Thursday, September 10, 2009

విశ్వనాథ సత్యనారాయణ

విశ్వనాథ సత్యనారాయణ

* విశ్వనాథ సత్యనారాయణ ఎప్పుడు జన్మించారు--సెప్టెంబర్ 10, 1895.
* విశ్వనాథ సత్యనారాయణ ఎక్కడ జన్మించారు--కృష్ణా జిల్లా నందమూరు గ్రామంలో.
* 1957లో విశ్వనాథ సత్యనారాయణ ఏ అకాడమీకి ఉపాధ్యక్షులయ్యారు--సాహిత్య అకాడమీ.
* ఏ సంవత్సరంలో విశ్వనాథ సత్యనారాయణ విధానమండలికి నామినేట్ అయ్యారు--1958.
* విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగలు రచనను హిందీలోకి అనువదించినది--పి.వి.నరసింహరావు (సహస్రఫణ్ పేరుతో).
* ఏ రచనకు గాను విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు లభించింది--శ్రీమద్రామాయణ కల్పవృక్షం.
* విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞాన్‌పీఠ్ పురస్కారం ఏ సంవత్సరానికి గాను లభించింది--1970.
* జ్ఞాన్‌పీఠ్ అవార్డు పొందిన వారిలో విశ్వనాథ సత్యనారాయణ ప్రత్యేకత--ఈ పురస్కారం పొందిన తొలి తెలుగు కవి.
* విశ్వనాథ సత్యనారాయణను మాట్లాడే వెన్నుముకగా అభివర్ణించినది--శ్రీశ్రీ.
* విశ్వనాథ సత్యనారాయణ ఎప్పుడు మరణించారు--అక్టోబర్ 18, 1976.

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070