Monday, August 3, 2009

నశించిపోయే ప్రతి ఒక వృక్షం

నశించిపోయే ప్రతి ఒక వృక్షం....జీవకోటిదహనానికి అది ఒక కాష్టం


నశించిపోయే ప్రతి ఒక వృక్షం
జీవకోటిదహనానికి అది ఒక కాష్టం
విలయప్రకృతికి సాగే ఒక శ్రీకారం
క్షామానికి చేరే ఒక ప్రయాణం

వర్షరహిత్యముతో బీళ్ళయిపోయే పొలాలు
విషతుల్యముతో నిండిపోయే గాలులు
అధికధరలతో మండిపోయే సరుకులు
విపరీతవేడితో అల్లాడిపోయే జీవులు
ప్రాణభయముతో వణికిపోయే మనుషులు

వస్తున్నాయి ఆరోజులు తెలుసుకో
కుదిపేస్తాయి జీవితాలు మేలుకో

నశించిపోయే ప్రతి ఒక వృక్షం
జీవకోటిదహనానికి అది ఒక కాష్టం
విలయప్రకృతికి సాగే ఒక శ్రీకారం
క్షామానికి చేరే ఒక ప్రయాణం

తగ్గించాలి ప్లాస్టిక్ పదార్దాల వాడకం
కట్టిపెట్టాలి అతి ప్రయాణాల ఇంధనం
పొదుపుచేయాలి అనవసర విద్యుతుల వినియోగం
ఆపివేయాలి మధ్యమందు సీసాల విసిరివేయటం
నిర్వహించాలి వ్యర్ధ పదార్ధాల సేకరణం
కదిలిపో అలుపెరుగని కార్యాచరణతో
ఉండిపో తరిగిపోని పచ్చదనము తో
నశించిపోయే ప్రతి ఒక వృక్షం
జీవకోటిదహనానికి అది ఒక కాష్టం
విలయప్రకృతికి సాగే ఒక శ్రీకారం
క్షామానికి చేరే ఒక ప్రయాణం
తరిగిపోతున్న వ్యవసాయ భూములు
కృంగిపోతున్న భూగర్భ జలరాశులు
కురుస్తున్న అతినీలలోహిత కిరణాలు
కనుమరుగైపోతున్న విస్తృతజంతు జీవరాశులు
ప్రభలిపోతున్న విస్తృతరోగకారక వైరస్
వినిపించుటలేదా ఆ ప్రమాద ఘంటికలు
తలపించుటలేదా యమ పద ఘట్టనలు
నశించిపోయే ప్రతి ఒక వృక్షం
జీవకోటిదహనానికి అది ఒక కాష్టం
విలయప్రకృతికి సాగే ఒక శ్రీకారం
క్షామానికి చేరే ఒక ప్రయాణం
సస్యశ్యామలముగా మారాలి బంజరుభూములు
పుష్కలముగా కావాలి భూగర్భ జలరాశులు
నిరంతరముగా చేయాలి వృక్ష ప్రణాళికలు
పరిమితముగా వాడాలి కాగితపు ఉత్పత్తులు
ప్రళయవేగంగా రావాలి ప్రకృతిరక్షణపధకాలు

విద్యార్దులంతా....
ఉపాద్యాయులంతా....
ఉద్యోగులంతా ....
వ్యాపారులంతా ....
వ్యవసాయదారులంతా ....
నాయకులంతా....
విజ్ఞానవేత్తలంతా....
కలిసి నడించాలి ఈ హరిత విప్లవం....
కలిసి ఆపాలి రాబోయే ఆ క్షామం.
----------------------ప్రభాకర రావు కోటపాటి

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070