Tuesday, August 18, 2009

హిందూధర్మశాస్త్రాలు

హిందూమతము నకు సంబంధించిన ఆధారాలు, నియమాలు, సిద్ధాంతాలు, తత్వాలను వివరించేవి హిందూ ధర్మశాస్త్రాలు. ఇవి ప్రధానంగా సంస్కృత భాష లో వ్రాయబడ్డాయి. ఈ విధమైన సంస్కృత సాహిత్యమును మతపరంగా ఆరు విభాగాలు, మతం తో సంబంధం లేకుండా నాలుగు విభాగాలుగా పరిగణిస్తారు.

విషయ సూచిక

ప్రధాన విభాగాలు

శ్రుతులు

"శ్రుతి" అనగా "వినిపించినది". అంటే ఈ విధమైన శాస్త్రాలు సామాన్యమైన వ్యక్తులచే రచింపబడలేదు. "మంత్రద్రష్ట" లైన ఋషులకు అవి "వినిపించినవి". చతుర్వేదాలు - అనగా ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణవేదము - ఇవన్నీ శ్రుతులు. మనుష్యులచే రచింపబడలేదు గనుక వీటిని "అపౌరుషేయములు" లేదా "నిత్యములు" అని కూడా అంటారు. ఇవి హిందూ ధర్మమునకు మౌలికమైన ప్రమాణములు.

ఒక్కొక్క వేదంలో భాగాలైన సంహిత, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తులు కూడా శ్రుతులేఅగును.

ఉపవేదములు

నాలుగు ఉపవేదాలు ఉన్నాయి. అవి ఆయుర్వేదము, గాంధర్వ వేదము (సంగీత సంబంధ మైనది), ధనుర్వేదము (యుద్ధ సంబంధమైనది) మరియు స్థాపత్య వేదము ( శిల్ప విద్యకు సంబంధించినది).

వేదాంగములు

వేదాంగములు ఆరు. అవి శిక్ష, ఛందస్సు, నిరుక్తము, వ్యాకరణము, కల్పము మరియు జ్యోతిషము.

ఇంకా ఇతిహాసము అయిన మహాభారతము "పంచమవేదము"గా ప్రసిద్ధి చెందినది.


స్మృతులు

"స్మృతి" అనగా "స్మరించినది" అనగా "గుర్తు ఉంచుకొన్నది". ఇవి శ్రుతుల తరువాతి ప్రమాణ గ్రంధాలు. విధి, నిషేధాల(మానవులు, సంఘము ఏవిధంగా ప్రవర్తించాలి, ఏవిధంగా ప్రవర్తించ కూడదు అనే విషయాలు) గురించి స్మృతులు వివరిస్తాయి.

మతంతో సంబంధంలేని విభాగాలు

  1. సుభాషితములు
  2. కావ్యములు
  3. నాటకములు
  4. అలంకారములు

హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ · బృహదారణ్యక
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ · కేన · ముండక
మాండూక్య ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైష్ణవ
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070