Friday, June 5, 2009

మిత్రమా నీ సాంగత్యము అపురూపము

దివ్య లక్షణ సమన్విత మిత్రమా నీ సాంగత్యము అపురూపము ఆనంద మకరంద సందోహము

నీ సుందర వదనము కనిపిస్తుంది నిండు చందామామ లా
నీ సుమధుర పలుకరింపు వినిపిస్తుంది సెలయేరు సవ్వడి లా
నీ కనుల కదలిక అగుపిస్తుంది కరుణా సముద్రము లా
నీ దరహాసము ప్రసరిస్తుంది పూల గుభాలింపు లా
నీ సంభాషణ సాగుతుంది వీణానాదము లా
నీ చిరునవ్వు గోచరిస్తుంది ఇంద్రధనుస్సు లా
నీ నవ్వుల జల్లు కురిపిస్తుంది పరిమళ విరిజల్లు లా
నీ సత్ప్రవర్తన స్మరింపచేస్తుంది నిర్మల జ్యోతి లా
నీ నిస్వార్ద సేవ తలపింపచేస్తుంది దైవసన్నిది లా
నీ వినయ విదేయత స్పురిస్తుంది ముద్దమందారము లా
నీ నిత్య సంతుస్టత విస్తరిస్తుంది నిండు మేఘము లా
నీ స్థిత ప్రజ్ఞత పనిచేస్తుంది దివ్వఔషదము లా
నీ విశాల దృక్పధము మురిపింపచేస్తుంది మాతృ ప్రేమ లా
నీ పవిత్ర సంకలృము ప్రోత్సహిస్తుంది వినూత్న ఉత్తేజము లా
నీ విషయ వివరణ సాగుతుంది అమరగానము లా
నీ చైతన్య స్ఫూర్తి చేయుతనిస్తుంది ఉద్దేపన శక్తి లా
నీ సౌశీల్య ప్రవృత్తి ఊరటనిస్తుంది అమృత వర్షిని లా
నీ నిష్కల్మష నడవడి దర్శింపచేస్తుంది మహోన్నతశిఖరము లా
నీ సహనసంస్కారము ప్రకాశిస్తుంది సూర్యబింబము లా
నీ ప్రేమార్ద్ర హృదయము మారుస్తుంది ఈ భూమిని స్వర్గము లా

అందుకే సంబ్రమాశ్చర్య సంజనితము మన పరిచయము

--ప్రభాకర రావు కోటపాటి

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070