Monday, November 30, 2009

ఎందువలనా అంటే


నాలో ఎన్ని ఆశలో అలల్లా పొంగుతున్నవీ.. నీతో ఎన్ని చెప్పినా మరెన్నో మిగులుతున్నవీ.. నక్షత్రాలన్నీ ఇలా కలలై వచ్చాయి.. చూస్తూనే నిజమై అవి ఎదటే నిలిచాయి.. అణువణువు అమృతంలో తడిసింది అద్భుతంగా..!!


ఎందువలనా అంటే..!?

ఉషోదయాన పచ్చటి చిగురులపైనపసిమొగ్గలపైన నిలచిన నీటిముత్యాలను చూస్తే నాకెందుకంతఆనందమంటే చెప్పలేను..
తెల్లవారుజామునే చెట్టు కింద తెల్లని తివాచీలా పరచుకున్న పారిజాతాలను చూస్తే నాకెందుకంతపులకింతంటే చెప్పలేను..
సాయంసంధ్యలో అరవిరిసిన సన్నజాజులతో నిండిపోయిన తీగను చూస్తే నాకెందుకంత పరవశమంటేచెప్పలేను..
వినీలాకాశంలో ఠీవీగా నించుని అల్లరిగా చూస్తున్న నెలవంకని చూస్తే నాకెందుకంత మైమరపంటేచెప్పలేను..
నల్లని రేయిలో మిణుకు మిణుకుమంటూ మెరిసే నక్షత్రాలను చూస్తే నాకెందుకంత కేరింతో చెప్పలేను..
వసంతంలో విరగబూసిన పూదోటని చూస్తే నాకెందుకంత మురిపెమంటే చెప్పలేను..
శరచ్చంద్రుని వెన్నెల వెలుగులు చూస్తే నాకెందుకంత తన్మయత్వమంటే చెప్పలేను..
హేమంతంలో ఎడతెరిపి లేకుండా వర్షించే జడివానని చూస్తే నాకెందుకంత ఉల్లాసమంటే చెప్పలేను..
శిశిరంలో కురిసే మంచుపూలను అద్దుకుని శాంతిసందేశంలా కనిపించే ప్రకృతిని చూస్తే నాకెందుకంతప్రశాంతతంటే చెప్పలేను..
రెక్కలు విప్పి స్వేచ్ఛగా మబ్బుల్లో విహరించే విహంగాన్ని చూస్తే నాకెందుకంత సంతోషమంటే చెప్పలేను..
నీ పక్కనుంటే.. నీ చేయందుకుంటే.. నాకెందుకింత నిశ్చింతంటే చెప్పలేను..
నా చిన్ని మనసు చిరుస్పందనలకి కారణమేమని బదులివ్వగలను.!?

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070