Monday, November 30, 2009

జగదీశ్ చంద్ర బోస్-నవంబర్ 30 1858


జగదీశ్ చంద్ర బోస్



জগদীশ চন্দ্র বসু జగదీష్ చంద్ర బోస్
జగదీష్ చంద్ర బోస్ అతని పరిశోధనాలయంలో...
జగదీష్ చంద్ర బోస్ అతని పరిశోధనాలయంలో...
జననం
నవంబర్ 30 1858
మైమెన్‌సింగ్తూర్పు బెంగాల్ (ప్రస్తుతముబంగ్లాదేశ్), బ్రిటీష్ ఇండియా
మరణం
నవంబర్ 23 1937 (వయసు: 78)
గిరిడీబెంగాల్ ప్రావిన్స్, అవిభాజ్య భారతదేశం
నివాసం
అవిభాజ్య భారతదేశం
జాతీయత
భారతీయుడు
రంగము
భౌతిక శాస్త్రముజీవ భౌతిక శాస్త్రంజీవ శాస్త్రంవృక్ష శాస్త్రంపురాతత్వ శాస్త్రంబెంగాలీ సాహిత్యంబంగ్లా సైన్సు ఫిక్షన్
సంస్థ
ప్రెసిడెన్సీ కళాశాల
మాతృ సంస్థ
కలకత్తా విశ్వవిద్యాలయం
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
లండన్ విశ్వవిద్యాలయం
ప్రాముఖ్యత
మిల్లీమీటర్ తరంగాలు
రేడియో
క్రెస్కోగ్రాఫ్
మతం
హిందూ
సర్ జగదీష్ చంద్ర బోస్, (నవంబర్ 301858 – నవంబర్ 231937) బెంగాల్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త.[1] ఇతడు రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు.[2] ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు.[3] ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.

జీవితం

ఆంగ్లేయుల సామ్రాజ్యంలోని బెంగాల్ ప్రావిన్సు లో జన్మించిన బోసు కలకత్తా లోని సెయింట్ జేవియర్ కళాశాల నుంచి డిగ్రీ పుచ్చుకున్నాడు. తరువాత ఆయన వైద్య విద్య కోసంలండన్ వెళ్ళాడు. కానీ ఆరోగ్య సమస్యల వలన చదువును కొనసాగించలేకపోయాడు. తిరిగి భారతదేశానికి వచ్చి కోల్‌కత లోని ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్ర ఆచార్యుడిగా చేరాడు. అక్కడ జాతి వివక్ష రాజ్యమేలుతున్నా, చాలినన్ని నిధులు, సరైన సౌకర్యాలు లేకపోయినా తన పరిశోధనను కొనసాగించాడు.


పరిశోధనలు

ఈయన వైర్‌లెస్ సిగ్నలింగ్ పరిశోధనలో అద్భుతమైన ప్రగతిని సాధించాడు. రేడియో సిగ్నల్స్ ను గుర్తించడానికి అర్థవాహక జంక్షన్ లను మొట్టమొదటి సారిగా వాడింది జగదీశ్ చంద్రబోసే. కానీ తన పరిశోధనలను వ్యాపారాత్మక ప్రయోజనాలకు వాడుకోకుండా తన పరిశోధనల ఆధారంగా ఇతర శాస్త్రవేత్తల మరిన్ని ఆవిష్కరణలకు దారి తీయాలనే ఉద్దేశ్యంతో బహిర్గతం చేశాడు.


ఆవిష్కరణలు

తరువాత వృక్ష భౌతిక శాస్త్రంలో కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడు. తాను రూపొందించిన పరికరం క్రెస్కోగ్రాఫ్ ను ఉపయోగించి వివిధరకాలైన పరిస్థితుల్లో మొక్కలు ఎలా స్పందిస్తాయో పరిశోధనాత్మకంగా నిరూపించాడు. తద్వారా జంతువుల మరియు వృక్ష కణజాలాలో సమాంతర ఆవిష్కరణలు చేశాడు. అప్పట్లో తాను కనిపెట్టిన ఆవిష్కరణకు సన్నిహితుల ప్రోధ్బలంతో ఒక దానికి పేటెంట్ కోసం ఫైల్ చేసినా ఆయనకు పేటెంట్లంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆయన చనిపోయిన 70 సంవత్సరాల తరువాత కడా విజ్ఞాన శాస్త్రానికి ఆయన చేసిన సేవలను ఇప్పటికీ కొనియాడుతూనే ఉన్నాం.


మూలాలు

  1.  బహుముఖ ప్రజ్ఞాశాలిఫ్రంటలైన్ పత్రిక 21 (24), 2004.
  2.  శాంటిమే చటర్జీ, ఈనాక్షి చటర్జీ, సత్యేంద్ర నాథ్ బోస్, 2002 reprint, p. 5, నేషనల్ బుక్ ట్రస్ట్, ISBN 8123704925
  3.  ఎ.కె.సేన్(1997). "సర్ జెసీ బోస్ అండ్ రేడియో సైన్స్", Microwave Symposium Digest 2 (8-13), p. 557-560.

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070