణమైన స్తంభించు నువ్వు లేక లోకంభు,
క్షణములో తొలగించు ఈ మయజాలంబు,
అమ్మ చల్లని చూపు అవనిపైన
సృష్టించు అంతట సంతసంభు!!!
చూపవే.. ఆ కరుణ నిముషమైనా
శాశ్వతముగా.. శోకం లోకమొదులు
చూపవే నీ కరుణ చూపవే తల్లి
బాపవే కష్టాలు బాపవే తల్లి
నిను కొల్చు, నిను తల్చు నిష్కల్మషముగా
దరి చేర్చుకో తల్లి దాపు జేరి ..
చేయవే ఈ జన్మ సార్ధకంబు..
నిను కొల్చి, నిను తల్చి అర్పించులాగా
నీ కొరకే సాగించు జీవితంబు!!!
ఏల నాకీ భ్రమలు, పైపైన మాయలు?
ఎప్పటికిన్ కొల్చు నిను శాశ్వతముగా ?
ఎప్పటికిన్ స్తుతించు నిను శ్వాసలాగా ?
ఏమిటీ భంధాలు, ఏమిటీ ప్రేమలు?
ఏమిటీ పుట్టుకలు, ఏమిటీ చావులు?
ఏమిటీ ఘోరాలు, ఏమిటీ నేరాలు?
చూపవే తల్లి వీటి పరిష్కారాలు..
చూపవే జనని నిత్య సంతోసము
చూపవే జనని నిత్య ఆనందము
ఏ వాడనైనా, ఏ ఉరునైనా,
ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ..
ఎందెందు నువ్వున్న అందందు..
ఎల్లకాలములలో, ఎల్ల వేళలలో,
అన్ని భావాలలో, అన్ని భావనలలో,
అన్ని మార్గాలలో, అన్ని జాతులలో,
అన్ని కులాలలో, అన్ని మతములలో..
అర్పింతు నా జన్మ, అర్పింతు నా కర్మ
అర్పింతునే నీకు సర్వంబును..
తీసుకో ఓ జనని, చేర్చుకో తల్లి..
కలుపుకో నీ యందు కనికరము చేతన్
కాపాడు, రక్షించు ,కవ్వించు, నడిపించు జనని
తొలగించావే భ్రమలు తొందరగ తల్లీ
చేర్చుకో నీ దరికి, చేర్చుకో తల్లి,..
పుట్టగానే జనులు పుట్టునే కోర్కెలు
నువ్వు-నేనులనే జంట స్వార్ధముల్
నాది-నాది అంటూ సాగేను జీవితము
కట్టేరు మేడలు, కట్టేరు భవనాలు,
చేరేరు చివరికి మట్టిలోన
తెలుపవే జనని నీవేమిటో నాకు
చూపవే తల్లి కర్తవ్య మార్గము
ఏల పుట్టిన్చావో...ఎటుల నడిపించేవో..ఎడేడో తిప్పేవో..ఎందుకొరకో.
ఏమిటో మర్మంబు, ఏమిటో కార్యంబు, తెలియచేయవే నాకు ఇప్పుడైనా ,
తెలియచేయవే నాకు కొంచెమైనా,
ఎందుకీ నాటకము, ఎందుకీ భుటకము, ఎందెందు వెతికినా నువ్వే కదా, ఏమేమి చేసిన నువ్వే కదా...
ఇది నా అంతరంగం...మీ అమ్మ శ్రీనివాస్
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న, చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులో పోడుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment