Wednesday, January 13, 2010

Speccy - సిస్టం సమాచారం తెలుసుకోవటానికి ...


ప్రముఖ సాప్ట్ వేర్లు CCleaner, Defraggler, Recuva లను అందించిన Piriform నుండి వచ్చిన మరొక సాప్ట్ వేర్ Speccy. Speccy ని ఉపయోగించి మన కంప్యూటర్ కి సంబంధించిన సమగ్ర సమాచారం అంటే ప్రాసెసర్ బ్రాండ్ మరియు మోడల్, హార్డ్ డిస్క్ సైజ్ మరియు స్పీడ్, RAM, మదర్ బోర్డ్, ఆప్టికల్ డ్రైవ్, ఆపరేటింగ్ సిస్టం మొదలగు వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. My Computer పై మౌస్ రైట్ క్లిక్ చేసి Properties ని సెలెక్ట్ చేసుకొంటే మనకు మన సిస్టం కి సంబంధించిన కొంత సమాచారం మరియు Device Manager కి వెళితే హార్డ్ వేర్ కి సంబంధించిన సమాచారం టూకీ గా తెలుసుకోవచ్చు. అదే Speccy తో అయితే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.


మరింత సమాచారం కోసం Speccy సైట్ ని చూడండి.

డౌన్లోడ్: Speccy (సైజ్: 1.29 MB)

ధన్యవాదాలు
Posted by శ్రీనివాస బాబు at 4:24 PM

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070